Read more!

English | Telugu

సినిమా పేరు:జోష్
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Sep 5, 2009
సత్య (నాగచైతన్య) వైజాగ్‌లో ఉండే కాలేజీ విద్యార్థి. అతను స్కూల్‍ చదువంతా చాలా మంచి విద్యార్థిగా చదివి, కాలేజీకి రాగానే అతనిలో ఒక రకమైన తిరుగుబాటు ధోరణి మొదలవుతుంది. ఆ ధోరణి వల్ల అతని కాలేజ్‍ ప్రిన్సిపాల్‍ సురేంద్ర కుమార్ (ప్రకాష్ రాజ్‍) ఎన్ని విధాలుగా సత్యకి నచ్చచెప్పటానికి ప్రయత్నించినా అతను వినడు. పైగా రెచ్చిపోతుంటాడు. ఆవేశంలో ఉన్న సత్య పాల్గొన్న ఒక బైక్ రేస్‌లో సత్యతో పాటు కూర్చున్న ప్రిన్సిపాల్‍ కొడుకు చనిపోతాడు. అయినా సత్యని ప్రిన్సిపాల్‍ ఏమనడు. అతని క్షమాగుణాన్ని తట్టుకోలేని సత్య చదువు మానేసి ఉద్యోగం కోసం వైజాగ్ నుండి హైదరాబాద్ వస్తాడు. సినిమా ఇక్కడ మొదలవుతుంది. పైన చెప్పినదంతా ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుంది. హైదరాబాద్ వచ్చిన సత్యకు ఇక్కడ యమ్.జి.యమ్. కాలేజీ విద్యార్థులను చూస్తే తనను తాను చూసుకుంటున్నట్టుంటుంది. వాళ్ళంతా జె.దుర్గారావు (జె.డి.చక్రవర్తి)అనే యువనేత చేతుల్లో పావులుగా వాడుకోబడుతున్నారని తెలుసుకుని, తాను అదే కాలేజీలో విద్యార్థిగా చేరతాడు. ఇంతకి ఆ కాలేజీలో సత్య ఎందుకు చేరాడో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ :
అయినా సత్యని ప్రిన్సిపాల్‍ ఏమనడు. అతని క్షమాగుణాన్ని తట్టుకోలేని సత్య చదువు మానేసి ఉద్యోగం కోసం వైజాగ్ నుండి హైదరాబాద్ వస్తాడు. సినిమా ఇక్కడ మొదలవుతుంది. పైన చెప్పినదంతా ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుంది. హైదరాబాద్ వచ్చిన సత్యకు ఇక్కడ యమ్.జి.యమ్. కాలేజీ విద్యార్థులను చూస్తే తనను తాను చూసుకుంటున్నట్టుంటుంది. వాళ్ళంతా జె.దుర్గారావు (జె.డి.చక్రవర్తి)అనే యువనేత చేతుల్లో పావులుగా వాడుకోబడుతున్నారని తెలుసుకుని, తాను అదే కాలేజీలో విద్యార్థిగా చేరతాడు. ఇంతకి ఆ కాలేజీలో సత్య ఎందుకు చేరాడో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.కాకపోతే ఈ సినిమా స్క్రీన్‌ప్లేలో డ్రాపవుట్స్ ఎక్కువగా ఉన్నాయి. సినిమా బాగుంది అనుకునేలోపే సినిమా పడిపోతుంటుంది. ప్రకాష్ రాజ్‍ కొడుకు చనిపోయిన సీన్ లో సెంటిమెంటు అవసరమైన స్థాయిలో పండలేదు. ఇక దర్శకత్వం విషయానికొస్తే ఈ సినిమాలో ఏ సీన్ కా సీన్ బాగుంటుంది. కానీ మొత్తంగా కలిపిచూస్తునప్పుడు ఎక్కడో తేడాగా ఉంటుంది. అది దర్శకుడి మీద సహజంగా ఉండే తొలి సినిమా తాలూకు, పెద్ద హీరో కుమారుడితో చేస్తున్నందువల్ల వచ్చిన వత్తిడి కావచ్చు. కానీ టేకింగ్ పరంగా వాసు వర్మ ఒ.