Read more!

English | Telugu

సినిమా పేరు:మెంటల్ కృష్ణ
బ్యానర్:మోహన్ మీడియా క్రియేషన్స్
Rating:---
విడుదలయిన తేది:Jan 1, 2009
ఒక పరీక్షకు చాలా కష్టపడి తయారయిన అమ్మాయి ఆ పరీక్షలో తప్పటం, అదే పరీక్షను తమకు పాలుపోసే అబ్బాయి అవలీలగా పాసవటంతో ఆ అమ్మాయికి అతని మీద ప్రేమపుట్టి, అతన్ని పెళ్ళి చేసుకోవాలనిపించి, అతన్ని అడగటం, ఆ పెళ్ళికి తమ పెద్దవారిని కూడా ఆ అమ్మాయి ఒప్పించటం, కానీ అతను పెళ్ళి సమయానికి జంపయి, తన అత్త కూతుర్ని చేసుకోవటంతో ‘మెంటల్ కృష్ణ’గా పిలువబడే ముద్దుకృష్ణ (పోసాని కృష్ణ మురళి) అనే పాత్ర సీన్ లోకి వస్తుంది. ఎప్పటినుంచో ఆమె మీద కన్నేసిన ముద్దుకృష్ణ ఆమెను పెళ్ళి చేసుకోటానికి ముందుకు రావటంతో ఆమె అతన్నే పెళ్ళి చేసుకుంటుంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే ముద్దుకృష్ణ మగతనం లేని మగాడు. ఈ విషయం శోభనం రోజునే ఆమెకు అర్థమవుతుంది. దానికి తోడు అతను హోమో సెక్సువల్. రఘుబాబు అతని మేట్. అలాంటి వాడికి భార్య మీద ఉండే అనుమానం, ఆ అనుమానంతో తన వికృత శాడిజంతో అతను ఆమెను మానసికంగా పెట్టె చిత్ర హింసలు ఎలా ఉంటాయో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఒకదశలో తన ఫ్రెండ్ తో కాపురం చేసి తనకు పిల్లల్ని కనిపెట్టమంటాడు ముద్దుకృష్ణ. అలాంటి వాడితో కాపురం చేసే భార్య బ్రతుకేమవుతుంది అనేది ఈ చిత్రం మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఒకప్పుడు కన్నడ ఉపేంద్ర కొత్తగా వచ్చిన సమయంలో అతనే హీరోగా “ఉపేంద్ర’’ అనే చిత్రం వచ్చింది. ఆ చిత్రంలో అతని పిచ్చి మాటలు, తిక్క అలంకరణ, మెంటల్ తనం చేష్టలు చూట్టానికి జనానికి ముఖ్యంగా మహిళా ప్రేక్షలుకకు బాగా ఇబ్బంది కలిగింది. ఈ ‘మెంటల్ కృష్ణ’ చిత్రం కూడా ఇంచుమించు ఆ స్టైల్ ల్లోనే ఉంటుంది. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, మాటల వరకూ ఈ చిత్రానికి ఉపెంద్రే స్ఫూర్తి అని అనుకోవాల్సి ఉంటుంది. ఈ చిత్రం చూడాలంటే సహనం కావాలి. అందుకు కారణం ఈ సినిమాలో కొన్ని విషయాలు సగటు ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. ఒక శాడిస్ట్ గా, పర్వెర్ట్ డ్ పర్సన్ గా పోసాని నూటికి నూరుశాతం బాగా నటించాడు. కానీ అక్కడక్కడ అది కొంచెం అతి అనిపిస్తుంది. లేడీస్ నైటీలు వేసుకోవటం వంటివి చూట్టానికి చాలామందికి ఇబ్బంది కలిగిస్తుంది. అంతేకాకుండా స్త్రీకి కాళ్ళ మీద వెంట్రుకలుంటే ఆమెకు కామవాంఛలేక్కువగా ఉంటాయని చేపే థియరీలు జుగాప్పు కలిగిస్తూ, మనల్ని బాగా విసిగిస్తాయి. ఇక సత్యకృష్ణన్ నటిగా బాగానే నటించినా, అవసరానికి మించి అతిగా ఎక్స్ పోజింగ్ చేయటం వల్ల ఆమెకు నటిగా కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ కూడా బాగా డామేజయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇంతవరకు ‘ఆనంద్’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో పొందిన ఇమేజ్ ఈ చిత్రంతో కచ్చితంగా దెబ్బతినే ప్రమాదముంది. ఇక బ్రహ్మానందం నవ్వించటానికి బాగానే ప్రయత్నించాడు కానీ ఫలితం పెద్దగా ఉండదు. సంగీతం ఫర్వాలేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
అలాగే మిగిలిన డిపార్ట్ మెంట్స్ అన్నీ కూడా దాదాపు యావరేజ్ గా ఉన్నాయి. ఇంతకంటే ఈ చిత్రం గురించి వ్రాయటం అనవసరం. ఇది చూడాల్సినంత గొప్ప చిత్రమేం కాదు.