Read more!

English | Telugu

సినిమా పేరు:ఈగల్
బ్యానర్:పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
Rating:2.50
విడుదలయిన తేది:Feb 9, 2024

ఈగిల్  మూవీ రివ్యూ
సినిమా పేరు: ఈగిల్ 
తారాగణం: రవితేజ,కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, వినయ్ కుమార్, మధుబాల ,నవదీప్, అవసరాల శ్రీనివాస్ అజయ్ ఘోష్  తదితరులు 
సంగీతం:డావ్ జాన్డ్
కెమెరా:  చావ్లా 
రచన,దర్శకత్వం:కార్తీక్ ఘట్టమనేని 
నిర్మాత: టి.జె విశ్వక్ ప్రసాద్ 
బ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 
విడుదల తేదీ: ఫిబ్రవరి 9  2024 

మాస్ మహారాజ రవితేజ నుంచి  2022 లో వచ్చిన  ధమాకా మూవీ తర్వాత సరైన విజయం లభించలేదు.  రావణాసుర,రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు ఇలా వరుసగా వచ్చిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ రోజు వచ్చిన ఈగిల్ మీద రవి తేజ ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. మరి  ఈగిల్ అందరి అంచనాలు అందుకుందో లేదో చూద్దాం.

కథ
సహదేవ్ (రవితేజ) రాయలసీమలోని తలకోన అడవిలో ఒక పెద్ద ఇల్లు కట్టుకొని ఉంటుంటాడు. సహదేవ్ తో పాటు అతని స్నేహితుడు నవదీప్ కూడా ఆ ఇంట్లోనే ఉంటాడు.అక్కడి గిరిజన తెగకి చెందిన రైతులు పండించే పత్తి నుంచి వచ్చిన నూలుకి అంతర్జాతీయంగా  పేరు తీసుకురావడానికి సహదేవ్ ప్రయతిస్తుంటాడు.ప్రముఖ దిన పత్రికకి చెందిన  జర్నలిస్ట్  నళిని (అనుపమ పరమేశ్వరన్ )  ఈగిల్ కి సంబంధించిన వార్త రాసినందుకు తన ఉద్యోగాన్ని కోల్పోతుంది.  ఈ క్రమంలో ఈగిల్ కోసం తెలుసుకోవడానికి ఆమె  తలకోన వస్తుంది.ఇంకో పక్క ఈగిల్ ని అంతం చెయ్యమని భారత ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది?అసలు సహదేవ్ ఎవరు? ఈగిల్ ఎవరు? ఈగిల్ ని  చంపడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు నిర్ణయం తీసుకుంది? ఈగిల్ గతం ఏంటి ?  ఇలా అన్ని విషయాలు  తెలుసుకోవాలంటే మూవీ  చూడాల్సిందే.


ఎనాలసిస్ :

ముందుగా  ఈ చిత్ర దర్శకుడుకి హాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇలాంటి కథ తో సినిమా చెయ్యాలనే అతని ఆలోచన చాలా గొప్పది.అలాగే చిన్న సీన్ పెద్ద సీన్ అనే తేడాలేకుండా ప్రతి సీన్ ని చాలా టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కించాడు. రవి తేజ స్క్రీన్ మీద కనపడుతున్నంత సేపు ప్రేక్షకుడు రవితేజ నటనని చూస్తూనే ఉండటంలో దర్శకుడు విజయాన్ని సాధించాడు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్ లో ఉండి హాలీవుడ్ సినిమా  చూస్తున్న అనుభూతిని కలిగించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది. మొదటి సగభాగం సోసో గా సాగినా కూడా సెకండ్ ఆఫ్ మాత్రం చాలా బాగుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే  సినిమా స్టార్ట్ అయిన  మొదటి ముప్పై నిముషాలు ఈ సినిమాకి మైనస్ గా పరిగణించే అవకాశాలు ఉన్నాయి..సినిమా లో హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేయటానికి వాయిస్ఓవర్ తోనో, ఓ క్యరెక్టర్ తో చెప్పించటమో లేక ఒక్క సీన్ తోనో చేస్తారు.. బట్ డైరెక్టర్ సినిమా మొదటిభాగం లో ప్రతి సీన్ లో కూడా హీరో మామూలోడు కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు.. కానీ  హీరో యాక్షన్ లో కి దిగేది మాత్రం ఇంట్రవెల్ కి ముందు...

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు

ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే  రవితేజ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. రెండు విభిన్నమైన  క్యారెక్టర్ లలో విభీన్నమైన బాడీ లాంగ్వేజ్ ని ప్రదర్శించి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని  అందించాడు. లవ్ సీన్స్ లో వింటేజ్ రవి తేజ ని చూసినట్టుగా ఉంది.అలాగే  సినిమా మొత్తాన్ని తన భుజ స్కంధాలపై వేసుకొని ముందుకు నడిపించాడు. అనుపమ  పరమేశ్వరన్ నటన కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. జర్నలిస్ట్ గా సూపర్ గా నటించి సినిమాకి నిండుతనాన్ని తెచ్చింది. రవితేజ లవర్ గా, వైఫ్ గా నటించిన కావ్యథాఫర్ ఉన్న కాసేపైనా కూడా చాలా చక్కగా నటించింది. ఇక మిగతా క్యారెక్టర్ల విషయానికి వస్తే మధుబాల,హనుమాన్ ఫేమ్ వినయ్ రాయ్,మినిస్టర్ గా చేసిన అజయ్ ఘోష్,అతని పి.ఏ గా చేసిన  శ్రీనివాస్ రెడ్డి ల నటన చాలా బాగుంది.ముఖ్యంగా ఆ ఇద్దరి కామెడీ చాలా బాగుంది. అలాగే  రవితేజ ఫ్రెండ్ క్యారక్టర్ లో సూపర్ గా నటించి సరికొత్త  నవదీప్ ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. మున్ముందు నవదీప్ కి మరిన్ని మంచి క్యారెక్టర్లు రావచ్చు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం చాలా బాగుంది.కెమెరా అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాని హై రేంజ్ కి తీసుకెళ్లింది.కాకపోతే  స్క్రీన్ ప్లే మాయ కొంచం  ఎక్కువయ్యింది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

యాక్షన్ ని ఇష్టపడే ప్రేక్షకులకి ఈగిల్ నచ్చవచ్చు. అంతే గాని రవితేజ పేటెంట్ హక్కు అయిన కామెడీ ని ఉహించి వెళ్తే మాత్రం గన్ లో కాలేసినట్టే.

- అరుణాచలం