Read more!

English | Telugu

సినిమా పేరు:మస్త్
బ్యానర్:జీ మోషన్ పిక్చర్స్
Rating:---
విడుదలయిన తేది:Jan 23, 2009
శివబాలాజీని ఆంచల్‌ ప్రేమిస్తుంది. కాని సమాజసేవకే ఎక్కువ ప్రాథాన్యతనిచ్చే శివబాలాజీ అనుకున్న సమయానికి ఆమెని కలుసుకోలేకపోతాడు. ఆ తర్వాత అతను ఫారిస్‌ వెళతాడు. ఇది ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. ఫోటోలు ఎక్కువగా చూడటం వల్ల చూపుని పోగొట్టుకున్న శివాజీ, ఎక్కువగా పాడటం వల్ల మాట పోగొట్టుకున్న శ్రీనివాసరెడ్డిలకు ఆలీ మంచి స్నేహితుడు. వీళ్ళు ముగ్గురూ శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అనేటంత స్నేహితులు. వీళ్ళ ఇంటి ఓనర్‌ బ్రహ్మానందం. అతని బామ్మ చనిపోయిన గదిలోదెయ్యమై తిరుగుతుందని, దాన్ని ఎవరికీ అద్దెకివ్వడు. ఇదిలా ఉంటే సెటిల్‌మెంట్స్‌ చేసే విలన్‌ ఒకసారి అనుకోకుండా ఆంచల్‌ని చూసి ప్రేమించి, ఆ సంగతి ఆమెతోనే చెపుతాడు. అతని బారి నుండి తప్పించుకోటానికి అతని దగ్గర వంద రూపాయల నోటు తీసుకుని, దాంతో యమ్‌.యస్‌. నారాయణ పాన్‌షాప్‌లో ఒక చూయింగ్‌ గమ్‌ కొనుక్కుని, దానిమీద తన ఫోన్‌నెంబర్‌ ఉందనీ, చేతనయితే పట్టుకోమనీ చెపుతుంది. అలాగే విజయానికి ఐదుమెట్లు నవల్లో కూడా తన ఫోన్‌ నెంబరుందని కూడా తర్వాత చెపుతుంది. అతన్నుంచి తప్పించుకున్న ఆంచల్‌కి శివాజీ అండ్‌ గ్యాంగ్‌ ఆశ్రయమిచ్చి దెయ్యం గదిలో రగుబాబు తన అన్నని చంపిన, విలన్‌ని చంపటానికి, ఒక తుపాకి వ్యాపారి (సునీల్‌) వద్ద తుపాకీ కొని విలన్‌ని చంపటానికి ప్రయత్నిస్తూ విఫలమవుతూ వుంటాడు. చివరికి విలన్‌ ఆమెను పట్టుకోటానికి ఆమె ఫొటో వేద్దామని ప్రయత్నించి గొప్ప చిత్రకారుడిగా మారిపోతాడు. ఈలోగా శివాజీకి కళ్ళు రావటం, శ్రీనివాసరెడ్డికి మాట రావటం, ఆంచల్‌ ప్రియుడైన శివబాలాజీ వచ్చి ఆమెను కలుసుకోవటంతో కథ సుఖాంతం అవుతుంది.
ఎనాలసిస్ :
ఇది యస్‌.వి. కృష్ణారెడ్డి మార్క్‌ కామెడీ చిత్రం. సినిమా ఆధ్యంతం వీలైనంత నవ్వించటానికే ప్రాథాన్యతనిచ్చారు. హిట్‌కోసం యస్‌.వి. కృష్ణారెడ్డి పడ తపన మనకు సినిమా ప్రతి ఫ్రేమ్‌లోనూ కనపడుతుంది. విలన్‌ ఉన్నాడు కానీ హింస లేదు. రఘుబాబు తుపాకీలోని బుల్లెట్‌ 29 మీటర్ల వరకూ వెళ్ళి అక్కడ పడిపోవటం, ఫ్యాన్‌ గాలికి బుల్లెట్‌ దారి మళ్ళటం వంటి కామెడీ సీన్లు బాగా నవ్వించాయి. పాన్‌షాప్‌ ఓనర్‌ యమ్‌.యస్‌. నారాయణకి విలన్‌ మొబైల్‌ వ్యానిచ్చి తిరుగుతూ హీరోయిన్‌ని వెతకమనటం, రఘుబాబు కూడా అతనికే విలన్‌ కనపడితే తనకు చెప్పమనటం, ఇక శివాజీ, ఆలీ, శ్రీనివాసరెడ్డి, ఉత్తేజ్‌, రఘుబాబు, యమ్‌.యస్‌.నారాయణల కామెడీ అద్భుతంగా కాకపోయినా కాస్తోకూస్తో మనల్ని నవ్విస్తుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సంగీతం:- ఈ చిత్రంలోని సంగీతం కొత్తగా ఉంటుంది. మామూలుగా యస్‌.వి. కృష్ణారెడ్డి చిత్రాల్లోని సంగీతంలా కాకుండా ఈ చిత్రంలోని పాటలు విభిన్నంగా ఉండటం గమనార్హం. రీ-రికార్డింగ్‌ కూడా బాగుంది. నటన:- ఇందులో ఉన్న నటులందరూ బాగా అనుభవమున్న వారే కావటం వలన, వారు బాగా చేశారని చెప్పటం హాస్యాస్పదమే అవుతుంది. ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు అని చెప్పటం సమంజసం. కెమెరాః- సినిమాని చక్కగా చూపించటంలో సినిమాటోగ్రఫీ పాత్ర బాగుంది. ఎడిటింగ్‌:- నాగిరెడ్డి ఎడిటింగ్‌ నిట్‌గా ఉంది. కొరియోగ్రఫీ:- అన్ని పాటల్లో కొరియోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా "హలో పాటలో కొరియోగ్రఫీ కాన్సెప్ట్‌ బేస్డ్‌గా సాగి కొత్తగా ఉంది. యస్‌.వి.కృష్ణారెడ్డి సినిమాలంటేనే తల్లీ, చెల్లి వంటి వారితో కూడా చూసే విధంగా ఉంటాయి. ఇది కూడా అలాగే ఉంది. కాసేపు కుటుంబసమేతంగా నవ్వుకోవాలంటే ఈ చిత్రం చూడండి.