Read more!

English | Telugu

సినిమా పేరు:ఏక్ నిరంజన్
బ్యానర్:ఆదిత్యారామ్ మూవీస్
Rating:2.25
విడుదలయిన తేది:Oct 29, 2009
చోటు (ప్రభాస్‌)ని చిన్నతనంలోనే అపహరించి అడుక్కుతినేందుకు ఉపయోగిస్తాడు చిదంబరం అనే వ్యక్తి. ఆ వ్యక్తిని పోలీసులకి పట్టివ్వడంతో ఓ పోలీసు ఓ రూపాయి కాయిన్‌ చోటుకి ఇస్తాడు. క్రిమినల్స్‌ని పోలీసులకి పట్టిస్తే డబ్బులిస్తారన్న ఆలోచనతో చోటు క్రిమినల్స్‌ని పోలీసులకు పట్టిస్తూంటాడు. జానీబాయ్‌ (సోనూసూద్‌) ఓ మాఫియా లీడర్‌. అతని మనుషులని కూడా చోటు పోలీసులకి పట్టిస్తుండడంతో చోటుని టార్గెట్‌ చేస్తాడు జానీబాయ్‌. రాజకీయనాయకుడైన గరికపాటి నరేందర్‌ (పోసాని కృష్ణమురళి) మంత్రి కావడం కోసం తన అన్నయ్యని జానీబాయ్‌ మనుషుల చేత చంపిస్తాడు.. అయితే ఆ హత్య చేసిన గణేష్‌ (ముకుల్‌దేవ్‌)ని జానీబాయ్‌ హత్య చేయాలని చూస్తాడు. జానీబాయ్‌ దగ్గర పనిచేసే మనోజ్‌ అనే రౌడీ చెల్లెలు సమీర (కంగనారనౌత్‌) చోటుకి పరిచయం కావడం, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడం జరిగిపోతాయి.. వారిద్దరూ ప్రేమించుకోవడం ఇష్టంలేని మనోజ్‌ సమీరని బ్యాంకాక్‌ తీసుకెళ్తాడు. ఓ వైపు తన తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలనే తపన, సమీరని దక్కించుకోవాలన్న ఆరాటం, మరోవైపు జానీబాయ్‌ హత్యచేయాలనుకుంటున్న గణేష్‌ని పట్టుకుని పోలీసులకి అప్పగించే బాధ్యత.. ఈ మూడింటిలో చోటు ఎంతవరకు సక్సెస్‌ సాధించాడన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే
ఎనాలసిస్ :
పూరీ జగన్నాథ్‌ చిత్రం అనగానే మాస్‌ ఆడియోన్స్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోతాయి. హీరోయిజం చూపించడంలో పూరీ జగన్నాథ్‌ స్టైల్‌ మాస్‌ ఆడియెన్స్‌కి విపరీతంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. అందుకే ఆయన చిత్రాల్లో హీరో సాదా సీదాగా మన మధ్య తిరిగే ఓ యువకుడిలా కనిపిస్తాడు. అలా కనిపించేలా చేసి సినిమాలో హీరో మన మధ్యలోని వాడనే ఫీల్‌ని కలుగజేస్తాడు. ఈ చిత్రంలో మాస్‌ ఆడియెన్స్‌ని రంజింపజేసే సన్నివేశాలు ఉన్నప్పటికీ కథ డీల్‌ చేసే విషయంలో మరికొంత శ్రద్ధతీసుకుంటే బావుండేది. బ్రహ్మానందం, వేణుమాధవ్‌ల కామెడీ పెద్దగా పండలేదు. ఆలీ పాత్రని కూడా అర్థాంతరంగానే ముగించేశారనిపిస్తుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: ప్రభాస్‌ నటన మాస్‌ని ఆకట్టుకునేవిధంగా సాగిపోతుంది.. ముఖ్యంగా ఫైట్స్‌లో ప్రభాస్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఆయన అభిమానులని అలరిస్తుంది. ఫుల్‌ ఎనర్జిటిక్‌గా, స్టైల్‌గా నటించాడు ప్రభాస్‌. హీరోయిన్‌ కంగనారనౌత్‌ జస్ట్‌ ఓకే. సోనూసూద్‌ నటన ఆకట్టుకునేవిధంగా సాగిపోతూంది. ముకుల్‌దేవ్‌ ఈ చిత్రంలో ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. మిగతా వారంతా తమ తమ పాత్రలకి న్యాయం చేకూర్చేవిధంగా నటించారు. పాటలు-: రామజోగయ్యశాస్త్రి, విశ్వ, భాస్కరభట్ల ఈ ముగ్గురూ ఈ చిత్రానికి పాటలు వ్రాసారు. సాహిత్య పరంగా పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా టైటిల్‌ సాంగ్‌ "ఏక్‌నిరంజన్‌' సాంగ్‌ మాస్‌, క్లాస్‌ అనేతేడాలేకుండా అందరికీ నచ్చుతుంది. మిగిలిన పాటలు ఫర్వాలేదు. సంగీతం-: మణిశర్మ సంగీతం గురించి చెప్పేదేముంది.. ఈ చిత్రానికి సంగీతం ప్లస్‌ పాయింట్‌ సాంగ్స్‌ అన్నీ బాగున్నాయి. ఫైట్స్‌-: స్టన్‌ శివ రూపొందించిన ఫైట్స్‌ బావున్నాయి. ఫోటోగ్రఫీ-: చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ బావుంది. కొరియోగ్రఫీ-: రాజుసుందరం కంపోజ్‌ చేసిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్‌కి అనుగునంగా సింపుల్‌ స్టెప్స్‌తో ఆకట్టుకునే రీతిలో కొరియోగ్రఫీ డిజైన్‌ చేయడం బావుంది. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో కాకుండా ప్రభాస్‌ యాక్షన్‌ కోసం ఈ చిత్రం చూడొచ్చు.