Read more!

English | Telugu

సినిమా పేరు:కొంచెం ఇష్టం కొంచెం కష్టం
బ్యానర్:లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Feb 5, 2009
చాలా సింపుల్‌ కథ. సిద్ధు తల్లిదండ్రులు (ప్రకాష్ రాజ్‌, రమ్యకృష్ణ) 18 యేళ్ల క్రితం విడిపోతారు. గీతా (తమన్నా) అనే అమ్మాయిని సిద్ధు ప్రేమిస్తాడు. గీత నాన్న సుబ్రహ్మణ్యం (నాజర్‌)నీ తల్లిదండ్రులు కలిస్తేనే నా కూతుర్నిచ్చి పెళ్ళిచేస్తానంటాడు. కుటుంబం విలువ సిధ్దూకి తెలియటానికే అతనలా అంటాడు. దాంతో సిద్ధూ, గీతలు ఎలా వాళ్ళని కలిపారు..? ఎలా తమ పెళ్ళి పెద్దల చేతుల మీదుగా జరిగేటట్టు ఎలా చేశారన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఈ చిత్రంలో కథనం, స్ర్కీన్‌ప్లే చాలా ముఖ్యమైన భాగాన్ని పోషించాయి. ఒకప్పుడు దాసరి దర్శకత్వంలో వచ్చిన "స్వర్గం-నరకం' అనే చిత్రంలో కూడా ఇదే బేసిక్‌ పాయింట్‌. చాలా చిన్న విషయానికి అంటే తన భార్యను, కొడుకుని బాగా సుఖపెట్టాలని డబ్బు సంపాదన ధ్వేయంగా కష్టపడి పనిచేసే భర్త, వారిని పట్టించుకోకుండా ఉన్న భర్త నుంచి తన కొడుకుని తీసుకుని బయటకు వచ్చిన భార్య చివరికి తమ కొడుకు పెళ్ళి కోసమే కాకుండా, వారి వారి తప్పు ఎలా తెలుసుకున్నారో చక్కని స్ర్కీన్‌ప్లేతో బాగా తీశారీ సినిమాని. దర్శకుడు టెకింగ్‌ పరంగా ఒ.కె. ఈ చిత్రాన్ని అవసరమైన సమయం తీసుకుని, తీరిగ్గా ఒక శిల్పం చెక్కినట్లు చెక్కారనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్‌ హాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌కి ప్రాముఖ్యతనిచ్చి, సెకండ్‌ హాఫ్‌లో కొంచెం సెంటిమెంట్‌ని జోడించి, కాస్త సీరియస్‌గా మనుషుల మనసుల్లోని సహజనమైన భావావేశాలను బయట పెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. నిర్మాత బుజ్జి ఈ చిత్రాన్ని కాంప్రమైజ్‌ కాకుండా తీశారన్నది ఈ చిత్రం చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన:- సిద్ధార్థ, తమన్నాలు ఈ చిత్రాన్ని మ భుజాల మీదకెత్తుకున్నారు. సిద్ధార్ధ ఈ చిత్రంలో కొత్త ప్యాట్రన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అంటే నేటి తరం యువకులకు అతని పాత్ర, ఒక ప్రతినిధిగా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడతను. అలాగే ఆ పాత్రలో ఎప్పటి కప్పుడు వచ్చే మార్పులను కూడా అతను చక్కగా చూపించాడు. ఇక తమన్నా తన గ్లామర్‌తోనే కాకుండా నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సిద్ధార్థకి స్ర్కీన్‌ ఫాదర్‌ అంటే ప్రకాష్‌ రాజే అనేటంతగా వాళ్ళిద్దరూ జెల్‌ అయ్యారు. ప్రకాష్‌ రాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. రమ్యకృష్ణ సినిమా చివర్లో, తన భర్తను కలిసే సీన్లో కళ్ళళ్ళో పలికించిన భావం అద్భుతం. గచ్చిబౌలి దివాకరంగా బ్రహ్మానందం తన క్రికెట్‌ కబుర్లతో, పిచ్చితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాడు. ఇక వేణుమాధవ్‌ హీరో స్నేహితుడుగా తన పాత్రకు తాను న్యాయం చేశాడు. సంగీతం:- ఈ చిత్రంలో సంగీతం చాలా కొత్తగా వినిపిస్తుంది. పాటలన్నీ బాగున్నా, ముక్యంగా టైటిల్‌ సాంగ్‌, ఎగిరేనె పై కెగిరెనే, సుబ్రహ్మణ్యం వంటి పాటలు కానీ, రీ-రికార్డింగ్‌ కానీ చాలా ఎఫెక్టీవ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ:- నీట్‌గా, డీసెంట్‌గా ఉంది. సినిమాని అందంగా చూపించటంలో ఫొటోగ్రఫి పాత్ర చాలా ఉంది. మాటలుః- అబ్బూరి రవి మాటలు ఈ చిత్రానికి ప్రథాన ఆకర్షణ. ఈ చిత్రంలో కామెడీ డైలాగులతో పాటు, "పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్నా.. కానీ ప్రేమ మన చేతుల్లో ఉంటుంది'' వంటి చక్కని డైలాగులు కూడా మనసుకు హత్తుకునేలా వ్రాశారు. ఎడిటింగ్‌:- బాగుంది. పాటలు:- ఒ.కె. కొరియోగ్రఫీ:- టైటిల్‌ సాంగ్‌లో, ఎగిరేనె పైకెగిరెనే అనే పాటలో, సుబ్రహ్మణ్యం అనే పాటల్లో కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఈ సినిమా ఫస్ట్‌ హాఫంతా యువత కోసం సెకండ్‌ హాఫ్‌ పెద్దవాళ్ళ కోసం, కుటుంబాల కోసం తీసినట్టుంటుంది. ఈ చిత్రాన్ని కుటుంతో సహా చూడవచ్చు.