Read more!

English | Telugu

సినిమా పేరు:మేస్త్రి
బ్యానర్:సిరి మీడియా
Rating:2.00
విడుదలయిన తేది:Mar 12, 2009
ఒక దళితుడు మేజర్‌గా తొలిసారి రాష్ట్రపతి చేతుల మీదుగా శౌరుచక్ర పతకాన్ని అందుకుని, అందుకుగాను 5 ఎకరాల భూమిని పొంది, అందులో తన వారందరికీ డాక్టర్‌ అంబేడ్కర్‌ కాలనీ కట్టాలని అనుకుంటాడు. అతనే మేజర్‌ దేవరాజ్‌ (డాక్టర్‌ మోహన్‌బాబు). కానీ ఆ స్థలాన్ని భూపతి అనే అతను కబ్జా చేస్తాడు. ఆ స్థలాన్ని ఆ భూపతి నుండి తిరిగి తీసుకునే ప్రయత్నంలో మేజర్‌ దేవరాజ్‌ హత్యచేయబడతాడు. ఈ విషయం తెలుసుకున్న మరో మేజర్‌ నరసింహం (దాసరి నారాయణరావు) మంత్రిని కలసి న్యాయం అడిగి, అక్కడ న్యాయం జరగదని తెలుసుకుని తానే ఆ న్యాయం చేస్తానంటాడు. అక్కణ్ణించి తిరిగి వస్తూంటే నరసింహాన్ని మట్టుబెట్టే ప్రయత్నం జరుగుతుంది. దాన్నించి తప్పించుకున్న నరసింహం చదువురాని పాలకొల్లుగా అవతారమెత్తి షిప్‌ యార్డ్‌లో మేస్త్రిగా ఉంటాడు. అలా ఉంటూనే దేవరాజ్‌కి అన్యాయం చేసిన వాళ్ళమీద పగతీర్చుకుంటాడు నరసింహం. అయితే భూపతి కుటుంబం వెనుక ఉన్న శక్తి గోపాలకృష్ణ అనే స్వాతంత్ర సమర యోధుడు అనీ, అతని మనవడు ఆదిశేషే మేజర్‌ దేవరాజ్‌ని హత్యచేశాడని ఆలస్యంగా తెలుసుకున్న నరసింహం వాళ్ళ ఆటలెలా కట్టించాడన్నది మిగిలిన కథ...
ఎనాలసిస్ :
దర్శకతం గురించి కొత్తగా చెప్పటానికేమీ లేదు. సురేష్ కృష్ణ గతంలో ‘భాషా’ చిత్రంతోనే తానేంటో చూపించారు. ఇక స్క్రీన్ ప్లే చాలా బాగుంది. లేకపోతే ఇలాంటి పొలిటికల్ అండ్ ఎంటర్టైన్ మెంట్ లేని కథ జనానికి నచ్చే విధంగా తీయటం కత్తిమీద సామే. ఆ సాములో నిష్ణాతుడు దాసరి. ఇక నిర్మాణపు విలువలు బాగానే ఉన్నాయి. సంగీతం :- దీన్లో వందేమాతరం వినపడటమే కాదు ఈ సంగీతంలో కనపడతాడు. అంటే అతని మార్క్ అంత స్పష్టంగా ఈ చిత్ర సంగీతంలో ఉంటుంది. ఉన్న పాటలు బాగానే ఉన్నాయి. మాటలు :- ఈ చిత్రంలోని మాటల గురించి నిజానికి ప్రత్యేకంగా చెప్పాలి. మోహన్ బాబు రాహుల్ దేవ్ తో దళితుడి గురించి చెప్పే మాటల్లో ఫైర్ బాగుంది. ఇక దాసరి చెప్పే ‘బ్రిటీష్ వాళ్ళు భయపడింది నేతాజీ ఆగ్రహానికి కాదు.... బాపూజీ నిగ్రహానికి”, “గొప్ప వాళ్ళ ఫోటోలు వెనుక పెట్టుకుంటే గొప్పవాళ్ళయిపోతారా....? ఇంట్లో కుక్కకి టైగర్ అని పేరు పెడితే అది నిజంగానే పులవుతుందా...? వంటి మాటలకు ప్రక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఇవన్నీ ఎవర్ని ఉద్దేశింది పెట్టిన మాటలో అందరికీ తేలిగ్గానే అర్థమవుతాయి. విజయకుమార్ తో “మాపార్టీ నినాదం సామాజిక న్యాయం”, “మేధావులతో చర్చించి, శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటాం” వంటి మాటలు చెప్పించటం, షాయాజీ షిండేతో “ఇంకోళ్ళ రైలు మేమెందుకేక్కుతాం. మారైలు మాకొస్తుంది” అనే మాట చెప్పించడం ఎవర్ని ఉద్దేశించో పిల్లలకు కూడా అర్థమవుతుంది. ఇవన్నీ చిరంజీవి రాజకీయ పార్టీని ఉద్దేశించేననే విషయం ప్రేక్షకులకు బాగానే అర్థమయ్యింది. ఇక పాటల్లో కూడా చిరంజీవి రోడ్ షోలనుద్దేశించే ఒక పాత ఉంది. అప్పుడు చూపిన షాడో ప్లే లో చిరంజీవి డ్యాన్స్ మూమెంట్ ని కూడా శాంపిల్ గా చూపించారు. ఎడిటింగ్ :- బాగుంది. ఆర్ట్ :- బాగుంది. యాక్షన్ :- బాగుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఇది పక్కా మాస్ చిత్రం. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాని తీశారు. మీకు రాజకీయాలంటే ఆశక్తి ఉంటే ఈ చిత్రం చూడండి.