Read more!

English | Telugu

సినిమా పేరు:Love You Bangaram
బ్యానర్:క్రియేటివ్‌ కమర్షియల్స్‌, మారుతి టాకీస్‌
Rating:0.50
విడుదలయిన తేది:Jan 24, 2014
దర్శకుడి మారుతి నుండి ఏదైనా సినిమా వస్తుందంటే అందులో యూత్ కి కావలసిన మసాలాలు అనుకున్నదానికంటే కొంచెం ఎక్కువే ఉంటాయి. "ఈ రోజుల్లో", "బస్ స్టాప్" వంటి చిత్రాలతోనే తను ఒక రొమాంటిక్ బూతు దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు.

ఎనాలసిస్ :
 
 
రివ్యూ: లవ్‌ యు బంగారమ్‌
రేటింగ్‌: 0.5/5
బ్యానర్‌: క్రియేటివ్‌ కమర్షియల్స్‌, మారుతి టాకీస్‌
తారాగణం: రాహుల్‌, శ్రావ్య, రాజీవ్‌ తదితరులు
సంగీతం: మహిత్‌ నారాయణ్‌
ఛాయాగ్రహణం: అరుణ్‌ కె. సూరపనేని
నిర్మాతలు: మారుతి, వల్లభ
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: గోవి
 
 
 
దర్శకుడి మారుతి నుండి ఏదైనా సినిమా వస్తుందంటే అందులో యూత్ కి కావలసిన మసాలాలు అనుకున్నదానికంటే కొంచెం ఎక్కువే ఉంటాయి. "ఈ రోజుల్లో", "బస్ స్టాప్" వంటి చిత్రాలతోనే తను ఒక రొమాంటిక్ బూతు దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు. కానీ ఇటీవలే వచ్చిన "ప్రేమకథా చిత్రమ్" మాత్రం పర్వాలేదనిపించింది. కానీ తాజాగా మారుతి బ్యానర్ నుండి "లవ్ యు బంగారం" చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో అని అనుకుంటున్నారా... ఓరి బాబోయ్.. మళ్ళీ అదే అదే సెగలు, అదే పొగలు. అసలు ఇంతగా ఈ సినిమాలో ఏముంది అని అనుకుంటున్నారా?
 
కథలోకి వెళితే....
ఓ సెల్‌ఫోన్‌ కంపెనీలో మేనేజర్‌ గా పనిచేస్తాడు ఆకాష్‌(రాహుల్‌). ఆకాష్ కు తన మీద తనకు నమ్మకం చాలా తక్కువ. అందంగా లేనని, తనకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా దొరకట్లేదు అనే భావనలో ఉంటుంటాడు. అయితే అనుకోకుండా మీనాక్షి (శ్రావ్య)తో పరిచయం ఏర్పడుతుంది. వీళ్ళిద్దరూ కూడా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. కొత్త కాపురం పెట్టిన కొద్దిరోజుల వరకు బాగానే ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకి మీనాక్షి ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. ఇక అప్పటి నుండి ఆకాష్‌కి ఆమెపై అనుమానం పెరుగుతుంది. ఆకాష్ అనుమానాన్ని మరింత పెంచే విధంగా మీనాక్షి ప్రవర్తన కూడా ఉంటుంది. తర్వాత వీరి జీవితం ఏమైంది. ఆకాష్ అనుమానం వీరి వైవాహిక జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందనేది మిగతా కథ. 
 
నటీనటులు : ఈ సినిమాలో అందరి నటన అంతంత మాత్రంగానే ఉంది. రాహుల్ నటనలో ఎలాంటి కొత్తదనం కనిపించలేదు. శ్రావ్య నటన కూడా చెప్పుకోదగ్గగా ఏం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొడుకు రాజీవ్ ఒక చిన్న పాత్ర చేసాడు. ఇక హీరో ఫ్రెండ్స్ చేసే చెత్త బూతు కామెడిలు సరిగ్గా పండలేదు.
 
సాంకేతిక వర్గం : సంగీతం గురించి.. అబ్బో...అర్థం పర్తం లేని పాటలు మరీ ఎక్కువయ్యాయి. ఈ పాటలే అబ్బో అనే విధంగా ఉన్నాయంటే వాటి చిత్రీకరణ వామ్మో అనిపించాయి. దర్శకుడు గోవి కూడా మారుతి బూతు టాలెంట్ ను బాగానే వాడుకున్నాడు. బూతు సినిమా తీసి కాసుల కలెక్షన్లు రాబట్టలకునున్ననిర్మాత గట్టి ప్రయత్నమే చేసాడు.
 
ప్లస్ పాయింట్స్: అంటే ఏంటి.???

మైనస్ పాయింట్స్: ఉన్నవే అవి. ఎన్ని చెప్పాలి?
 
విశ్లేషణ: గతంలో మారుతి నుండి వచ్చిన "ఈ రోజుల్లో" అనే చిత్రంలో ప్రస్తుతం జనాలు ఎలా ఆలోచిస్తున్నారు. వాళ్ళ కోరికలు ఏంటి అంటూ మారుతి బాగా తెలుసుకొని ఆ .... సినిమాను చూపించాడు. ఆ తర్వాత "బస్ స్టాప్" సినిమా కోసం ... బస్ స్టాప్ వద్ద తిరిగే యువత ఎలా ఉంటున్నారు. వారిలోని ...ను బాగా తెలుసుకొని ఆ సినిమా తీసాడు. కానీ మధ్యలో "ప్రేమకథా చిత్రమ్" అనే మంచి సినిమా తీసాడు. కానీ ఇది మహేష్ బాబు ఫ్యామిలీ హీరోది కనుక ఎలాంటి బూతు లేకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ నేడు విడుదలైన .... చిత్రం. కాదు కాదు .... చిత్రంకు మరో పేరు అయిన "లవ్ యు బంగారం" సాఫ్ట్ వేర్ వాళ్ళు ఎలా ఉంటున్నారు. వాళ్ళు ఆఫీసులలో ఎలా ఉంటున్నారు. ఎలాంటి రొమాన్స్ చేస్తున్నాడు అనే దానిపై మారుతి బాగానే పరిశోదన చేసి ఈ సినిమా తీసాడేమో మరి. మరి ఈ విషయంపై సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సైలెంట్ గా ఉండి ఎంజాయ్ చేస్తారో లేక సినిమాకు విరుద్ధంగా ఎదురుతిరుగుతారో తెలియాలి. మొత్తానికి మారుతి నుండి మరో బూతు బంగారం సినిమా నేడు విడుదలైంది.
 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

చివరగా‌: లవ్‌ యు బంగారమ్‌... బూతు బంగారం!