Read more!

English | Telugu

సినిమా పేరు:నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్
బ్యానర్:కెబిసి (కుమార్ బ్రదర్స్ సినిమా)
Rating:---
విడుదలయిన తేది:Mar 6, 2009
సంజయ్‌శాస్త్రి (శివాజీ) బాగా ధనవంతులైన కుటుంబంలోని అమ్మాయిని ప్రేమలో పడేసి సెటిలయిపోవాలని అనుకుంటాడు. అందుకు అతను గోల్ఫ్‌ ఆటలో ప్రావీణ్యాన్ని సంపాదింస్తాడు. అతను అనుకున్నట్లుగానే గోల్ఫ్‌ ఆట ప్రాక్టీస్‌ కోసం వచ్చిన రిచ్‌ అమ్మాయి శ్రావ్య (కావేరి ఝా)తో ప్రేమలో పడతాడు. తమ ప్రేమ విషయం యు.ఎస్‌.లో ఉన్న తన తల్లిదండ్రులకి చెబుతానని యు.ఎస్‌. వెళ్ళిపోతుంది. ఆమె రాకకోసం ఎదురుచూస్తున్న సంజయ్‌కి ఫోన్‌ చేసి బ్యాంకాక్‌కి రమ్మని చెబుతుంది. అక్కడ తమ తల్లిదండ్రులని పరిచయం చేస్తానంటుంది. దాంతో బ్యాంకాక్‌ బయలు దేరతాడు సంజయ్‌. అదే ఫ్లైట్‌లో టైసన్‌ (బ్రహ్మానందం) కూడా బయలు దేరుతాడు. బ్యాంకాక్‌ చేరాక టైసన్‌ బ్యాగ్‌ సంజయ్‌కి సంజయ్‌బ్యాగ్‌ టైసన్‌కి ఛేంజవుతాయి. బ్యాంకాక్‌ వచ్చి బ్యాగ్‌ ఓపెన్‌ చేసిన సంజయ్‌కి అందులో మనిషి తలలు కనిపించడంతో షాకవుతాడు. ఇంతకీ ఆ తలలు ఆ బ్యాగ్‌లో ఎందుకున్నాయి? ఆ తలల వల్ల సంజయ్‌ ఎలాంటి ప్రమాదాలని ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా కథ.
ఎనాలసిస్ :
అసలు సినిమా టైటిల్‌కి కథకి ఏమాత్రం సంబంధం లేదు. సినిమాని ఏవిధంగా తీయకూడదో తెలుసుకోవాలంటే ఈ చిత్రం తప్పకుండా చూడాల్సిందే. కామెడీ కోసం అంటూ చేసిన ఈ ప్రయత్నం ఏమాత్రం ఆకట్టుకోకపోగా ప్రేక్షకులని అసహనానికి గురిచేస్తుంది. అసలు కథంటూ లేని ఈ చిత్రాన్ని ఎందుకు తీసారో దర్శక నిర్మాతలకే తెలియాలి. వారికి తెలుగు ప్రేక్షకులు మరీ ఇంత వెర్రిబాగులవారిలా కనిపిస్తున్నారో ఏమో మరి. ప్రతీ ఫ్రేంలోనూ ఈ చిత్రంలో వున్న లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఏ ఒక్క క్యారెక్టర్‌నీ సరిగ్గా ప్రెజెంట్‌ చేయలేక అసలు ఏం తీస్తున్నామో అనే సృహలేకుండా, ఏదో ఒకటి తీద్దామనుకుని తీసినట్లుంది ఈ సినిమా. సినిమా ప్రారంభించేముందు కథ గురించి తప్పకుండా చర్చించుకుంటారు. మరి ఈ సినిమా కథ చిత్ర దర్శక నిర్మాతలకి హీరో శివాజీకి ఏవిధంగా నచ్చిందో అస్సలు అర్థం కాదు. హీరోయిన్‌ చేత పాటల్లో ఎక్స్‌పోజింగ్‌ చేయించినంత మాత్రాన చొంగలు కార్చుకుంటూ ఆడియన్స్‌ థియేటర్‌లోకి వస్తారని అనుకునే దర్శక నిర్మాతలు ఉన్నన్ని రోజులు ఇలాంటి పిచ్చి సినిమాలు వస్తూనే వుంటాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన : సంజయ్‌శాస్త్రిగా శివాజీ నటన ఫర్వాలేదు, కావేరి ఝాది అంతా ఓవరాక్షన్‌. టైసన్‌ పాత్రలో బ్రహ్మానందం బాగానే చేసినాఅసలు కథే లేకపోవడంతో అంతా తేలిపోయింది. మిగిలిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. సంగీతం : ఆనంద్‌ సమకూర్చిన సంగీతం సోసోగానే ఉంది.