Read more!

English | Telugu

సినిమా పేరు:గంబ్లార్
బ్యానర్:శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్
Rating:2.50
విడుదలయిన తేది:Sep 9, 2011

కథ - క్రికెట్ బుకీస్ చేస్తున్న కోట్లాది రూపాయల బెట్టింగ్ మనీ మీద ఈ "గ్యాంబ్లర్" కథ ఆధారపడి తయారుచేయబడింది. ఇక కథ విషయానికొస్తే వినాయక్ (అజిత్) సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్. అతను రెడ్డి గారి అమ్మాయి సంజన (త్రిష)తో ప్రేమలో పడతాడు. సంజన తండ్రి ఒక గ్యాంగ్ స్టర్. ఈ క్రికెట్ బెట్టింగ్ తాలూకు 500 కోట్ల డబ్బు రెడ్డి దగ్గర పంచుకోటానికి ఆయన వద్దకు చేర్చే సమయంలో కొంతమంది ఆ డబ్బుని కొట్టేస్తారు. ఆ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను పట్టుకోటానికి నియమించబడ్డ స్పెషల్ ఆఫీసర్ పృథ్వి (అర్జున్). ఈ డబ్బుని పట్టుకోటానికి వస్తాడు. ఆ తర్వాతేమయిందనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :
విశ్లేషణ - ఈ కథలో స్క్రీన్ ప్లే బలహీనంగా కనపడుతుంది. దర్శకుడు వెంకట్ ప్రభు హీరో అజిత్ మీద ఏకాగ్రత చూపకుండా కథ మీద, మిగిలిన పాత్రల మీదే శ్రద్ధ చూపిస్తున్నట్టు దర్శకుడిగా నటిస్తూ అజిత్ పాత్ర మీద అనవసరమైన శ్రద్ధ చూపించాడు. అజిత్ 500 కోట్లు కొట్టేసిన తర్వాత తనతో పాటు ఉన్న మిగిలిన భాగస్తులను ఎలా చంపాలో ఆలోచించే సీన్ అందుకు ఉదాహరణ. ఇక ఈ సినిమా నిండా తుపాకీల కాల్పుల మోత వినపడుతూ, ఒకరిని మరొకరు మోసం చేసుకుంటూ, నీతీ నియమాలు లేకుండా డబ్బుకోసమే తాపత్రయ పడుతూంటారు. ఈ సినిమాలోని కొన్ని షాట్లు చాలా బాగున్నాయి. ఇక నటన విషయానికొస్తే ఈ సినిమా అజిత్ కి 50 వ చిత్రం కనుక అతను తన నటనలో వైవిధ్యం ఉండేలా జాగ్రత్తపడ్డాడు. అర్జున్ నటన రొటీన్. ఇక వైభవ్ తన పాత్రకు తాను న్యాయం చేశాడు. త్రిషకు నటించటానికి పెద్దగా ఏం లేదు. సంగీతం - ఈ సినిమాలో సంగీతం ఒక పాటలో విభిన్నంగా ఉండేలా ట్యూన్ చేశాడు కొత్త పెళ్ళికొడుకు యువన్ శంకర్ రాజా. మిగిలిన పాటలు కూడా ఫరవాలేదనిపించేలా ఉన్నాయి. రీ-రికార్డింగ్ ఒ.కె. మాటలు - ఇలాంటి అనేక సినిమాలకు మాటలు వ్రాసిన శశాంక్ వెన్నెలకంటి మాటలు బాగున్నాయి. పాటలు - ఫరవాలేదు. కెమెరా - గొప్పగా లేకపోయినా చెత్తగా మాత్రం లేదు. ఎడిటింగ్ - ఇంకా షార్ప్ గా కట్ చేసి ఉండాల్సింది. ఆర్ట్ - ఈ డిపార్ట్ మెంట్ ఈ సినిమాలో చాలా బాగుంది. కొరియోగ్రఫీ - ఫరవాలేదు. యాక్షన్ - ఒ.కె.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఈ సినిమా చూసి తీరాల్సినంత గొప్పదేం కాదు...కానీ మరీ మీకేం తోచకపోతే ఒకసారి చూడొచ్చు.