Read more!

English | Telugu

సినిమా పేరు:మా అన్నయ్య బంగారం
బ్యానర్:విశాఖ టాకీస్
Rating:2.50
విడుదలయిన తేది:Jul 31, 2010
ఇది చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఏడుగురు అన్నదమ్ముల కథ.పెద్దన్నయ్య (డాక్టర్ రాజశేఖర్)తన ఆరుగురు తమ్ముళ్ళ బాధ్యతనూ తన మీదేసుకుని వాళ్ళకు ఏలోటూ రాకుండా వాళ్ళని ప్రయోజకుల్ని చేస్తూంటాడు.కూటికి గతిలేక వీళ్ళ పంచన చేరిన వీళ్ళ మామయ్య (షాయాజీ షిండే)వీళ్ళ ఆస్తిని కాజేసి,తన తమ్ముళ్ళను పనివాళ్ళలా చూస్తూంటే సహించలేక,"నా తమ్ముళ్ళను ప్రయోజకులను చేస్తా"నని అతని మీద ఛాలెంజ్ చేసి,ఆ మాట నిలబెట్టుకోవటం కోసం తాను కష్టపడి పనిచేస్తుంటాడు పెద్దన్నయ్య. ఇతనికి పెళ్ళి చేయటం కోసం పెళ్ళి కూతురి(కమలినీ ముఖర్జీ)అక్క (ఝాన్సీ)కి ఇతనికి ఒక్కడే తమ్ముడని అబద్ధం చెపుతాడు ఇతని బాబాయ్ (జయప్రకాష్ రెడ్డి).అందుకని ఇతని సొంత తమ్ముళ్ళను బాబాయ్ కొడుకులుగా భార్యకీ,ఆమె అక్కకీ పరిచయం చేస్తారు. కానీ ఒక రోజు ఆమెకు నిజం తెలుస్తుంది.దాంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది.దానికి కారణం ఆమె అక్క అత్తగారింట్లో పెద్ద కుటుంబం ఉండటం వల్లఅక్క పడిన బాధలు చూసి ఉండటం వల్ల,తన భర్త,తాను తన బిడ్డ ఇలా ఒక చిన్న కుటుంబంతో మాత్రమే బ్రతకాలి అనుకుంటుందామె.వదినను తిరిగి ఇంటికి తీసుకురావటానికి ఆ తమ్ముళ్ళు ఏంచేశారన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఈ సినిమా టైటిల్స్ పడే దగ్గర నుండీ ప్రేక్షకుల్లో ఒక మూడ్ ని దర్శకుడు క్రియేట్ చేశాడు.స్క్రీన్ ప్లే బాగుంది.సినిమా మొత్తంగా పెద్దగా బోర్ కొట్టకుండా,అన్ని వర్గాల ప్రేక్షకులనూ దృష్టిలో పెట్టుని ఈ చిత్రం కథని తయారుచేసినట్టుగా కనిపించింది.అందుకే ముఖ్యంగా స్త్రీలను ఆకట్టుకునేందుకు సీమంతం పాటను కూడా ఈ చిత్రంలో పెట్టటం జరిగిందనిపించింది.కాకపోతే హిందీలో అమీర్ ఖాన్ నటించిన "3ఇడియట్స్"చిత్రంలో అబ్బాయిలు ఒక ఆపద్సమయంలో ఒకమ్మాయికి కానుపుచేయటం అనే సన్నివేశాన్ని ఈ చిత్రం క్లైమాక్స్ లో కాపీ కొట్టారు.దర్శకుడికి ఇది హిట్ చిత్రమని చెప్పవచ్చు. నటన - రాజశేఖర్ యధాప్రకారం తన శైలి నటనతో ఆకట్టుకుంటాడు.కాకపోతే యుగళ గీతాల్లో చేసే డ్యాన్సు కూడా ఒక ఫైట్లానే ఉండేలా చేయగలగటం ఒక్క రాజశేఖర్ వల్లే అవుతుంది.తమ్ముళ్ళు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.కమలినీ ముఖర్జీ కూడా ఫరవాలేదు.ఝాన్సీ కూడా డిటోనే.ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జయప్రకాష్ రెడ్డి పాత్ర.బాబై గా ఉంటూ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా,అప్పుడప్పుడూ చక్కని కామెడీ పండిస్తూ ఆయన బాగా నటించారు. సంగీతం - రాజ్‍ కుమార్ సంగీతం ఆకట్టుకుంటుంది.రీ-రికార్డింగ్‍ కూడా బాగుంది. కెమెరా - బాగుంది. మాటలు - 330 సినిమాలకు రాసిన తర్వాత కూడా పరుచురి బ్రదర్స్ కలం జవనాశ్వంలా పరుగెడుతుంది."మెడలో ఉన్న తాళిబొట్టే కనపడని ఆమెకు కాళ్ళమీదపడే నీ కన్నీటి బొట్టు ఎలా కనపడుతుంది"వంటి మాటలు వాళ్ళు తప్ప ఇంకేవరు రాయగలరు.మాటలు చాలా బాగున్నాయి. పాటలు - ఈ చిత్రంలోని పాటల్లో సాహిత్యపు విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ - బాగుంది. కొరియోగ్రఫీ - ఫరవాలేదు. యాక్షన్ - ఆకట్టుకునే స్థాయిలో ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
న్యూక్లియర్ ఫ్యామిలీలతో నిండిపోతున్న నేటి తరానికి,ఈ సినిమా ఉమ్మడి కుటుంబపు విలువలను తెలియజేసే చిత్రంగా ఉంది.అలాంటి విలువలున్నచిత్రం చూడాలనుకుంటే ఈ చిత్రం