Read more!

English | Telugu

సినిమా పేరు:మౌనరాగం
బ్యానర్:శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్
Rating:2.25
విడుదలయిన తేది:Apr 8, 2010
చందు (తనీష్) తన మరదలు కావేరి(సుహాసిని) తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోతారు. దాంతో కావేరీ బరువు బాధ్యతలు చందుపై పడుతాయి. కావేరీ అంటే ఎంతో ప్రేమించే చందు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఆమెని చదివిస్తాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలనుకునే సమయంలో చందుని కాదని స్టేటస్ కోసం మరో వ్యక్తిని పెళ్లి చేసుకు౦టుంది కావేరీ.దాంతో మనస్తాపానికి గురైన చందు ఆత్మహత్య చేసుకోబోతుంటే సంధ్య (మధురిమ) రక్షిస్తుంది. తాను కూడా ప్రేమలో ఘోరంగా విఫలమయ్యానని, ప్రేమలో విఫలమయితే ఆత్మహత్య చేసుకోవడం తప్పని ఎదురు నిలబడి జీవితంలో సక్సెస్ ని అ౦దుకోవాలని చెబుతుంది. దాంతో చందు, సంధ్యలు ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తారు. ఇంతకీ సంధ్య చందుకి ఎలా పరిచయం అయింది..? సంధ్య, చందులు కలిసి ఏవిధంగా సక్సెస్ సాదించారన్నది తెరపై చూడాల్సిందే.
ఎనాలసిస్ :
ప్రేమలో విఫలమయితే ఆత్మహత్య చేసుకోవడంమే పరిష్కారం కాదని, జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని సక్సెస్ సాధించాలని నేటి యూత్ కి సందేశం ఇచ్చే సినిమా ఇది. ఫస్టాఫ్ కంటే సెకండ్ ఆఫ్ బావుంది. సె౦టిమెంట్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ సీన్ చూస్తుంటే రాజా సినిమా గుర్తుకి వస్తుంది. అయితే సె౦టిమెంట్ ని పండించడంలో దర్శకుడు సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా మధ్యతరగతి మహిళలకు అందుబాటులో ఉండే విధంగా వెహికల్ ని రుపోందించాలనేది హీరోయిన్ లక్ష్యంగా పెట్టడం బావుంది
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన :-చందు పాత్రలో తనీష్ నటన బావుంది. సుహాసిని నటన ఫర్వాలేదు. మధురిమ తన పాత్రని చాలా చక్కగా పోషించింది. తనకి లభించిన మంచి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది. సంగీత దర్శకుడు గిటార్ బాబుగా ఆలీ నవ్విస్తాడు. ఇక మిగతా నటీనటులు తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. మాటలు:- చింతపల్లి రమణ మాటలు బావున్నాయి. జీవా డైలాగ్ 'నేను పుట్టి౦ది,టివి9 పుట్టింది ఒకటే డేటు..అందుకే నేనేం చేసినా అది బ్రేకింగ్ న్యూసే అవుతుంది' లాంటి డైలాగులు ఆకట్టుకు౦టాయి. పాటలు:- భాస్కరభట్ల, వనమాలిలు సమకూర్చిన సాహిత్యం బావుంది. సంగీతం:- ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతంలోని సాంగ్స్ అన్నీ ఆకట్టుకుంటాయి, ముఖ్యంగా 'జాబిలికి వెన్నెలవ్వనా' పాట చాలా బావుంది. దర్శకత్వం:- ఫస్టాఫ్ కాస్త వీక్ గా డీల్ చేసినా సెకండాఫ్ టేకింగ్ బావుంది. సెంటిమెంటు సినిమాలని ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని చూడొచ్చు.