Read more!

English | Telugu

సినిమా పేరు:గోలిమార్
బ్యానర్:శ్రీ సాయిగణేష్
Rating:2.75
విడుదలయిన తేది:May 27, 2010
గంగారాం (గోపీచంద్) ఓ అనాధ. పోలీసు ఆఫీసర్ కావాలన్నది అతని కోరిక. చిన్నతనంలో ఓ హోటల్ లో పని చేసుకుంటూ కష్టపడి చదువుతాడు. అనుకున్నట్టు గానే ఎస్.ఐ. అవుతాడు. గంగారాం లో వున్న తెగింపు ని గమనించిన డి.ఐ.జి. భరత్ నందన్ (నాజర్) అతన్ని ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా అప్పాయింట్ చేస్తాడు. పవిత్ర (ప్రియమణి) ఈవెంట్ ఆర్గనైజర్. ఆమెకి, ఆమె తల్లి అరుంధతి (రోజా)కి మగవాళ్ళంటే అసలు పడదు. అనుకోకుండా పవిత్ర గంగారాం ప్రేమలో పడుతుంది. ఇదిలా వుండగా మలేషియాలో వుంటూ ఎ.పి. లో మాఫియా గ్యాంగ్ నడుపుతున్న ఖలీద్ (కెల్లీ దూర్జీ), హైదరాబాద్ లో ఉంటూ మాఫియా గ్యాంగ్ నడుపుతున్న తల్వార్ (శావర్ అలీ) వీరిద్దరూ మాఫియా పనులను యధేచ్చగా కొనసాగిస్తుంటారు.. గంగారాం డి.జి.పి. సహకారంతో తల్వార్ తో సహా అతని గ్యాంగ్ లోని వారందరిని ఎన్ కౌంటర్ చేస్తాడు. కాని డి.జి.పి. ఖలీద్ మనిషి. అతని ఆదేశానుసారమే తన శత్రువు అయిన తల్వార్ గ్యాంగ్ ని గంగారాం చేత ఎన్ కౌంటర్ చేయిస్తాడు. చివరికి గంగారాం పై తప్పుడు కేసులు బనాయించి అతన్ని పోలిసుల తో ఎన్ కౌంటర్ చేయించాలని డి.జి.పి. ప్రయత్నిస్తాడు. ఇది తెలుసుకున్న గంగారాం డి.జి.పి. ని, ఖలీద్ ని ఎలా ఎదుర్కొన్నాడు.. తనని ప్రేమించిన పవిత్రని ఎలా సొంతం చేసుకున్నాడు అన్నది మిగతా కథ.
ఎనాలసిస్ :
పూరి జగన్నాథ్ తనదైన స్టైల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. డొంక తిరుగుడు లేకుండా చెప్పాల్సిందేదో సూటిగా చెప్పేసాడు. పోలీసు డిపార్ట్ మెంట్లో ని ఉన్నత స్థాయి వ్యక్తులు, మాఫియా లీడర్లతో చేతులు కలిపే వైనాన్ని చక్కగా చిత్రీకరించారు. నిజాయితీ గా పని చేసుకుపోయే పోలీసు ఆఫీసర్ లకి తమ డిపార్ట్ మెంట్లోనుండే ఎదురయ్యే సమస్యలను బాగా చూపించారు. అయితే పూరి తన గత చిత్రాల్లో మాదిరిగా సపరేటు కామెడి ట్రాక్ ని ఈ చిత్రంలో పెట్టలేదు.. అయినప్పటికీ గోపి పాత్రలో అలీ తో హాస్యాన్ని పండించారు. ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ, సెకండ్ హాఫ్ బుల్లెట్ల మ్రోతలతో నిండిపోయింది. విలన్ల ని సైకలాజికల్ గా హీరో ఎదుర్కొనే సన్నివేశాలు ఆకట్టు కుంటాయి. పోకిరి చిత్రంలో నిజాయితీ గల పోలిస్ ఆఫీసర్ తండ్రిగా కనిపించే నాజర్ ఈ చిత్రం లో పూర్తి విరుద్దమైన పాత్రలో నటించడం విశేషం. బాలీవుడ్ నటుడు శావర్ అలీ, ఈ చిత్రం తో తెలుగులో ప్రవేషించాడు. కామెడి, డ్రామా లు కాస్త తగ్గినా పూరి మార్కు పక్కా స్క్రీన్ ప్లే కారణంగా ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా రూపొందింది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఎన్ కౌంటర్ గంగారాం పాత్రలో గోపీచంద్ నటన ఈ చిత్రానికే హైలెట్. నటనలో పక్కా ప్రొఫెషనలిజం ప్రదర్శించాడు. ఎక్స్ ప్రెషన్స్ లోనూ, బాడీ లాంగ్వేజ్ లోనూ పాత్రకు తగ్గట్టుగా అభినయించి మెప్పించాడు.పవిత్ర పాత్ర లో ప్రియమణి ఒదిగిపోయింది. చాల మంచి పాత్ర ఆమెది. పవిత్ర పాత్ర ద్వారా తనకి లభించిన మంచి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది.అరుంధతి పాత్రలో రోజా నటన బావుంది.అలీ కనిపించింది కాసేపే అయినా నవ్విస్తాడు. నాజర్ నటన ఫర్వాలేదు. విలన్లు గా శావర్ అలీ, కెల్లీ దూర్జీ లు ఓకే. మిగతా నటీనటులంతా తమ పాత్రలకి తగ్గట్టుగా బాగానే చేసారు.చక్రి సంగీతం బావుంది. భాస్కరభట్ల సాహిత్యం ఆకట్టు కుంటుంది. సలాం పోలిస్ పాటలో పగలే సూర్యుడు ఉంటాడు, పగలూ రాత్రీ పోలీసులు తోడుగా వుంటారు లాంటి పద ప్రయోగం బావుంది. మిగతా పాటలు కూడా బావున్నాయి. పూరి వ్రాసిన మాటలు ఆకట్టుకుంటాయి. 'ఈ గ్యాంగ్ స్టర్స్ అనేవాళ్ళు ఇంట్లో ఎలుకల్లాంటి వాళ్ళు', 'అమ్మ, నాన్నవున్నా వాళ్ళందరికి మనమే దిక్కవ్వాలి', 'పది మందిని మోసం చేస్తే నువ్వు బాగు పడతావ్ కాని నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంక నాకిపోతావ్' లాంటి మాటలు ఆకట్టుకుంటాయి. విజయ్ రూపొందించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. మలేసియాలో చిత్రీకరించిన క్లైమాక్స్ ఫైట్ చాల బావుంది. యాక్షన్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ చిత్రం నచ్చుతుంది.