English | Telugu

సినిమా పేరు:లక్కున్నోడు
బ్యానర్:ఎంవీవీ సినిమా
Rating:1.75
విడుదలయిన తేది:Jan 26, 2017

మంచు విష్ణు ప్రాధన బలం వినోదం. విష్ణు అన్నీ రకాల సినిమాలు చేసినా వినోదాత్మక చిత్రాలే మంచి విజయాన్ని అందించాయి. కెరీర్ లో తొలి హిట్టు ‘ఢీ’ పక్కా వినోదాత్మక చిత్రం. తర్వాత వచ్చిన ‘దేనికైనా రెడీ’.. మొన్న వచ్చిన ‘ఈడో రకం ఆడో రకం’.. ఇవన్నీ వినోదాత్మక చిత్రాలే. దీంతో తన లక్ కామెడి ఎంటర్ ట్రైనర్ లోనే వుందని గ్రహించిన విష్ణు.. మరో వినోదాత్మక చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘లక్కున్నోడు’. ‘గీతాంజలి’ ఫేం రాజ్‌ కిరణ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. మరి, ఈ ‘లక్కున్నోడు' ప్రేక్షకులకు ఎంత కిక్కు ఇచ్చాడు? వినోదాత్మక చిత్రాలతో ఓ మూడు హిట్లు ఖాతాలో వేసుకున్న విష్ణుకి ‘లక్కున్నోడు' ఎలాంటి అనుభవాన్ని ఇచ్చాడు.? అసలు ఈ లక్కున్నోడి లేక్కేంటో తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే. 
 
కధ: 
లక్కీ ( మంచు విష్ణు). పేరులోనే లక్ తప్పితే జీవితంలో కాదు. ఈ ప్రపంచంలో వున్న బ్యాడ్ లక్ అంతా పాకెట్ లో పెట్టుకుతిరుగుతుంటాడు. అంతేకాదు లక్కీని ఎవరు కలసినా మరో క్షణంలో నాశనం. చిన్నప్పటి నుండి లక్కీ ఇచ్చే బ్యాడ్ లక్ షాకులు తిని చివరికి తండ్రి (జయప్రకాశ్‌) కూడా మాట్లాడం మానేస్తాడు. కనీసం పేరును పలకడానికి కూడా భయపడిపొతుంటాడు. దీంతో తండ్రి తనను ఎలాగైనా పేరు పెట్టి పిలవాలని ఓ జీవితాశయం కూడా పెట్టుకుంటాడు లక్కీ. ఓ సందర్భంలో చెల్లి పెళ్లి కుదురుతుంది. కట్నం డబ్బు రూ.25లక్షలు ఇవ్వడానికి బయలుదేరుతాడు లక్కీ. అయితే డబ్బు బ్యాగ్‌ పోతుంది. దీంతో తండ్రి కోప్పడటంతో సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు. ఇంతలో ఓ అపరిచితుడు లక్కీకి ఓ బ్యాగ్‌ ఇస్తాడు. దాన్ని ఒక్కరోజు దగ్గరుంచుకుంటే కోటి రూపాయలు ఇస్తానని చెబుతాడు. అసలు బ్యాగ్ సంగతి ఏంటి ? కోటి రూపాయిలు ఎవరు ఇస్తారు? లక్కీ తండ్రితో మళ్ళీపేరు పెట్టి పిలిపించుకుంటాడా? అనేది మిగతా కధ.  


ఎనాలసిస్ :

విశ్లేషణ: 

తొలి భాగం అంతా ఓ మాదిరిగా సాగుతుంది. ఎలాంటి కధ లేకపోయినా లక్కీ బ్యాడ్ లక్ సీన్లు, హీరోయిన్ తో లవ్ ట్రాక్ , వెన్నెల కిషోర్‌.. సత్యం రాజేశ్‌.. ప్రభాస్‌ శ్రీను కామెడీతో అలా నడిచిపోతుంది. హీరోయిన్ పాత్రకు బీపాజిటీవ్ అనే కాన్సెప్ట్ తగిలించారు. అయితే ఆ సన్నీవేషాలన్నీ రేసుగుర్రం సినిమాలో శ్రుతి హాసన్ ఫ్యామిలీ సీన్లను గుర్తుకుతెస్తుంటాయి. విష్ణు నోటి వెంట 'మ్యావ్‌ మ్యావ్‌'అంటూ ఓ మేనరిజం ను చెప్పించారు. అయితే అదీ ఏం గొప్పగాలేదు. ఒక సందర్భంలో చిరాకు తెప్పిస్తుంది కుడా. విష్ణు ఇందులో మోహన్‌బాబును ఇమిటేట్‌ చేశాడు. అయితే అది అంత ఆకట్టుకోదు. ఓ పాటలో మోహన్‌ బాబు కనిపించి అలరించారు. ఈ సినిమాలో లవ్ ట్రాక్ పెద్ద మైనస్స్ .హన్సిక మరీ ముదిరిపోయినట్లు కనిపించింది. ఆమె కనిపించిన సన్నీవేషాలన్నీ చిరాకు తెప్పిస్తాయి. వెన్నెల కిషోర్‌.. సత్యం రాజేశ్‌.. ప్రభాస్‌ శ్రీను తమదైన కామెడి టైమింగ్ తో అలరించారు. అదొక్కటే కాస్త రిలీఫ్. డైమాండ్ రత్నబాబు డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. 
 