కె. కానీ ఈ సినిమా చివర్లో యువత, ముఖ్యంగా విద్యార్థుల ప్రవర్తన గురించీ, వారి భవిష్యత్తు గురించి ఒక చక్కని సందేశాన్నివ్వటమ మాత్రం బాగుంది. అది దర్శకుడికి సమాజం పట్ల ఉన్న గౌరవం కావచ్చు. అతనికున్న సామాజిక స్పృహ మెచ్చుకోతగింది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన -: ఈక నటన విషయానికొస్తే తన తండ్రి నాగార్జున తొలి చిత్రం "విక్రమ్"లో నటించిన నటనతో పోలిస్తే, నాగచైతన్య బెటర్ యాక్టర్ అని చెప్పుకోవాలి. ఇతని నటనలో కాన్ఫిడెన్స్ లెవెల్‍ బాగా ఉంది. అతని ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ అద్బుతంగా వుంది. అతను సమ్మర్‌ సాల్ట్‌ కొట్టడం, అలాగే రింగ్స్‌ మీద అతను చేసే ఫీట్స్‌ ఆ విషయాన్ని స్వష్టంగా చెబుతాయి. అతని ప్రతి కదలికలో, డైలాగ్ చెప్పిన విధానంలో అది బలంగా కనపడుతూంది. అతని హావభావాలు, బాడీ లాంగ్వేజ్‍ కూడా చాలా బాగున్నాయి. కాలేజీలో పోడియం వద్ద అతని స్పీచ్, హాస్పిటల్లో బెడ్ మీద అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కాకపోతే అతని లాంఛంగ్‌కి ఇది సరైన కథ కాదు... సరైన సినిమా కూడా కాదు. కాని ఈ గేమ్ లో హీరోగా అతనే బలయ్యాడని చెప్పాలి.కానీ అతనికి నటుడిగా, హీరోగా మంచి భవిష్యత్తుందనటంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని అతనొక్కడే ఒంటిచేత్తో లాక్కొచ్చాడు కాబట్టి. ఇక హీరోయిన్ కార్తీక ఈ పాత్ర లేకున్నా ఈ చిత్రానికి గానీ, కథకు కానీ వచ్చిన నష్టమేమీ లేదు. అనవసరమైన పొడిగింపు తప్ప. ఆ నాటి శివలో యువ విలన్ గా నటించిన జె.డి.చక్రవర్తి ఈ చిత్రంలో యువ నేతగా చక్కగా నటించాడు. ఇక ప్రకాష్ రాజ్‍ పాత్ర అంత గొప్పదేం కాదు కానీ కీలకమైంది. అది అవసరం అయిన మేరకు ఈ చిత్రంలో కుదరలేదు. బ్రహ్మానందం, సునీల్‍, హేమ వీళ్ళ కామెడి పెద్దగా పండలేదనే చెప్పాలి. మిగిలిన వాళ్లంతా ఎవరి పాత్రలకు వారు న్యాయం చెశారు. సంగీతం -: ఈ చిత్రంలో సంగీతం బాగుంది. పాటలన్నీ చాలా బాగున్నాయి. "జిగిజిక్క పాట, అన్న వచ్చిండో, కాలేజీ బుల్లోడ'' పాటలు మాస్‌కి బాగా నచ్చుతాయి. మిగిలిన పాటలు కూడా బాగున్నాయి. రీ-రికార్డింగ్ సందర్భోచితంగా బాగుంది. కెమెరా -: అద్భుతంగా లేకపోయినా ఛండాలంగా మాత్రం లేదు. ఫొటోగ్రఫీ ఫరవాలేదు. పాటల్లో, ఫైట్స్ లో కొంచెం బెటరనిపిస్తుంది. మాటలు -: దర్శకుడు వాసువర్మ వ్రాసిన మాటలు బాగున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ట్తైల్లో కొత్తగా అనిపిస్తాయి. ఎడిటింగ్ -: చక్కగా నీట్‍ గా ఉంది. ఆర్ట్ -: ఒ.కె. యాక్షన్ -: "శివ'' సినిమా స్ట్తెల్లో కాలేజీలో ఒక ఛేజింగ్ సీన్ ఉంది. అది గొప్పగా ఏం లేదు. మిగిలిన ఫైట్లు బాగున్నాయి. నాగచైతన్య హీరోగా ఎలా చేసుంటాడో అని చూద్దామనుకుంటే ఈ చిత్రం హ్యాపీగా చూడొచ్చు. ఒవరాల్‍ గా ఈ చిత్రం చూడాల్సినంత గొప్ప చిత్రమేం కాదు.