Read more!

English | Telugu

సినిమా పేరు:కిక్
బ్యానర్:ఆర్. ఆర్. మూవీమేకర్స్
Rating:3.00
విడుదలయిన తేది:May 8, 2009
కళ్యాణ్‍ (రవితేజ)ది ఒక డిఫరెంట్‍ క్యారెక్టర్. అతను ఏ పని చేసినా దాన్లో అతనికి లైఫ్ లో "కిక్'' ఉండాలి. దానికోసం అతను ఏమైనా చేస్తాడు. అలాగని అతనేం బాధ్యతలేని వ్యక్తి కాదు. మంచి మనసున్న తెలివైన కుర్రాడు. తన స్నేహితుడు (వేణుమాధవ్) వివాహాన్ని ఒక యమ్.యల్‍.ఎ. (నళిని) కూతురితో చేస్తాడు కళ్యాణ్‍. ఆ పెళ్ళి విషయం యమ్.యల్‍.ఎ.కి చెప్పి, ఆమె మనుషులు తన స్నేహితుణ్ణి తరుముతూండగా, వాళ్ళని తప్పించి మరీ గుళ్ళో పెళ్ళిచేస్తాడు. ఆ పెళ్ళి కూతురు స్నేహితురాలి నైనా (ఇలియానా). అలాంటి కళ్యాణ్ ని నైనా (ఇలియానా) చెల్లి (అషిక) ప్రేమించి, అక్కని తన ప్రేమ సఫలం అయ్యేలా చెయ్యమని కోరుతుంది. దాంతో కళ్యాణ్‍ క్యారెక్టర్ తెలిసిన నైనా. అతన్ని తన చెల్లి దగ్గరకు వచ్చి నిజం చెప్పమంటుంది. అతనూ అలాగే నిజం చెప్పి తనకు నైనా నచ్చిందనీ, ఆమెను ప్రేమిస్తున్నాననీ చెబుతాడు. కానీ నైనా అతనంటేనే చిరాకు పడుతూంటుంది. చివరికి అతనంటే ఇష్టపడి అతన్ని ప్రేమిస్తున్నానని విడిపోయే టైమ్‌కి చెబుతుంది. ఇదిలా ఉండగా కళ్యాణ్‍ దొంగతనం చేస్తాడు. ఆ దొంగతనం కేసుని కళ్యాణ్‍ కృష్ణ అనే పోలీసాఫీసర్ ఇన్వెస్ట్ గేట్‍ చేయటానికి నియమింపబడతాడు. అతను కళ్యాణ్‍ మలేసియా వెళ్ళాడని తెలిసి అతని కోసం తానూ మలేసియాకి వస్తాడు. నైనా కూడా మలేసియా వస్తుంది. అక్కడ ఆమె తండ్రి నైనా పెళ్ళి కళ్యాణ్ కృష్ణతో నిశ్చయం చేస్తాడు. మలేషియాలో నైనాకి కళ్యాణ్ కనపడతాడు. కానీ అతనికి మెమొరీ లాస్ అనే వ్యాధి వచ్చిందని తెలుసుకుని, అతన్ని తమ ఇంటిలోనే ఉంచుతుంది నైనా. ఒకపక్క పోలీసాఫీసర్‌కీ, కళ్యాణ్‍ కీ మధ్య కోల్డ్ వార్ జరుగుతూంటుంది. మలేసియాలో ఒక ఫైవ్‍ స్టార్‍ హోటల్‍ కట్టటానికి 300 కోట్లు తెచ్చిన మంత్రుల డబ్బుని కళ్యాణ్ కొట్టేస్తాడు. ఆ తర్వాత ఇండియాకి వచ్చాక, పోలీస్ కళ్యాణ్‍ కృష్ణ, దొంగ కళ్యాణ్‍ కి వార్నింగిస్తాడు. దాంతో కళ్యాణ్‍ "రేపు మధ్యాహ్నం 12 గంటలకు అధికార పార్టీ ఫండ్ 500 కోట్లు కొట్టేస్తా దమ్ముంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకో''మని ఛాలెంజ్‍ చేస్తాడు. ఆ డబ్బుని కళ్యాణ్‍ దొంగిలించగలిగాడా...? అసలు కళ్యాణ్‍ అంత డబ్బుని ఎందుకు దొంగతనం చేసినట్టు....? నైనా, కళ్యాణ్‍ ల ప్రేమ ఏమయింది....? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ :
దర్శకత్వం - : ఒక టెక్నీషియన్‌గా సురేందర్ రెడ్డి ఎలాంటి దర్శకుడో ఇప్పటికే రుజువుచేసుకున్నాడు. వరస కుదిరితే సినిమా సూపర్ హిట్‍ చేయగల సత్తా అతనికుంది. అది ఈ చిత్రంతో నిరూపించబడుతుమది. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంది. కథనం కూడా ఒక విభిన్న పంథాలో చెప్పటం జరిగింది. ఇక టేకింగ్ పరంగా డీసెంట్‍గా ఉంది. రవితేజ క్యారెక్టర్‌ గురించి వేణు మాధవ్ చెప్పే ఎపిసోడ్‌ని యానిమేషన్ లో చూపించటం బాగుంది. అలాగే బ్రహ్మానందం, ఇలియానాల ఎపిసోడ్ లో కూడా వైలెన్స్ వాయిస్తున్న అబ్బాయిలు రావటం అనే కాన్సెప్ట్ కూడా బాగుంది. నిర్మాణపు విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడా ఖర్చుకి వెనుకాడకుండా, క్వాలిటీకి రాజీపడకుండా ఈ చిత్రాన్ని తీశారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఒక అందమైన సందేశం ఉంది. అదేంటంటే నిజమైన ఆనందం మరొకరికి సంతోషం కలిగించినప్పుడే లభిస్తుందనేది ఆ సందేశం.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సంగీతం -: గొప్పగా లేకపోయినా, సన్నివేశాలకు తగ్గట్టు రీ-రికార్డింగుంది. అలాగే పాటలు బయట విన్నప్పటికన్నా సినిమాలో ఇంకా బాగున్నాయి. కెమెరా -: చాలా బాగుంది. సినిమా చక్కగా చూపించటంలో రసూల్‍ ఎల్లోర్ కెమెరా పనితనం బాగుంది. మలేసియా అందాలు అతను చుపించిన తిరు బాగుంది. పాటల్లో కూడా ఫొటోగ్రఫీ చాలా బాగుంది. మాటలు -: బాగున్నాయి. అబ్బూరి రవి మాటల్లో పంచ్ చాలా బాగుంది. పాటలు -: పాటలు వ్రాసింది సితారామశాస్త్రి, సి.నారాయణరెడ్డి. వాళ్ల గురించీ, వాళ్ళు వ్రాసే పాటల గురించీ ఇవాల కొత్తగా చెప్పక్కరలేదుగా. ఎడిటింగ్ -: గౌతంరాజు ఎడిటింగ్‍ చాలా బాగుంది కొరియోగ్రఫీ -: ఫరవాలేదు. గొప్పగా లేకపోయినా చెత్తగా మాత్రం లేదు. రవితేజ బాడీ లాంగ్వేజ్‍ కి తగ్గట్టుగా కొరియోగ్రఫీ ఉంది యాక్షన్ -: బాగుంది.. ముఖ్యంగా మలేసియాలో కార్ ఛేజింగ్ సీన్లు బాగున్నాయి. మీరు కనుక ఓ రెండు గంటల పాటు మీ కుటుంబంతో హాయిగా నవ్వుకుంటూ, అసలైన ఆనందానికి అర్థం తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని సకుటుంబంగా తప్పక చూడండి.