తొలిసగం ఎలాంటి కధ లేకుండా లా సోసోగా నడిపించేసిన దర్శకుడుఇంటర్వెల్ కి వచ్చేసరి కాస్త ఆసక్తిరేపుతాడు. అయితే రెండో భాగం మొదలైన రెండో సీన్లోనే లక్కున్నోడు మళ్ళీ బ్రేక్ డౌన్ అయిపోతాడు. ఇక ఎంతకీ టాప్ గేర్ లోకి రాడు. ఎలాంటి ఆసక్తిలేకుండా సీన్లు అలా వెళ్ళిపోతుంటాయి తప్పితే కధ ముందుకు వెళ్ళదు. హీరోకి విలన్ కి మధ్య జరిగిన అట ఏ మాత్రం రక్తికట్టదు. ఈ సినిమాలో మరో మైనస్స్ విలన్ రోల్. ఆసలు ఆ విలన్ ని చూస్తేనే విలనిజంపై విరక్తిపుడుతుంది. ఫస్ట్ హాఫ్ బిలోఎవరేజ్ అనుకుంటే సెకెండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా మరీ దారుణంగా తయారౌతుంది. కధ వుండదు, ఒక స్క్రీన్ ప్లే వుండదు, పాటలు ఆకట్టుకోవు.. ఇలా అన్నిట్లో బ్యాడ్ లక్ వెంటాడిందీ సినిమాకి. లక్కున్నోడిని ఆసక్తిగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఒక స్థాయికి వచ్చేసరికి ఈ సినిమాలో ఎలాంటి విషయం లేదని తెలిసిపోతుంది. ఏవో రెండు సీన్లు, మూడు కామెడి బిట్లు రాసుకుని సెట్స్ మీదకు వెళ్ళినట్లు వుందనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దీంతో స్క్రీన్ పై నుండి ఎగ్జిట్ డోర్ వైపు ప్రేక్షకుడి ద్రుష్టి మళ్ళుతుంది. 
 
న‌టీన‌టుల ప్ర‌తిభ‌

విష్ణు ఈ సినిమాతో కొత్త‌గా చేసిందేం లేదు. ఢీ నుంచి ఈడో ర‌కం వ‌ర‌కూ ఏం చేశాడో అదే చేశాడు. ఈ సినిమా విష్ణులో కొత్త యాంగిల్ ఏదీ బ‌య‌ట‌కు తీసుకురాలేక‌పోయింది. హ‌న్సిక దాదాపుగా ముస‌ల‌మ్మ‌లా క‌నిపించింది. పైగా ఓవ‌ర్ మేక‌ప్‌తో అస్స‌లు చూళ్లేక‌పోయాం. విల‌న్ కూడా ఈ సినిమాకి పెద్ద మైన‌స్ అయ్యాడు. క‌ళ్ల జోడు పెట్టుకొని, జుత్తు పెంచుకొంటే విల‌న్లు అయిపోతార‌నుకొంటారో ఏంటో..??  పోసానిద రొటీన్ కామెడీ. ఉన్నంతలో స‌త్యం రాజేష్ ఓకే అనిపిస్తాడంతే.

* సాంకేతిక వ‌ర్గం

పాట‌లేవీ క్యాచీగా లేవు. పైగా రాంగ్ టైమింగ్‌లో వ‌చ్చి విసిగిస్తాయి. డైమండ్ ర‌త్న‌బాబు ప్రాస కోసం ప్రాకులాడాడు.  కోపం వ‌స్తే బీపీ వ‌స్తుంది.. ఆనందంగా ఉంటే హ్యీపీ అంటూ.. చెడా మ‌డా రాసి పారేశాడు.  ద‌ర్శ‌కుడిరా రాజ్ కిర‌ణ్ నూటికి నూరుపాళ్లు ఫెయిల్ అయిపోయాడు. గీతాంజ‌లి లాంటి సినిమా తీసింది ఇత‌నేనా అనిపిస్తుంది. 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

చివరిగా.. ఇది వరకు కామెడి ఎంటర్ట్రైనర్లతో ఓ మూడు హిట్లు కొట్టాడు విష్ణు. మరో హిట్టు కొట్టాలని అలాంటి సెటప్ తోనే 'లక్కున్నోడు' చేశాడు. అయితే ఈ లక్కున్నోడు ఎలాంటి కిక్కు ఇవ్వలేకపోయాడు.

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00