Read more!

English | Telugu

సినిమా పేరు:కోతి మూక
బ్యానర్:తులసి పూజిత ఫిలింస్
Rating:1.75
విడుదలయిన తేది:Jul 30, 2010
ఇది గంజికి గతిలేని అంజిగాడనబడే ముష్టివాడి(ఎవియస్)కూతురు లావణ్య(శ్రధా ఆర్య)ను,ఆకుల అప్పారావనే యమ్.యల్.ఎ.(జయప్రకాష్ రెడ్డి)కొడుకు (కృష్ణుడు)ప్రేమించటం వల్ల జరిగిన కథ.కృష్ణుడు అప్పారావు ఏకైక కుమారుడు.అతను కొన్నేళ్ళుగా డిగ్రీ చదువుతూనే ఉంటాడు.అతని క్లాస్ మేట్ లావణ్య అదే కాలేజ్ కి లెక్చరర్ గా వస్తుంది.ఆమెను అతను ప్రేమిస్తాడు.ఒక ముష్టి వాడి కుతుర్ని తన కొడుకు ప్రేమించటం ఇష్తం లేని యమ్.యల్.ఎ.లావణ్య తండ్రిని కొట్టిస్తాడు.ఆ సమయంలో ఎన్నికలు రావటంతో తన తండ్రి మీద అంజిగాడనబడే కోనేరు ఆంజనేయులుని తన తండ్రి మీద ఎన్నికలలో పోటీకి నిలబెడతాడు కృష్ణుడు.ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఈ సినిమాలో ముష్టి వాళ్ళందరూ ముష్టి వాళ్ళలానే కనిపించినా,ముష్టి వాడి కూతురు అయిన హీరోయిన్ మాత్రం పూర్తిస్థాయి మేకప్ తో,ఖరీదైన చీరలు,డ్రెస్సులతో కనిపించటం వింతగా ఉంటుంది.ఈ సినిమా తొలి సగం పెద్దగా పట్టుగా సాగదు.సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ఫరవాలేదనిపిస్తుంది.మూడవ సినిమాకి దర్శకత్వం వహించినప్పటికీ,ఎవియస్ దర్శకత్వం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటం విశేషం.ఇక హీరో కృష్ణుడి నటన యధాప్రకారంగానే ఉంది.శ్రద్ధ ఆర్య ఉన్నంతలో బాగానే నటించింది.యమ్.యల్.ఎ.పాత్రలో జయ ప్రకాష్ రెడ్డి నటన బాగుంది.మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు. సంగీతం - ఫరవాలేదు.సగటు స్థాయిలోనే ఉంది.రీ-రికార్డింగ్ కూడా అంతే. మాటలు - డిటో పాటలు - భావయుక్తంగా ఉన్నాయి. కెమెరా - ఒ.కె. ఆర్ట్ - బాగుంది. ఎడిటింగ్ - ఒ.కె. కొరియోగ్రఫీ - అడుక్కునే పాటలో మాత్రం బాగుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
అక్కడక్కడ కాసేపు నవ్వుతూ,నేటి రాజకీయాలపై ఎవియస్ వేసిన సెటైర్లు చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి.