Read more!

English | Telugu

సినిమా పేరు:జయీభవ
బ్యానర్:యన్.టి. ఆర్. ఆర్ట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Oct 23, 2009
ముగ్గురు కార్మికులు. వారిలో భవానీ (ముఖేష్ రుషి) నరసింహ (జయప్రకాష్ రెడ్డి) ఇద్దరూ ప్రాణ స్నేహితులు. మూడోవ్యక్తి యాదగిరి {ఆశిష్ విద్యార్థి}.ఇతను ప్రాణస్నేహితులిద్దరినీ విరోధులుగా మార్చి తన పబ్బం గడుపుకుంటాడు.కాలం గడిచే సరికి మిత్రులిద్దరూ ప్రభుత్వ కాంట్రాక్టు వ్యాపారంలో పోటీపడుతూ బాగా సంపాదిస్తారు.యాదగిరి మాత్రం యాదూ మాఫియా డాన్ గా మారి క్రికెట్‍ బెట్టింగులపై హాంకాంగ్ లో కోట్లు గడిస్తూంటాడు.భవానీ కొడుకు (నందమూరి కళ్యాణ్‍ రామ్) హాంకాంగ్ కి వెళ్ళి అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్న నరసింహ కూతురు అంజలి(హన్సిక మోత్వానీ)ని ప్రేమిస్తాడు.నిజానికి అతను యాదూని కలసి అతను క్రికెటర్లను కొని చేసే, ఈ క్రికేట్ బెట్టింగ్ వ్యాపారాన్ని దెబ్బకొట్టి అతన్ని జైల్లో పెట్టించటానికే హాంకాంగ్ కి వస్తాడు.అనుకున్న పని అనుకున్నట్టుగా చేసి ఇండియాకి తిరిగొస్తాడు భవానీ కొడుకు.భవానీ కొడుకు బద్ధవిరోధులుగా మారిన ప్రాణస్నేహితులను కలిపి ఎలా తన ప్రియురాలిని దక్కించుకున్నాడు అనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
రొటీన్ కథలకు భిన్నంగా ఒక కొత్త తరహా కథను తీసుకుని పాత తరహా కథనంతో టేకింగ్ పరంగా కొత్తగా ఈ చిత్రాన్ని చూపించారు.ఈ చిత్రం తొలి సగమంతా ఆడుతూ పాడుతు గడిచిపోతుంటుంది.నిజానికి అసలు కథ ప్రారంభమయ్యేది సెకండ్ హాఫ్ లోనే.ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు నరేన్ కొండేపాటి కొత్తవాడైనా చక్కని స్క్రీన్ ప్లేతో, సుత్తిలేకుండా సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా మలిచాడు.సినిమా అంతా రిచ్‌గా, కలర్ ఫుల్ గా మలిచాడు.తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న తడబాటు సినిమాలో ఎక్కడా కనబడకుండా దర్శకత్వం వహించాడు.సినిమాని హాఫ్ వే లో ప్రారంభించి చక్కని సస్పెన్స్ మెయిన్ టైన్ చేశాడు దర్శకుడు. కామెడీకి కొదువ లేకుండా ఆలీ, బ్రహ్మానందం, రఘుబాబు చక్కగా నవ్వించారు.ఇక సినిమాలో నిర్మాణపు విలువలు బాగున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఇక నటన విషయానికొస్తే... హీరో నందమురి కళ్యాణ్‍ రామ్ హీరోగా చక్కని నటన కనబరిచాడు.పాటల్లో, ఫైట్స్ లో ఆయన చక్కని ప్రతిభ కనబరిచారు.హీరోయిన్ హన్సిక మోత్వానీ తన అందంతో ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావలిసినంత గ్లామర్ వొలకబోసింది.ఆలీ, బ్రహ్మానందం, వేణు మాధవ్, రఘుబాబుల కామెడీ మనల్ని హాయిగా నవ్విస్తుంది.ఆశిష్ విద్యార్థి, ముఖేష్ రుషి, జయప్రకాష్ రెడ్డి తమ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. సంగీతం-:ప్రస్తుతం పూర్తి స్థాయిలో వరుస హిట్లతో విజృంభిస్తున్న థమన్.యస్.ఈ చిత్రానికి కూడ చక్కని సంగీతాన్నందించారు. అన్ని పాటలు బాగున్నాయి."వేర్ ఎవర్ యూ గో నీతో వస్తా" అనే పాట మరీ బాగుంది.వినటానికి.. చూసేందుకు కూడా.రీ-రికార్డింగ్ కూడా చక్కగా ఉంది. సినిమాటోగ్రఫీ-:బాగుంది.సినిమాని నీట్ గా విజువల్ ఫీస్ట్ లా మలిచాడు ఈ చిత్ర కెమేరామెన్.ముఖ్యంగా పాటల్లో, యాక్షన్ సీన్లలో కేమేరా పనితనం బాగుంది. ఎడిటింగ్-:వందల చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసి, ఓ పాతిక నందుల దాకా సంపాదించిన గౌతమ్ రాజు దీనికి ఏడిటర్.ఎడిటింగ్ బాగుంది. కొరియోగ్రఫీ-: అన్ని పాటల్లోనూ కొరియోగ్రఫీ సందర్భోచితంగా ఉండి బాగుంది. యాక్షన్-: ఈ చిత్రంలోని అన్ని యాక్షన్ సీన్లూ బాగున్నాయి. ఓ రెండు గంటలపాటు సరదాగా సకుటుంబంగా ఎంజాయ్ చేయాలనుకుంటే హాయిగా ఈ సినిమా చూడండి.