Read more!

English | Telugu

సినిమా పేరు:జోరు
బ్యానర్:సినిమా టాకీస్
Rating:2.25
విడుదలయిన తేది:May 28, 2010
అప్పుడు అతని బంధువుల పిల్లల వల్ల అతను కూడా పోలీసుల వల్ల జీహాద్ జరిపే కుట్రదారుడిగా చిత్రీకరించబడతాడు. చివరికి వీళ్లంతా రకరకాల కారణాల వల్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరతారు. అక్కడ తీవ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూంటే అక్కడి ప్రజలను కాపాడటం కోసం ఆ ఉగ్రవాదులతో పోరాడి వివేక్ చక్రవర్తి, కేబుల్‍ నాగరాజు ప్రాణాలు కోల్పోతారు. అక్కణ్ణించి బ్రతికి బయటపడ్డ రాములు తన మనవణ్ణి పటేల్‍ వద్ద నుండి విడిపించుకుంటే, సరోజ తను వ్యభిచారాన్ని వదిలేసి మనిషిగా కష్టపడి పనిచేసి బ్రతకాలనుకుంటుంది. రహీముద్దీన్ ఖురేషిని అపార్థం చేసుకున్నందుకు ఇన్ స్పెక్టర్ చేతులు జోడిస్తాడు. క్లుప్తంగా ఇది కథ.
ఎనాలసిస్ :
నువ్వు ప్రేమించిన వారికోసం చనిపోవడం కాదు.. నిన్ను ప్రేమించే వారికోసం బ్రతకాలి.. అనే కాన్సెప్ట్ తో రూపొందించిన చిత్రం ఇది. ప్రేమ పేరుతో నేటి యువత ఎలా ఆత్మహత్యలకు పాల్పడుతోంది.. క్షణికావేశం లో తమ జీవితాలని ఎలా బలి చేసుకుంటున్నారు.. ఆత్మహత్య అనే ఆలోచన దాటి కొత్త జీవితంలోకి ప్రవేశిస్తే వారి జీవితం ఎలా మారిపోతుంది.. లాంటి వాటిని ఈ సినిమాలో ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు. కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ కథ, కథనంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది. ఓ చక్కని పాయింట్ తో చిత్రాన్ని తీసేటప్పుడు కథనం విషయం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
అరవింద్ కుమార్ కొత్తవాడే అయినప్పటికీ బాగానే చేసాడు. అక్షర లో హీరోయిన్ లక్షణాలు కనిపించలేదు. సాయికుమార్ క్యారెక్టర్ బావుంది. తన పాత్రలో ఒదిగిపోయాడు సాయికుమార్, సుమన్ శెట్టి కామెడి బావుంది. మిగతా నటీ నటులు తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు.చక్రి సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. అన్ని పాటలు వినసొంపుగానే వున్నాయి.చంద్రబోస్ సాహిత్యం బావుంది. మరుధూరి రాజా అందించిన మాటలు బావున్నాయి. సుమన్ శెట్టి 'సర్వర్ అంటే సర్వేశ్వరుడితో సమానం రా' .. 'నీ పని నువ్వు చేసావ్, దేవుడి పని దేవుడు చేసాడు, నా పని నేను చేస్తున్నాను' లాంటి మాటలు ఆకట్టుకుంటాయి.కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, కథ లో జోరు తగ్గింది.