Read more!

English | Telugu

సినిమా పేరు:నా స్టైలే వేరు
బ్యానర్:దిషిర ప్రొడక్షన్స్
Rating:---
విడుదలయిన తేది:Jun 12, 2009
శివరాం(డాక్టర్‍ రాజశేఖర్)ఒక లాయర్‍.అతని తండ్రి ఒక మేజిస్ట్రేట్‍ (చలపతిరావు),అన్న(బెనర్జీ)ఎసిపి.కానీ శివరాం 'లా'ప్రాక్టీస్ మానేసి జానీ (ఆలీ)తో కలసి పచ్చి తాగుబోతుగా మారతాడు.దానికి కారణం అతను చేసుకోవాలనుకున్న అమ్మాయి చనిపోవటమే.దానికి తన కుటుంబం కూడా కారణమని నమ్ముతాడు శివరాం.పార్వతి (భూమిక)విశ్వనాథ్‍(విజయకుమార్‍) అనే ఒక కోటీశ్వరుడి కూతురు.శివరామ్ గుండె ఆపరేషన్‍ కోసం అమెరికా వెళ్తాడు.అప్పుడు పార్వతిని ఎవరో చంపబోతున్నారని ఆమె దగ్గర పనిచేసే ప్రవీణ్‍ అనే వ్యక్తి చెప్పటంతో,ఆమె అక్కడ నుండి పారిపోటానికి ప్రయత్నిస్తుండగా ఆమెను కిడ్నాప్ చేస్తారు.అప్పుడామె తనను బంధించిన రూం నుండి ఎవరికో ఫోన్ చేస్తే ,ఆ ఫోన్ కాల్‍ శివరాంకి వస్త్రుంది.అక్కడి నుంచి శివరామ్ ఆమెను తప్పించి తన ఇంటికి తీసుకువస్తాడు.కానీ ఆమెను తీసుకువెళటానికి ఆమె ఇంటి నుంచి మనుషులు వస్తే,'నేను శివరాంని పెళ్ళిచేసుకున్నానని"పార్వతి చెపుతుంది.పార్వతి తండ్రి అమెరికా నుండి వస్తున్నాడని ప్రవీణ్‍ ఫోన్ చేయటంతో పార్వతిని ప్రవీణ్‍ కి అప్పగించటానికి శివరాం తెస్తూండగా,అక్కడ ప్రవీణ్‍ బలవంతంగా పార్వతిని తీసుకెళతాడు.ఆ తర్వాత పార్వతి తండ్రి వచ్చి శివరాంతో నా కూతురిని పంపించమంటే, ఆమె నీ కూతురు కాదు నా భార్య అని చెప్పటంతో కోపం వచ్చిన పార్వతి తండ్రి వెళ్ళిపోతాడు.పార్వతిని కిడ్నాప్ చేసిన ప్రవీణ్‍ ఫోన్‍ చేసి శివరాంని పార్వతి తండ్రి నుండి 5కోట్లు తీసుకు రమ్మని లేకుంటే ఆమెను చంపేస్తాననీ చెపుతాడు.ఆ తర్వాతేం జరిగింది...అనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
దర్శకుడిగా రామ్ ప్రసాద్ బాగానే తీశాడు.కాకపోతే కథ క్లైమాక్స్ లో కొంచెం కన్ ఫ్యూజన్ కలుగుతుంది.కథ కొత్తదేం కాకపోయినా, కథనంలోనయినా కొత్తదనం ఉంటే బాగుండేది.ప్రేక్షకుడికి ఇది కుటుంబ కథా చిత్రంగా ప్రారంభమై,సస్పెన్స్ చిత్రమనిపిస్తూ,దాన్లో క్రైమ్ ఎలిమెంట్‍ ని జోడిస్తూ చివరికి ఇది దేనికీ సంబంధం లేని చిత్రంగా చూపించటం ఈ చిత్రంలోని పెద్దలోటు.శివరాం పాత్ర తాగుతూ ఉంటూనే చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటుంది.అదేమంటే అదొక లాయర్ పాత్రన్నారు.మందు కొట్టాక లాయర్‍ అయినా లయ్యర్‍ అయినా ఒకటే.ఇది చాలా సింపుల్ పాయింట్.ఇక హీరో అన్న అయిన బెనర్జీ పాత్ర ఈ చిత్రంలో అనవసరం.దానికొక పరమావధిలేదు.అలాంటి పాత్రలు కొన్నీ చిత్రంలో ఉన్నాయి.యమ్.యల్‍‍.ఎ.పాత్ర కూడా అలాంటిదే
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన - ఇక నటన విషయానికొస్తే రాజశేఖర్‍ షరా మామూలుగానే నటించాడు.భూమిక ఈ చిత్రంలో కూడా అందంగానే కనిపించింది.అలాగే నటించింది కూడా.ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆలీ పాత్ర.కుంటోడిగా కనిపిస్తూనే పాటల్లో ఆలీ బ్రహ్మాండంగా చేశాడు.మిగిలిన వారంతా ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారనే చెప్పాలి. సంగీతం - అనూప్ రూబెన్స్ సంగీతంలో కొత్తదనం వినిపించలేదు.అన్నీ విన్న పాటలుగానే అనిపించాయి.ఇక రీ-రికార్డింగ్‍ కాస్త ఫరవాలేదు. సినిమాటోగ్రఫీ - ఒక పాటలో పట్టపగలు ఆరు హెచ్.యమ్.లైట్లు పెట్టి చిత్రీకరించటం వల్ల ప్రయోజనం ఏమిటో అర్థం కాదు.కొన్ని సీన్లలో లైటింగ్‍ డల్‍గా కనిపిస్తుంది.అలాగే ఒక్కో పాటలో కూడా లైటింగ్‍ అలాగే ఉంది. మొత్తానికి కెమెరా వర్క్ ఈజ్ నాట్‍ అప్ టు ది మార్క్. ఎడిటింగ్‍ - ఈ డిపార్ట్ మెంట్‍ ఒకటి ఈ సినిమాలో బాగుంది. ఆర్ట్ - ఒ.కె. యాక్షన్ - ఫరవాలేదు. ఇది ఏ తరహాకి చెందిన చిత్రమో మనకర్థం కాదు.అన్ని ఎలిమెంట్లూ కలగలిపి తీశారు.చూసితీరాల్సిన చిత్రమేం కాదు.