English | Telugu
సినిమా పేరు:హ్యాపీ హ్యాపీగా
బ్యానర్:ఓషియన్ ఫిలింస్
Rating:2.00
విడుదలయిన తేది:Aug 20, 2010
బ్యానర్:ఓషియన్ ఫిలింస్
Rating:2.00
విడుదలయిన తేది:Aug 20, 2010
సంతోష్ (వరుణ్ సందేశ్)అనే ఒక అనాథ నలుగురుని కలుపుకుని ఒక కార్టూన్స్ అనే కంపెనీని నడుపుతుంటాడు.ఎవరి తరపునైనా ఒకరికి బొకేలు బహుమతులను హృద్యంగా అందజేయటమే ఈ కంపెనీ పని.అతనికి ఎవరినన్నా ప్రేమించి,వారిచే ప్రేమించబడాలని బలమైన కోరిక.ఎంతమందికి ప్రపోజ్ చేసినా ఒక్కరు కూడా అతన్ని ప్రియుడిగా అంగీకరించరు.విదేశాల నుండి వచ్చిన పూజ(వేగ)అనే అమ్మాయి సంతోష్ మనసుకి బాగా నచ్చి ఆమెను నిజాయితీగా ప్రేమిస్తుంటాడు.కానీ ఆమెకు ప్రేమంటే పడదు.సంతోష్ తన ప్రియురాలి గురించి,ఆమెను తానెంతగా ప్రేమిస్తుంది పూజకు ఆమెనుద్దేశించే చెపుతుంటాడు.కానీ అది ఆమెకు అర్థం కాదు.ఒక సందర్భంలో నీ ప్రియురాలిని చూపించమని బలవంతం చేస్తే,ఏం చేయాలో తెలీక అప్పటికి
తప్పించుకోటానికి,వెళ్ళిపోతున్న ఒక తెల్ల చుడిదార్ వేసుకున్న అమ్మాయిని వెనుకనుంచి చూపిస్తాడు సంతోష్.సంతోష్ కి తెలియకుండా ఆ వైట్ చుడీదార్ అమ్మాయిని కలుస్తుంది పూజ. ఆమె పేరు ప్రియ(శరణ్య).వైజాగ్ లో పేరు మోసిన దాదా సూరి(బొమ్మాళీ రవి)కి చెల్లెలు.ప్రియను కలిసిన పూజ,ప్రియను సంతోష్ ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పి అతను వ్రాసిన ఉత్తరాలను ఆమెకిస్తుంది.ప్రియ ముందు నిరాకరించినా,తర్వాత సంతోష్ ని ప్రేమించటం మొదలుపెడుతుంది.ఈ విషయం పూజ ద్వారా తెలుసుకున్న సంతోష్ ప్రియకు తానామేను ప్రేమించటం లేదనీ,తాను పూజను ప్రేమిస్తున్నాననీ చెప్పే సమయానికి,ప్రియ కొద్దిరోజులు మాత్రమే బ్రతుకుతుందనీ,అందుకని ఆమెను ప్రేమిస్తున్నట్లుగా నటించమనీ ప్రియ అన్న సూరి కోరటంతో అంగీకరిస్తాడు.సంతోష్ తన ప్రేమను గెలిపించుకుంటాడా...?పూజ అతని ప్రేమను అంగీకరిస్తుందా...? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి.