Read more!

English | Telugu

సినిమా పేరు:లియో
బ్యానర్:సెవెన్ స్క్రీన్ స్టూడియో
Rating:2.50
విడుదలయిన తేది:Oct 19, 2023

సినిమా పేరు: లియో 
తారాగణం: విజయ్, త్రిష,సంజయ్ దత్ ,అర్జున్, గౌతమ్ మీనన్  తదితరులు 
సంగీతం:అనిరుద్ 
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్  
నిర్మాతలు:లలిత్ కుమార్,జగదీష్
బ్యానర్ : సెవెన్ స్క్రీన్ స్టూడియో 
విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023

కొన్ని సినిమాలు చిత్రీకరణ దశ నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలని కలిగి ఉంటాయి. అలాంటి అంచనాలు కలిగి ఉన్న సినిమాల్లో లియో ఒకటి. విజయ్ తో లోకేష్ కనగరాజ్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే విజయ్ ఫాన్స్ అండ్ ప్రేక్షకులు లియో కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి ఎదురు చూస్తూ ఉన్నారు. పైగా విజయ్ గత చిత్రం వారిసు తెలుగు వారసుడు సినిమా తర్వాత దళపతి విజయ్ నుంచి వస్తున్న లియో  పక్కా యాక్షన్ మూవీ  కావడం తో విజయ్ ఫాన్స్ లియో మీద ఆకాశమంత ఎత్తు అంచనాలని పెట్టుకున్నారు. మరి వాళ్ళందరి అంచనాలని  లియో మూవీ అందుకుందా లేదా చూద్దాం.

కథ
హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ప్రాంతంలో ఆ ఏరియా కలెక్టర్ ని, అతని కుటుంబాన్ని సుపారీ తీసుకున్న కొంత మంది తెలుగు రౌడీలు చంపుతారు. ఆ తర్వాత వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడకపోయేసరికి వాళ్ళు హిమాచలప్రదేశ్ లోనే ఉంటూ డబ్బు కోసం చిన్న చిన్న దారి దోపిడీలు చేస్తూ మనుషులని చంపుతుంటారు. అదే ప్రాంతంలో పార్తీబన్(విజయ్) కేఫ్ అండ్ బేకరీ లాంటి దాన్ని నడుపుకుంటూ తన భార్య (త్రిష), 15 ఏళ్ళ కొడుకు, 6 సంవత్సరాల కూతురు తో హ్యాపీ గా తన లైఫ్ ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒకసారి కలెక్టర్ ని చంపిన సుపారీ దొంగలు పార్తీబన్ కేఫ్ లో కొచ్చి డబ్బు కోసం డిమాండ్ చేస్తారు. పార్తీబన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చినా కూడా తమ గురించి పార్తీబన్ పోలీస్ లకి చెప్తాడేమోనని అలాగే సీసీ కెమెరాల్లో వాళ్ళ ఆనవాళ్లు ఉంటాయని పార్తీబన్ ని  తన కూతుర్ని చంపుదామనుకుంటారు. అపుడు పార్తీబన్ ఒక ప్రొఫెషినల్ కిల్లర్ రేంజ్ లో వాళ్ళందర్నీ చంపుతాడు. పోలీస్ లు పార్తీబన్ ని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరుపరుస్తారు. పార్తీబన్ ప్రాణ రక్షణ కోసమే వాళ్ళని చంపాడని కోర్ట్ అర్ధం చేసుకొని విడుదల చేస్తుంది. ఈ లోపు ఇండియా వ్యాప్తంగా అన్ని పేపర్స్ లో పార్తీబన్ ఫోటో వస్తుంది. దాంతో హైదరాబాద్ లో దాస్ టొబాకో కంపెనీ  పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేసే ఆంథోనీ దాస్ కి (సంజయ్ దత్) అతని తమ్ముడు రోనాల్డ్ దాస్ (అర్జున్)కి పార్తీబన్ ఫోటో ని పేపర్ లో చూసి హిమాచల్ ప్రదేశ్ వచ్చి నువ్వు పార్తీబన్ వి కాదు లియోవి అని పార్తీబన్ తో అంటారు. కానీ పార్తీబన్ మాత్రం లియో ని కాదు అని అంటాడు. కానీ వాళ్ళు మాత్రం నువ్వు లియోవి నా కొడుకువి అని అంటారు. ఈ క్రమంలో త్రిష కూడా పార్తీబన్ ని అనుమానిస్తుంది. కానీ పార్తీబన్ మాత్రం లియో ని కాదని అంటాడు. ఇంతకీ పార్తీబన్ ఎవరు.? నిజంగా లియో నేనా? మూఢ నమ్మకాలు కోసం సొంత బిడ్డలని సైతం బలి ఇచ్చే దాస్ బ్రదర్స్ పార్తీబన్ ని  అంత ఖచ్చితంగా లియో అని ఎందుకు అంటున్నారు? అసలు లియో గతం ఏంటి?పార్తీబన్ నిజంగా లియో నా లేక పార్తీబన్ వేరు,లియో వేరు నా అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

