Read more!

English | Telugu

సినిమా పేరు:ద్రోణ
బ్యానర్:సాయికృష్ణా ప్రొడక్షన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Feb 20, 2009
ద్రోణ (నితిన్‌)ని చిన్నతనంలో సర్కార్‌ (కిల్లిదొర్జీ) ముఠా కిడ్నాప్‌ చేస్తుంది. ఎస్‌.పి. మనోహర్‌ (ముఖేష్‌రుషి). మీనాక్షి (సీత) కొడుకు ద్రోణ. తండ్రి కొట్టాడనే కోపంతో ఇంట్లోంచి పారిపోయాడని వారు భావిస్తుంటారు. సర్కార్‌ ద్రోణలాంటి మరికొంత మంది పిల్లలని ఐలండ్‌ దీవులకి తీసుకుపోయి వారికి కఠినమైన శిక్షలు ఇస్తాడు. ఇదంతా ఎందుకంటే మైసూర్‌లో ప్రదర్శనలకు పెట్టిన నిజాం నగలని వారిచే దొంగిలించి, వాటిని తీసుకుని తాను దుబాయ్‌ పోవాలని. అయితే అనుకున్నట్లుగానే నిజాం నగలని ద్రోణ తన ఫ్రెండ్‌ బోసు (నందకిశోర్‌), మరో వ్యక్తితో కలిసి నిజాం నగలని దొంగతనం చేసి తీసుకువస్తాడు. అయితే ఆ నగలని తీసుకుని తామందరినీ చంపేయాలని సర్కార్‌ కుట్రపన్నాడని తెలుసుకున్న ద్రోణ ఆ నగలతో ఉడాయిస్తాడు. మారు పేరుతో తన ఇంట్లోనే ఉంటూ తనకోసం తన తల్లీదండ్రులు పడుతున్న వేదనని చూస్తూ బాధపడుతుంటాడు. ద్రోణనే పెళ్ళి చేసుకుంటానని ఆ ఇంటికి వస్తున్న ఇందు (ప్రియమణి)తో ప్రేమలో పడతాడు. సర్కార్‌ గ్యాంగ్‌ ద్రోణకోసం వెతుక్కుంటూ వస్తుంది. నిజాం నగలు కాజేసింది ద్రోణ అని పోలీసులకి చెప్పి అతన్ని అరెసు్ట చేయిస్తారు. తన కొడుకు దొంగగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతాడు మనోహర్‌. అయితే అతనెందుకు దొంగయ్యాడో తల్లీదండ్రులకి చెప్పడంతో కొడుకుని రక్షించడానికి ఎస్‌.పి. మనోహర్‌ పథకం వేస్తాడు. చివరికి ద్రోణ సర్కార్‌ బారి నుండి నిజాం నగలని ఎలా రక్షించాడన్నది క్లైమాక్స్‌.
ఎనాలసిస్ :
సినిమా ఫస్టాఫ్‌ ప్రేక్షకులని అసహనానికి గురిచేస్తుంది. వీక్‌ స్ర్కీన్‌ప్లేతో పదేళ్ళక్రిందినాటి చిత్రం చూస్తున్నామా అనే ఫీల్‌ని ప్రేక్షకుల్లో కలిగించేస్తుంది. రాజమౌళి శిష్యుడైన డైరెక్టర్‌ కరుణ కుమార్‌ ఆయన దగ్గర్నుంచి యాక్షన్‌ ఎపిసోడ్‌ ఎలా డీల్‌ చేయాలన్నది మాత్రమే తెలుసుకున్నట్టున్నాడు. ఎందుకంటే సెంటిమెంట్‌ సీన్లన్నీ తేలిపోయాయి. ఎంచుకున్న లైన్‌ బాగానే ఉన్నా దాన్ని డీల్‌ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఐలండ్‌లో తీసిన యాక్షన్‌ సన్నివేశాలు అబ్బుర పరిచినా మిగతా సీన్‌లు ప్రేక్షకులకి రుచించవనే చెప్పాలి. ఇక మొదటి సాంగ్‌లో ప్రియమణి బికినీ దుస్తుల్లో కనిపించి మాస్‌ ఆడియన్స్‌ని వేడెక్కించింది. అయితే ఆమె అందాల ఆరబోత కూడా ఈ సినిమాని గట్టెక్కించలేదేమో. ఇక హీరో నితిన్‌ ఖాతాలో ద్రోణ మరో ఫ్లాప్‌ సినిమాగా మిగిలిపోతుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నితిన్‌ డాన్స్‌, ఫైట్స్‌లలో అదరగొట్టాడు. మాస్‌ ఆడియన్స్‌ని మెప్పించడానికి అతను పడుతున్న శ్రమ మెచ్చుకోదగిందే... కానీ కథల ఎంపిక విషయంలో కూడా ఆ శ్రద్ద కనబరిస్తే తప్ప అతని ఖాతాలో హిట్‌ చిత్రం కనిపించదు. నటన విషయంలో, డైలాగ్‌ డెలివరీ విషయంలో అక్కడక్కడా తప్పటడుగులు వేస్తున్నాడు. ముఖేష్‌రుషి పాజిటివ్‌ పాత్రలో బాగానే నటించాడు. నితిన్‌ ఫ్రెండ్‌గా నందకిశోర్‌ నటన ఫర్వాలేదు. ఇక విలన్‌గా కిల్లీదొర్జీ, శివప్రసాద్‌రెడ్డిలు యావరేజ్‌గా నటించారు. సునీల్‌ ఉన్నా పెద్దగా కామెడీ పండలేదు. వేణుమాధవ్‌పై చిత్రీకరించిన కామెడీ కూడా సోసోగానే ఉంది. అతను "అరుంధతి'లోని అఘోరా పాత్రని పేరడీ చేసినా అది తేలిపోయింది. సంగీతం:- అనూప్‌ రూబెన్స్‌ సంగీతం యావరేజ్‌గా ఉంది. డాన్స్‌:- అమ్మరాజశేఖర్‌ కంపోజ్‌ చేసిన కొరియోగ్రఫీ బావుంది. మాటలు:- హర్షవర్థన్‌ వ్రాసిన డైలాగ్స్‌ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేవు. పైగా అక్కడక్కడ బోర్‌ కొట్టించాయి. ఓవరాల్‌గా ఈ చిత్రం నితిన్‌ కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడదని చెప్పొచ్చు.