Read more!

English | Telugu

సినిమా పేరు:దడ
బ్యానర్:శ్రీ కామాక్షి ఎంతెర్ప్రిసేస్
Rating:2.00
విడుదలయిన తేది:Aug 11, 2011

అనాథలైన ఇద్దరన్నదమ్ములు...పెద్దవాడు రాజీవ్( శ్రీరామ్) తెలివైన వాడు.....చిన్నవాడు విశ్వ (నాగచైతన్య) బాగా రెబెల్. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళై అమెరికాలో సెటిలవుతారు. అన్నయ్యకి పెళ్ళవుతుంది. విశ్వ కోటీశ్వరుడి కూతురు రియా( కాజల్ అగర్వాల్)ని ప్రేమిస్తాడు. ఒక రోజు మాఫియా డాన్ ఆర్.డి. అమ్మే వందమంది అమ్మాయిలను తనకు తెలియకుండానే విడిపిస్తాడు విశ్వ...అందువల్ల ఆర్.డీ.కి వంద కోట్ల నష్టం వస్తుంది. దాంతో విశ్వని చంపటం కోసం ఆర్.డి. ముఠా గాలిస్తుంది. విశ్వ అన్న కూడా ఆర్.డి. దగ్గరే పనిచేస్తుంటాడు...విశ్వ మాఫియా నుంచి తప్పించుకుంటాడా...? రియాని పెళ్ళి చేసుకుంటాడా....? చివరికి ఏమవుతుంది అనేది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

ఈ సినిమాలో పెద్దగా కథంటూ ఏం లేదు. కానీ కనీసం స్క్రీన్ ప్లే అన్నా బాగుండి ఉంటే సినిమా ఓ మోస్తరుగా ఉండేదేమో. కానీ ఈ సినిమాలో డ్రాపవుట్స్ చాలా ఉన్నాయి. ఒక విధంగా చూస్తే దర్శకుడు ఏ సీన్ కి ఆ సీన్ బాగా తీశాడు. కానీ అన్ని సీన్లకూ సమన్వయం కుదరక పోవటం ఈ సినిమాకి మైనస్ పాయింట్. పాట వస్తోందని ప్రేక్షకుడికి ముమదే తెలిసిపోవటం వంటివి దర్శకుడి అవగాహనా రాహిత్యానికి ఉదాహరణగా నిలుస్తుంది .బ్రహ్మానందం, ఆలీ, వేణు మాధవ్, యమ్.యస్. నారాయణల కామెడీ అంతగా పండలేదని చెప్పాలి. ఇక నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఆ రిచ్ నెస్ ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.  

నటన - ఈ సినిమాలో నాగచైతన్య నటనలో ఇంకొంచెం మెచ్యూరిటీ వచ్చింది. తొలి మూడు సినిమాల కన్నా ఈ సినిమాలోని డ్యాన్సుల్లో కాస్త వళ్ళు కదిపాడు...ఫైట్స్ కూడా బాగానే చేశాడు. ఈ సినిమా వరకూ అతని కృషి లోపం లేదు. ఇక కాజల్ తన స్థాయిలో తను బాగానే నటించింది. విలన్లుగా రాహుల్ దేవ్, కెల్లీ డార్జిల నటనలో కొత్తదనం ఆశించటం దురాశే అవుతుంది.

సంగీతం - పాటలు బాగానే ఉన్నాయి...కానీ తెలుగు పాటల్లో తెలుగుదనం లోపించేలోఆ చేయటం అదీ తెలుగు సంగీత దర్శకులు ఆ పని చేయటం నేటి ఫ్యాషన్ అవటం తెలుగు ప్రేక్షకుల దౌర్భాగ్యం. రీ-రికార్డింగ్ బాగుంది.

మాటలు - ఈ సినిమాలోని మాటలు బాగున్నాయి. క్లుప్తంగా సూటిగా, సోది లేకుండా ఈ చిత్రం లోని మాటలుండటం విశేషం. అందుకు మాటల రచయిత అబ్బూరి రవిని అభినందించాలి.   

పాటలు - రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ వ్రాసిన పాటలు ఫరవాలేదనిపించాయి.

ఎడిటింగ్ - ఇంకా షార్ప్ గా కట్ చెయ్యాల్సింది ఉందనిపించింది. అయినా ఒ.కె.

ఆర్ట్ - బాగుంది.

కొరియోగ్రఫీ - బాగుంది. చివరి పాటలో ఇంకా బాగుంది.

యాక్షన్ - స్టైలిష్ గా ఉంది. బాగుంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఈ సినిమా ఏదో చించేస్తుందని వెళితే దెబ్బయిపోతారు......అలా కాకుండా నాగచైతన్య కోసం చూడాలనుకుంటే ఒకసారి చూడవచ్చు...