Read more!

English | Telugu

సినిమా పేరు:కథ
బ్యానర్:జస్ట్ యెల్లో
Rating:2.25
విడుదలయిన తేది:Dec 12, 2009
వైజాగ్‌లో ఓ చిల్డ్రన్స్‌ స్కూల్‌లో టీచర్‌గా జాయిన్‌ అవుతుంది చిత్ర (జెనీలియా). ఆమె హేమోఫోబియా, ఆటోఫోబియా లాంటి సైకలాజికల్‌ వ్యాధులతో బాధపడుతుంటుంది. తన బ్యాక్‌గ్రౌండ్‌ గురించి, తనకున్న వ్యాధి గురించి ఎవరికీ తెలియనీయకుండా ఒంటరిగా ఉంటుంది. చిన్నపిల్లలతో సరదాగా ఉంటున్న చిత్రకి కృష్ణ (అరుణ్‌ అజిత్‌)పరిచయమవుతాడు. అతను తాను దర్శకత్వం చేపట్టబోయే "హత్య" అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌కోసం కథని సిద్దం చేసే పనిలో ఉంటాడు. ఓరోజు అనుకోకుండా ఓ అమ్మాయిని ఓ ఆగంతకుడు హత్య చేస్తుంటే చూసి విపరీతంగా షాక్‌కి గురవుతుంది చిత్ర. కృష్ణతో కలిసి తాను హత్య చూసిన విషయాన్ని సి.ఐ. షణ్ముఖరావు (ప్రకాష్‌రాజ్‌)కి కంప్లైంట్‌ చేస్తుంది. షణ్ముఖరావుతో కలిసి సత్య, కృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకుని చూసినా అక్కడ హత్య జరిగినట్టు ఏలాంటి ఆధారాలు కనిపించవు. అప్పటి నుండి రాత్రివేళలో చిత్ర ఉంటున్న ఇంట్లో ఎవరో ఆగంతకుడు ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్నట్టు చిత్ర ఫీలవుతుంటుంది. ఆ క్రమంలో సత్య ప్రవర్తన వింతగా కనిపిస్తుంది. ఆమె సైకలాజికల్‌ వ్యాధితో బాధపడుతుందని తెలుసుకున్న కృష్ణ, షణ్ముఖరావులు ఆమె చూసిన హత్య కూడా కేవలం ఆమె భ్రమే అన్న నిర్ణయానికి వస్తారు. తరువాతేం జరిగిందన్నదే మిగతా కథ..
ఎనాలసిస్ :
ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌. సినిమా చివరి వరకూ సస్పెన్స్‌ని మెయింటెయిన్‌ చేయడంలో దర్శకుడు బాగానే ప్రతిభ కనబరిచారు. అయితే కథలో మరింత బిగువు ఉండేలా చూసుకుని ఉండాల్సింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌లు ముఖ్యంగా స్క్రీన్‌ప్లేపైనే ఆధారపడి ఉంటాయి. ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే బాగానే పండినప్పటికీ కొన్ని కొన్ని చోట్ల ప్రేక్షకుల్లో అసహనం కలిగిస్తుంది.కథ ఎక్కడో మొదలయి, మరెక్కడో ఎండవుతుంది.. ఈ చిత్రానికి మరో ప్రధాన మైనస్‌ పాయింట్‌ సరయిన కామెడీ లేకపోవడం.. ఉన్నంతలో రఘుబాబు నవ్వించడానికి ప్రయత్నించాడు. అసలు నిజంగా హత్య జరిగిందా లేక అంతా హీరోయిన్‌ పడుతున్న భ్రమేనా అన్న ఆలోచనని చివరి వరకూ ప్రేక్షకుల్లో కలిగించడంతో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. ఈ చిత్రానికి జెనీలియా, అరుణ్‌అజిత్‌, ప్రకాష్‌రాజ్‌ల పాత్రలే కీలకం.. ఈ మూడు పాత్రలని చక్కగా ఎలివేట్‌ చేయడంలో కూడా దర్శకుడు సక్సెస్‌ సాధించారనే చెప్పాలి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్: