Read more!

English | Telugu

సినిమా పేరు:కుర్రాడు
బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Nov 12, 2009
వరుణ్‌ (వరుణ్‌ సందేశ్‌‌) డిగ్రీ చదువుతూ ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ అతని తండ్రి (తనికెళ్లభరణి) చేత చివాట్లు తింటూ ఉండే ఓ మధ్యతరగతి కుర్రాడు. ఓ బైక్‌ కొనుక్కోవాలన్న ఆశ వరుణ్‌లో ఉంటుంది. వరుణ్‌ హేమ (నేహా శర్మ)ని ప్రేమిస్తాడు. ఉద్యోగం సంపాదించుకోవాలంటే డబ్బు కావాలని ఆ డబ్బు తన తండ్రి ఇవ్వడంలేనందువల్లనే తాను పనీపాటా లేకుండా తిరుగుతున్నానని ఓ సందర్భంలో తండ్రితో వాదిస్తాడు. దాంతో కూతురు పెళ్లికోసం దాచిపెట్టిన డెభై వేల రూపాయలని వరుణ్‌కి ఇస్తాడు తండ్రి. ఆ డబ్బుతో వరుణ్‌ ఓ బైక్‌ కొంటాడు. బైక్‌ కొనగానే హేమతో ప్రేమ సక్సెస్‌ అవడం, ఎప్పుడూ తిడుతూ ఉంటే తండ్రి తనని ప్రేమగా చూసుకోవడం, బ్యాంక్‌లో రికవరీ సెక్షన్‌లో ఉద్యోగం రావడంతో ఆ బైక్‌ని అపురూపంగా చూసుకుంటాడు వరుణ్‌. అయితే అనుకోకుండా వరుణ్‌ బైక్‌ రవి అనే ఓ గూండా చేతిలో పడుతుంది.. సెంటిమెంట్‌గా కలిసివచ్చిన ఆ బైక్‌ని తిరిగి సంపాదించుకోవడం కోసం వరుణ్‌ ఎన్ని కష్టాలు పడ్డాడన్నది మిగతా కథ.
ఎనాలసిస్ :
ఫస్టాఫ్‌ అంతా సరదాగా సాగిపోతుంది. అయితే సెకండాఫ్‌లోనే కథ చాలా స్లాగా అయిపోయింది. లవ్‌, సెంటిమెంట్‌ సీన్లలో కనిపించిన ఫీల్‌ మిగతా సీన్లలో మిస్సయింది.. రౌడీ గ్యాంగ్‌ కథలోకి ఎంటరయినప్పటినుండి కథలో పట్టు సడలిపోయింది. పోనీ ఆ రౌడీ గ్యాంగ్‌ ఎంటరయ్యాక వచ్చే సీన్స్‌లో నైనా రియాలిటీ ఉందా అంటే అదీలేదు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: వరుణ్‌ సందేశ్‌ నటన బావుంది. నేహాశర్మ ఫర్వాలేదు. వరుణ్‌ తండ్రిగా తనికెళ్ళభరణి క్యారెక్టర్‌ బావుంది. అలాగే విలన్‌ అన్నయ్య రవిశంకర్‌ నటన బావుంది. బ్యాంక్‌ లోన్‌ ఎగ్గొట్టేందుకు ఆలీ చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్‌-: ఫర్వాలేదు. ఫోటోగ్రఫీ-: బావుంది. పాటలు-: అనంత్‌ శ్రీరామ్‌ రాసిన సాంగ్స్‌ బాగున్నాయి. ముఖ్యంగా "కుర్రాల్లోయ్‌... కుర్రాల్లు'' రీమిక్స్‌ సాంగ్‌ యూత్‌ని ఆకట్టుకుంట్టుంది. ఈ కుర్రాడు యావరేజ్‌గా మిగిలిపోయాడు.