Read more!

English | Telugu

సినిమా పేరు:ఫిట్టింగ్ మాస్టర్
బ్యానర్:ఇ.వి.వి. సినిమా
Rating:2.50
విడుదలయిన తేది:Jan 14, 2009
సంపత్‌ (నరేష్‌) చెల్లి (సైరాభాను) ఒక అనామకుడితో లేచిపోతుంది. ఆమె శోభనం వీడియో అందరికీ పంపించబడుతుంది. తల్లీ, తండ్రి ఆత్మహత్య చేసుకుంటారు. సంపత్‌ ఇంటిని కబ్జా చేస్తారు. ఇన్ని దెబ్బలు తిన్న సంపత్‌ తనకు, తన కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళని వెంటాడి వేటాడి చంపుతాడు. ఇదీ కథ.
ఎనాలసిస్ :
దర్శకుడిగా ప్రయోగాలు చేయటం ఇ.వి.వి. సత్యనారాయణకు చాలా ఇష్టం. "ఆమె, ఆరుగురు ప్రతివ్రతలు, పెళ్ళయింది కానీ" వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. ఇది కూడా ఆ చిత్రాల్లాగే ప్రయోగాత్మక చిత్రం. కామెడీ హీరో అయిన నరేష్‌తో ఇలాంటి చిత్రం చేయటం ఒక విధంగా సాహసమే అయినా, నరేష్‌ నటన మీద ఆయనకున్న నమ్మకం ఈ సినిమా చేయించింది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
దర్శకుడిగా ప్రయోగాలు చేయటం ఇ.వి.వి. సత్యనారాయణకు చాలా ఇష్టం! ఆమె, ఆరుగురు పతివ్రతలు, పెళ్లయింది కానీ వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ! ఇది కూడా ఆ చిత్రాల్లాగే ప్రయోగాత్మాక చిత్రం! కామెడీ Hero అయిన నరేష్ తో ఇలాంటి చిత్రం చేయటం ఒక విధంగా సాహసమే అయినా, నరేష్ నటన మీద ఆయనకున్న నమ్మకం ఈ సినిమా చేయించింది! నటన :- నటుడిగా నరేష్ ఈ చిత్రంతో మరో మెట్టు ఎక్కాడని చెప్పాలి! నేను, ప్రాణం, విశాఖ ఎక్స్ ప్రెస్ చిత్రాల్లో విభిన్నమైన నటన ప్రదర్శించి నరేష్ తానెలాంటి నటుడో నిరూపించాడు! ఈ చిత్రంలో కూడా ఒక విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు నరేష్! ఎప్పుడైనా సినిమా ప్లాపయిందే కానీ నటుడిగా నరేష్ మాత్రం ఫెయిలవ్వలేదు! కొత్త హీరోయిన్ మదాలసా శర్మ తనలో అందం, గ్లామర్ లతో పాటు అభినయ ప్రతిభ కూడా ఉందని నిరూపించుకుంది! ఇక కృష్ణ భగవాన్, సురేఖా వాణిలు T.V.9 తీరుపై వేసే సెటైర్లు బాగా పేలాయి! ప్రేమపేరుతోఅమ్మాయిల్ని వంచించే నయవంచకులు చట్టంలోని లొసుగులతోఎలా తప్పించుకుంటున్నారో, ఆర్య సమాజం పెళ్ళిళ్ళు వంటి వాటిని ఈ చిత్రంలో బాగా చర్చించారు! ఇంటర్వెల్ ముందు హత్య చేసేటప్పుడు నరేష్ చేసే విలయతాండవం ఆకట్టుకుంటుంది! పోలీస్ నీ, మీడియానీ నిలదీసే సీన్లలో కూడా అతని నటన బాగుంది! షాయాజీ షిండే ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు! గూండాగా ఆలీ, అతని సహచరులుగా చలపతిరావు, జయప్రకాష్ రెడ్డి తమాషాగా ఉన్నారు! సంగీతం :- గొప్పగా లేకపోయినా, ఈ చిత్రంలోని పాటలు ఫరవాలేదనిపిస్తాయి! రీ –రికార్డింగ్ బాగుంది! ఎడిటింగ్ :- గౌతంరాజు! ఆయనింట్లో ఉన్న నంది అవార్డులు ఆయనెలాంటి ఎడిటరో చెప్తాయి! ఎడిటింగ్ బాగుంది! పాటలు :- ఈ మధ్య “హ్యాపీడేస్” నుంచి వెలుగులోకి వచ్చిన పాటల రచయిత వనమాలి ఈ చిత్రంలోని పాటలన్నీవ్రాశారు! బాగున్నాయి! యాక్షన్ :- విజయ్ మాస్టర్, రామ్ –లక్ష్మణ్ మాస్టర్లు ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లు కంపోజ్ చేశారు! ఫైట్స్ బాగున్నాయి!