Read more!

English | Telugu

సినిమా పేరు:కుబేరులు
బ్యానర్:గోదావరి టాకీస్
Rating:2.00
విడుదలయిన తేది:Dec 5, 2008
పరుచూరి శివరామ్‌ (శివాజీ) మన ముఖ్యమంత్రి వై.యస్‌. అంటే చాలా అభిమానం. ఆయనలాగే తన ఊరికి తాను కూడా ఏదో చేయాలనే తపనతో ఎన్నికల్లో నిలబడి ఓడిపోతాడు. అలాగే ఓసారి ఊరి వారందరికీ ఇళ్ళు కట్టించాలని మోసపోతాడు. దాంతో తన సన్నిహితుడు ఆలీతో కలసి సిటీకి వెళతాడు శివరామ్‌. అక్కడ తన స్నేహితుడు రాంబాబు (కృష్ణ భగవాన్‌)ని కలసి నిజాం నవాబుల నగలకోసం శివ వెతుకుతాడు. అసలు సినిమా మొదలవటమే ఆ నగల దొంగతనంతో మొదలవుతుంది. ఆ నగలను దొంగిలించిన దొంగ తను ఒకమ్మాయి (ఫర్జానా) వద్ద దొంగిలించిన సెల్‌ఫోన్‌లో ఆ నగలను దాచిపెట్టిన ప్రదేశాన్ని ఫొటోలు తీసి ఆ ఫోన్‌ని "వివేకానంద నగర్‌' అనే కాలనీలో ఓ ఇంట్లో దాచిపెడతాడు. ఆ ప్రదేశంలోనే రాంబాబు, శివరామ్‌, ఆలీ ఉంటూంటారు. కానీ అక్కడే నిజాం నవాబు నగలున్నాయని వారికి తెలీదు. ఆ కాలనీలో కల్పన (ఫర్జానా) అనే డాక్టర్‌ ఉంటుంది. కిడ్నీలు పాడయిన ఆమె తమ్ముణ్ణి కిడ్నాప్‌ చేసి, ఆ కాలనీలో ఓ ఇంట్లో తన తమ్మడు దాచిన సెల్‌ఫోన్‌ని సంపాదించాలని నిజాం నగలు దొంగిలించిన దొంగ అన్న (డాక్టర్‌ శివప్రసాద్‌) కల్పనని బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. మరి ఆ సెల్‌ఫోన్‌ దొరికిందా...? ఆ నిజాం నగలు దొరికాయా..? ఊర్లో తను చేసిన అప్పులు శివరామ్‌ తీర్చాడా..? అన్న ప్రశ్నలకు సమాధానమే సరదాగా సాగే మిగిలిన కథ.
ఎనాలసిస్ :
వరుసగా కామెడీ చిత్రాలతో విజయాలు సాధిస్తున్న శ్రీనివాసరెడ్డి దర్శకత్వం గురించి కొత్తగా చెప్పక్కరలేదు. జంధ్యాల, ఇ.వి.వి.ల తర్వాత శ్రీనివాసరెడ్డి ఆ బాటను ఎంచుకుని దిగ్విజయంగా సాగిపోతున్నాడు. లాజిక్కుల గురించి ఆలోచించకుండా సినిమాలో ఉన్న కామెడీని ఎంజాయ్ చేస్తే ఈ సినిమా బాగానే ఉంటుంది. శివాజీ హీరోగా బాగానే చేశాడు. అతను వై.యస్‌.ని అనుకరించిన తిరు ప్రశంసనీయం. అలాగే ఆలీ కూడా చంద్రబాబునాయుడిని, ఒక పాటలో సీనియర్‌ ఎన్‌.టి.ఆర్‌ని బాగా ఇమిటేట్‌ చేశాడు. గోల్కొండ కోటలో కౌషలో డ్యాన్స్‌ చేసిన పాటలో, ఆలీ డ్యాన్స్‌ స్టార్‌ హీరోలకి పోటీగా చేశాడు. ఇక ఫర్జానా, కౌషలు ఒ.కె. తెలంగాణా శకుంతల, యమ్‌.యస్. నారాయణల మధ్య లవ్‌ సీన్లు బాగా పండాయి. ఆ సీన్ల బ్యాగ్రౌండ్‌లో "గాల్లో తేలినట్టుందే, చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరె హాయ్‌" పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి. రఘుబాబు కూడా పోలీసాఫీసర్‌గా మంచి కామెడీనే పండించాడు. ముఖ్యంగా 62 యేళ్ళ వయసులో జ్యోతిలక్ష్యి ఓ పాటలో డ్యాన్స్‌ చేయటం చూస్తే, ఆమె ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ చూసి నేటి యువత సిగ్గుపడాలి. షి ఈస్‌ రియల్లీ గ్రేట్‌. సంగీతం:- జీవన్‌ థామస్‌ సంగీతం బాగుంది. ఈ చిత్రం ఆడియోలోని పాటలన్నీ ఇప్పటికే మంచి హిట్టయ్యాయి. విజువల్‌గా కూడా పాటలు బాగుండటం ఈ సినిమాకి ప్లస్సయ్యింది. రీ-రికార్డింగ్‌ కూడా బాగుంది సినిమాటోగ్రఫీ:- రామ్‌ పినిశెట్టి ఫొటోగ్రఫీ ఈ సినిమాకి బాగా ప్లస్సయ్యింది.పొగ మంచులో పల్లెటూరి అందాలను కెమెరామెన్‌ చాలా బాగా చూపించాడు. అలాగే పాటల్లో కూడా ఫొటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌:- నీట్‌గా క్రిస్ప్‌గా కట్‌ చేశారు. కొరియోగ్రఫీ:- ఆలీ, కౌషల పాటలో కొరియోగ్రఫీ బాగా కుదిరింది. అలాగే శివాజీ, ఫర్జానాల మెలోడీ సాంగ్‌, జ్యోతిలక్ష్మి, తస్లీమ్‌ల పాటలో కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఆర్ట్‌:- బాగుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
మీరు కాసేపు నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమా చూడండి.