Read more!

English | Telugu

సినిమా పేరు:కళావర్ కింగ్
బ్యానర్:సాయికృష్ణా ప్రొడక్షన్స్
Rating:2.25
విడుదలయిన తేది:Feb 26, 2010
రాజమండ్రి సమీపంలోని ఓ గ్రామంలో రాజేష్ (నిఖిల్) అనే యువకుడు ఉంటాడు. అతనికి ఊరినిండా అప్పులే.. అతనిలో ఉన్న మిమిక్రీ చేసే టాలెంట్ తో ఆ అప్పుల వారందరినీ మోసంచేస్తూ కొత్త అప్పులు ఎలా చేయాలో ఆలోచిస్తూ గడుపుతుంటాడు. ఆ ఊళ్ళో నరేంద్రశెట్టి (అజయ్) వడ్డీ వ్యాపారం చేసుకునే ఓ రౌడీ. అతని భార్యని చంపేస్తాడు. అతని భార్య చెల్లెలు అయిన శృతి (శ్వేతా బసు ప్రసాద్)ని పెళ్ళి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. నరేంద్ర శెట్టితో పెళ్ళి ఏమాత్రం ఇష్టం ఉండదు శృతికి. అనుకోకుండా రాజేష్ తో శృతికి పరిచయం ఏర్పడుతుంది. నరేంద్రశెట్టి ద్వారా శృతి ఇబ్బందులు పడుతుందని తెలుసుకున్న రాజేష్ శృతిని రక్షించడానికి పూనుకుంటాడు. కరుడు కట్టిన రాక్షసుడయిన నరేంద్రశెట్టి బారి నుండి శృతిని రాజేష్ కాపాడాడా లేదా అన్నదే మిగతా కథ.
ఎనాలసిస్ :
కథ మొత్తం ఓ పల్లెటూర్లోనే సాగిపోతుంది. దర్శకుడు సురేష్ కథని బాగానే డీల్ చేసాడు. అలాగే వేణుమాధవ్, ఆలీలతో కామెడీని కూడా బాగానే పండించగలిగాడు. ఫస్టాఫ్ అంతా సాగదీసినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ కి వచ్చే సరికి కథ పట్టుబిగించడంతో పాటు ఆలీ కామెడీ ప్రేక్షకులని కట్టిపడేస్తాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన :-నిఖిల్ సిద్దార్థ :- నిఖిల్ సిద్దార్థ తన రొటీన్ నటననే కనబరిచాడు. డైలాగులు ఫాస్ట్ గా చెప్పేయడంతో అక్కడక్కడా అతను చెప్పే డైలాగులు అర్థం కావు. అదొక్కటి తప్పితే నటన పరంగా, డాన్స్ పరంగా ఓకే. శ్వేతాబసు ప్రసాద్:- హీరోయిన్ శ్వేతాబసుప్రసాద్ నటన బావుంది. అయితే కాస్త లావుగా కనిపించడం మైనస్ పాయింట్.అజయ్:- అజయ్ కి ఇలాంటి క్యారెక్టర్ లు కొత్తేమీ కాదు. తన పాత్రకి తగ్గట్టుగా బాగా చేశాడు. ముఖ్యంగా ఆలీ, అజయ్ ల కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. వేణుమాధవ్:- వేణుమాధవ్ గురించి చెప్పేదేముంది..? తనదైన శైలిలో కామెడీని చక్కగా పండించాడు.ఆలీ:- విలన్ అజయ్ ని బురడీ కొట్టించడానికి ఆలీ వేసుకునే 'ఇసాంబుల్ అవుల్ జవుల్ పకీర్' వేషం, ఆ వేషంలో ఆలీ చేసే కామెడీ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది.ధర్మవరపు సుబ్రహ్మణ్యం:- బ్యాంకు మేనేజర్ పాత్రలో ధర్మవరపు తనదైన శైలిలో కామెడీని పండించారు. రఘుబాబు విలన్ పక్కనే ఉండే క్యారెక్టర్ రఘుబాబుది. ఓ కాలేజి స్టూడెంటు ప్రేమలో పడిపోయే సన్నివేశాలని చాలా బాగా చేశాడు. అతని కామెడీ బావుంది.మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు.సంగీతం:- సంగీతం యావరేజ్ గా ఉంది.మాటలు:- అక్కడక్కడా బావున్నాయి. ముఖ్యంగా ధర్మవరపు, నిఖిల్ తో 'యాక్టింగ్ లో ఎన్టీఆర్, రాజకీయాల్లో రాజశేఖరరెడ్డి, అప్పుల్లో నిన్ను మించిన వాడు ఈ ప్రపంచంలోనే లేడు' అనే డైలాగ్ మరియు ఆలీ 'ఈ బూడిదతో ఎంతో ప్రేమికులని కలిపాను' అంటే దానికి రఘుబాబు 'బూడిదతో కలిపావా..? బూడిదలో కలిపావా..?' అనే డైలాగులు ఆకట్టుకుంటాయి.పాటలు:- భాస్కరభట్ల, వనమాలి, కృష్ణ చైతన్య అందించిన సాహిత్యం బావుంది.మిగతా డిపార్ట్ మెంట్ వర్క్ కూడా ఫర్వాలేదు.సరదాగా నవ్వుకోవడానికి ఈ చిత్రం చూడొచ్చు.