Read more!

English | Telugu

సినిమా పేరు:జంక్షన్
బ్యానర్:లియో ఎంటర్ టైన్ మెంట్స్
Rating:---
విడుదలయిన తేది:Jun 26, 2009
ఇదీ ఒక జంక్షన్ కథ. అక్కడుండే అనాథల కథ. ఆ అనాథలకు, ఆ జంక్షన్‌కీ రాజన్న (పరుచూరి రవీంద్రనాథ్) అండగా ఉంటాడు. రాజన్న ఆ జంక్షన్ లో కలెక్ట్ చేసిన రౌడీ మామూళ్ళన్నీ, శంకర్‌కు అందజేస్తుంటాడు. ఒక్క రాజన్నే కాదు హైద్రాబాద్‌లోని ప్రతీ జంక్షన్ నుంచీ అతనికి మామూళ్ళు వెళుతుంటాయి. నిజానికి ఈ శంకర్ అనే వాడు ఆలీభాయ్ (కోట శ్రీనివారావు) మనిషి. ఉన్ననాడు తింటూ లేనినాడు పస్తులుంటూ ఆ జంక్షన్‌ని నమ్ముకుని చాలామంది రాజన్న నీడలో బ్రతుకీడుస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం మెట్రో రైలు ప్రోజెక్టుని కట్టేందుకు పార్థసారథి (భానుచందర్) అనే ఒక స్పెషల్‍ ఆఫీసర్ ని నియమిస్తుంది. అతని ప్లాన్ ప్రకారం ఆ ప్రోజేక్టు కడితే తనకు వంద కోట్లు నష్టం వస్తుంది కాబట్టి దాన్ని దారి మళ్ళించమని ఆ ఆఫీసర్ మీద వత్తిడి తెస్తాడు అధికార పార్టీ యమ్.యల్‍.ఎ. (డాక్తర్ శివప్రాసాద్). అందుకతను ఒప్పుకోడు. తన ఆస్తి కాపాడుకోటానికి యమ్.యల్‍.ఎ.ఆలీభాయ్‌తో ఒక ఒప్పందం చేసుకుంటాడు. దాని వల్ల పార్థసారథిని చంపటానికి రాజన్నని ఒక పావులా ఉపయోగించుకుంటాడు ఆలీభాయ్. ఇది తెలుసుకున్న రాజన్న ఆలీభాయ్‌ని నిలదీస్తే, అతన్ని కొట్టిస్తాడు ఆలీభాయ్. దాంతో శంకర్‌నీ, ఆలీభాయ్‌ని, యమ్‌‍.యల్‍.ఎ.ని చంపేస్తాడు. దానివల్ల తిరిగి మళ్ళీ అనాథల జంక్షన్ వాళ్ళకి దక్కుతుంది. వారి జీవితాలు మళ్ళీ యధాప్రకారం కొనసాగుతుంటుంది. క్లుప్తంగా ఇదీ కథ
ఎనాలసిస్ :
ఇది హిందీలో వచ్చిన "ట్రాఫిక్ సిగ్నల్‍" అనే చిత్రానికి దగ్గరగా ఉంది. ఈ సినిమా కథ, మాటలు, దర్శకత్వం వరకూ బాగానే ఉన్నా కెమెరా ఈ చిత్రానికి దారుణమైన మైనస్‌గా నిలిచింది. కెమెరా ఏ సందర్భంలోనూ ఏ దృశ్యాన్నీ సరిగ్గా చూపించిన పాపానపోలేదు. దర్శకత్వం టేకింగ్ పరంగా బాగుంది. స్క్రీన్‌ప్లే కూడా ఫరవాలేదు. అనిల్‍ కృష్ణ యాక్షన్‌ గొప్పగా లేకపోయినా చెత్తగా మాత్రం లేదు. ఇక నిర్మాణపు విలువలు అవసరమైన స్థాయిలో ఈ చిత్రానికి లేవనే చెప్పాలి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన విషయానికొస్తే కొత్తవాడైనా పరుచూరి రవీంద్రనాథ్ బాగానే నటించాడు. హీరోయిన్ నైనా కూడా అంతే. కోట శ్రీనివాసరావు, యమ్‌‍.యస్.నారాయణ, డాక్టర్ శివప్రసాద్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక పోకిరి చిత్రంలో బ్రహ్మానందం, ఆలీల కామెడీ ట్రాక్ ఈ చిత్రంలో రివర్స్ చేసి వాడుకున్నారు. అది బాగానే పండింది. అలాగే వేణుమాధవ్ కారు పోలీసులు తీసుకెళ్ళారని పక్కొళ్ళని అడుక్కునే సీన్ కూడా మొదటిసారి కంటే రెండవసారి చేసింది బాగా పండింది. సంగీతం-: ఫరవాలేదు.పాటలు యావరేజ్‍గా ఉన్నాయి. రీ-రికార్డింగ్ ఒ.కె. కెమెరా -: దీని గురించి మాట్లాడకపోవటమే మంచిది. ఎడిటింగ్ -: యావరేజ్‍గా ఉంది. మాటలు -: కొన్ని సందర్భాల్లో చాలా బాగున్నాయి. వ్రాసింది పరుచూరి బ్రదర్స్ కదా. హీరో వాళ్ళబ్బాయే కదా. మాటలు బాగానే ఉంటాయి మరి. పాటలు -: పాటల్లో సాహిత్యం బాగుంది. కొరియోగ్రఫీ -: యావరేజ్‍గా ఉంది. యాక్షన్ -: ఇది కూడా అంతే. యావరేజ్‍గానే ఉంది. ఈ చిత్రాన్ని బాగా తీయటానికి గట్టి ప్రయత్నమే జరిగింది. కానీ ఆశించిన స్థాయిలో తీయలేకపోయారు. దీన్ని చూడాలంటే ప్రత్యేకమైన అభిరుచి, సామాజిక స్పహ ఉండాలి. లేకపోతే చూడలేరు.