ఒక్క ముక్కలో చెప్పాలంటే లియో స్టోరీ సూపర్ స్టోరీ.. ఎన్నో ట్విస్ట్ లతో ఇలాంటి కథ లని తెరకెక్కించవచ్చు. పైగా లోకేష్ కనగ రాజ్ లాంటి దర్శకుడు ఎన్నో ట్విస్ట్ ల తో ఈ కథని ఈజీ గా తెరకెక్కించవచ్చు. లోకేష్ గత సినిమా విక్రమ్ సినిమానే అందుకు ఉదాహరణ. ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే తో  విక్రమ్ ని తీసినట్టు లియోని ఇంకా సూపర్ గా  తియ్యవచ్చు. కానీ సినిమాని చాలా డీసెంట్ గా ఓపెన్ చేసి అంతే డీసెంట్ గా ఎండ్ చేసాడు. అలాగే సినిమాని హిమాచల్ ప్రదేశ్ లో ఓపెన్ చెయ్యడం ఎక్కువ భాగం అక్కడే చూపించడం తో సినిమా చాలా అందంగా కాస్ట్లీగా ఉంది. లోకేష్ గత చిత్రాలు చూసి ఈ సినిమా మీద ఎక్కువ అంచనాలని పెట్టుకుంటాం కానీ సినిమా పరంగా  లియో చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టలేదు. సూపర్ ఫోటోగ్రఫీ తో ఫ్రేములు చాలా రిచ్ గా ఉన్నాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
దళపతి విజయ్ మరో సారి తన క్యూట్ నటనతో ఇరగదీసాడు. తాను పోషించిన రెండు పాత్రల్లో సూపర్ గా నటించి తన అభిమానులకి, ప్రేక్షకులకి విజయ దశమిని ముందుగానే తీసుకొచ్చాడు. ముఖ్యంగా కేఫ్ ఓనర్ గా తన ఫ్యామిలీ తో హ్యాపీగా గడుపుతుంటే ప్రతోడు వచ్చి లియో లియో అని అంటుంటే తట్టుకోలేక అవతలి వాడి చేతుల్లో చావలేక వాళ్ళని చంపే క్యారక్టర్ లో సూపర్ గా  నటించాడు. అలాగే 45  సంవత్సరాల వయసు క్యారెక్టర్లో ఎంత అందంగా ఉన్నాడో అలాగే 25 సంవత్సరాల వయసు క్యారక్టర్ లో అంతే అందంగా ఉన్నాడు.  విజయ్ భార్య గా త్రిష సూపర్ గా చేసింది. ఇక సంజు భాయ్ గురించి చెప్పాలిసిన పని లేదు.  కరుడుగట్టిన డాన్ గా అలాగే మూఢనమ్మకాలు  కోసం సొంత బిడ్డలని బలి ఇచ్చే క్యారక్టర్ లో సంజయ్ ఇరగదీసాడు. అలాగే అర్జున్ కి విలన్ క్యారక్టర్  కొత్త అయినా సూపర్ గా చేసాడు. లోకేష్ కనగ రాజ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అనిరుధ్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

సింపుల్ గా లియో గురించి చెప్పాలంటే.. లియో మూవీ మరి అంత హిట్ కాదు,  అలా అని మరి అంత బాడ్ కాదు. సినిమా బాగుంది అంతే. కాకపోతే  ఫ్యామిలీ ఆడియన్స్ ఇచ్చే తీర్పు మీదే లియో సూపర్ డూపర్ హిట్టా లేక పర్లేదా  అని ఆధారపడి ఉంటుంది. మటన్ కొట్టువాడు దగ్గరికి వెళ్తే వాడు మటన్ ని పూలు అమ్మే వాడి స్టయిల్లో చాలా సౌమ్యంగా మనకి ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది  లియో సినిమా.