Read more!

English | Telugu

సినిమా పేరు:ఏం పిల్లో ఏం పిల్లడో
బ్యానర్:ఈ తరం పిక్చర్స్
Rating:2.00
విడుదలయిన తేది:Jul 16, 2010
దేవరకొండ,పోతుగడ్డ గ్రామాలకు మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది.ఒక ఊరికి ఆహుతి ప్రసాద్,మరో ఊరికి చరణ్ రాజ్‍ పెద్దలు.నిజానికి వాళ్ళిద్దరూ బావ,బావమరుదులే.ఇది సినిమా చివరలో తెలుస్తుంది.వీళ్ళిద్దరికీ మధ్య గొడవ ఎందుకొచ్చిందీ అనే దానికి ఒక బలమైన కారణం ఉంటుంది.చరణ్‍ రాజ్ చెల్లెలు పెళ్ళిలో ఆమె ఒక లెటర్ వ్రాసి పెట్టి వెళ్ళిపోతుంది.తాను ఆహుతి ప్రసాద్ ని ప్రేమిస్తున్నాని దాని సారాంశం.ఆహుతు ప్రసాద్ ఆమెను తిట్టి పెళ్ళి మంటపానికి తెచ్చే లోపల,చరణ్ రాజ్ మామ ఆహుతి ప్రసాద్ మీద అతనికి లేనిపోని మాటలు చెప్పి,వాళ్ళిద్దరి మధ్య గొడవకు కారణమవుతాడు.అప్పుడు జరిగిన గొడవలో ఆహుతి ప్రసాద్ తండ్రి చనిపోగా,చరణ్ అరాజ్‍ మామ చనిపోతాడు.అలా వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది.ఆహుతి ప్రసాద్ కొడుకు తనీష్ అయితే చరణ్ రాజ్ కూతురు ప్రణీత.వీళ్ళిద్దరూ పట్నంలో ఒకే కాలేజీలో చదుతూంటారు.ఆ ఇద్దరికీ అరక్షణం పడదు.అలాంటిది ఒక సందర్భంలో ఇద్దరూ ప్రేమలో పడతారు.వాళ్ళ ఊర్ల మధ్య ఉన్న గొడవ గురించి తెలిసిన తనీష్,ప్రణీత తమ పెద్దల అనుమతితో తమ ప్రేమను ఎలా సఫలం చేసుకున్నారన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
కథ కొత్తదేం కాదు.ఇలాంటి కథలు గతంలో కోకొల్లలుగా వచ్చాయి.ఇక దర్శకత్వం గురించి చెప్పాలంటే రవికుమార్ పక్కా మాస్ సినిమాల డైరెక్టర్.కానీ ఈ సినిమాలో లవ్ ట్రాక్ ని బాగానే డీల్ చేశాడు.అందువల్ల సినిమా తొలి సగమంతా కామెడీగా గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ లో సినిమా ఒక క్లైమాక్స్ తరువాత పాట తర్వాత మరో క్లైమాక్స్ ఉండటం సినిమా టెంపోని కాస్త తగ్గించింది.సినిమాలో ఏం జరుగుతుందో దాదాపు ప్రేక్షకుడు ఊహించగలిగే స్థాయిలోనే ఉండటానికి కారణం కథ పాతది కావటమే. నటన - ఈ సినిమాలో యువ హీరోగా తనీష్ బాగానే చేశాడు.హీరోయిన్ ప్రణీత కూడా బాగనే చేసింది.అమ్మాయి కూడా అందంగానే ఉంది.కానీ ప్రొఫైల్లో చూస్తే అంత అందంగా కనిపించదు.ఆహుతి ప్రసాద్,చరణ్ రాజ్ లకు ఇలాంటి పాత్రలు కొట్టినపిండి వంటివి.చంద్రమోహన్ సినిమా ఫస్ట్ హాఫ్ లో కామెడీ నడిపిస్తే,డాక్టర్ శివప్రసాద్,దువ్వాసి మోహన్ సెకండ్ హాఫ్ లో కామెడీ పండించారు.విజయచందర్ ఈ రెండు గ్రామాలను కలపాలనే ఫకీరుగా బాగానే నటించారు.మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం - పాటల్లో పాత బాణీల పోలికలు కనిపిస్తాయి.అయినా పాటలు బాగానే ఉన్నాయి.ముఖ్యంగా టైటిల్ సాంగ్ బాగుంది.రీ-రికార్డింగ్ ఫరవాలేదు. కెమెరా - రమణరాజు కెమెరా పనితనం బాగుంది.పాటల్లో కూడా బాగుంది. ఎడిటింగ్-గౌతంరాజు వంటి సినియర్ టెక్నిషియన్ ఈ సినిమాకు ఎడిటింగ్ చేశారు.అది చాలుగా...ఎడిటింగ్ ఎలాగుంటుందో చెప్పటానికి. ఆర్ట్-బాగుంది. కొరియోగ్రఫీ-అన్ని పాటల్లోనూ బాగుంది.ముఖ్యంగా సినిమాలో తొలి సాంగ్ కీ,టైటిల్ సాంగ్ కీ కోరియోగ్రఫీ బాగుంది. యాక్షన్-బాగుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఇది గొప్ప చిత్రమని చెప్పలేం కానీ,మీకేం తోచకపోతే టైమ్ పాస్ కోసం ఈ చిత్రం ఓ సారి చూస్తే చూడొచ్చు