Read more!

English | Telugu

సినిమా పేరు:నాన్ స్టాప్
బ్యానర్:సుమన్ ప్రొడక్షన్స్
Rating:---
విడుదలయిన తేది:Feb 4, 2010
పాషర్లపూడి పిచ్చయ్య ఉరఫ్‌ పా.పి (ఎమ్మెస్‌ నారాయణ) సినిమా ప్రొడ్యూసర్‌. అతని కొడుకు అజయ్‌ (నూతన నటుడు) ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తూంటాడు. విష్ణు (సుమన్‌బాబు) మధు ప్రియ గ్రూప్స్‌కి అధిపతి. అతని చెల్లెలు ప్రియ (నూతననటి) అజయ్‌ని ప్రేమిస్తుంది. అజయ్‌ క్యారెక్టర్‌ గురించి ఎంక్వయిరీ చేసిన విష్ణుకి అజయ్‌ ఓ చీటర్‌ అని తెలుస్తుంది. ఆ విషయం ప్రియకి చెప్పినా పట్టించుకోదు. అజయ్‌ నిజస్వరూపం ప్రియకి తెలియడం కోసం విష్ణు కాస్తా డాన్‌ విష్ణుగా అవతారం ఎత్తుతాడు. ఆ తర్వాత అజయ్‌ నిజస్వరూపం ఎలా బయట పెట్టాడన్నది మిగతా కథ.
ఎనాలసిస్ :
ప్రేమ ముసుగులో అమ్మాయిలు అబ్బాయిల చేతిలో ఏ విధంగా మోసపోతున్నారని చూపించే ప్రయత్నం ఈ చిత్రం ద్వారా చేశారు దర్శక నిర్మాతలు. ఆ విషయంలో కొంత వరకు సక్సెస్‌ కాగలిగినా కథనం విషయంలో మాత్రం సరైన శ్రద్ద కనబరచలేదు. ట్‌ డేటెడ్‌ సీన్లతో కథని బలహీనపరిచారు. నాన్‌స్టాప్‌గా కామెడీని పండించాలనుకుని తీసుకున్న సీన్లు కాస్తా బోరు కొట్టించే విధంగా తయారయ్యాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: సుమన్‌బాబు ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో సుమన్‌ కనిపించి మెప్పించాడు. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ఆయన పలికించిన హావభావాలు బావున్నాయి. నాయికా నాయికలు కొత్తవారు కాబట్టి నటన విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెస్‌ నారాయణ కామెడీ ఈ చిత్రానికి ప్లస్‌పాయింట్‌ ప్రొడ్యూసర్‌ పిచ్చయ్యగా ఆయన నటన బావుంది. అలాగే పిళ్లా ప్రసాద్‌ నటన కూడా బావుంది. జూనియర్‌ సుబ్బారావు జూస్‌గా మాస్టర్‌ భరత్‌ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక మిగతా నటీ నటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. మాటలు-: మల్లి అందించిన మాటలు అక్కడక్కడా బావున్నాయి. త్రివిక్రమ్‌ మాటలలో కనిపించే ప్రాస ఈ చిత్రంలో కనిపిస్తుంది. సంగీతం-: యావరేజ్‌గా ఉంది.డాన్స్-‌: మూడు పాటల్లో సాంగ్స్‌ చిత్రీకరణ బావుంది. అలాగే డాన్స్‌ కంపోజింగ్‌ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.ఓవరాల్‌గా ఈ చిత్రం కాన్సెప్ట్‌ బాగున్నా స్కీ న్‌ప్లే వీక్‌గా ఉండడం ఈ చిత్రానికి ప్రధాన మైనస్‌.