Read more!

English | Telugu

సినిమా పేరు:దమ్మున్నోడు
బ్యానర్:యు.కె.అవెన్యూస్
Rating:2.00
విడుదలయిన తేది:Mar 19, 2010
సుభాష్ చంద్రబోస్ (రిషి) కోనసీమలోని ఓ గ్రామవాసి, నీతి నిజాయితీలకు పెట్టింది పేరు. ఆయనలోని టాలెంట్ ని గమనించిన ఎస్.పి. అరుణ్ కుమార్ (నాజర్) ప్రోద్భలంతో కానిస్టేబుల్ గా సెలెక్టయిన బోస్ వైజాగ్ లో డ్యూటీలో జాయిన్ అవుతాడు. అక్కడ చింతకాయల దుర్గ (రాహుల్ దేవ్) రౌడీయిజం చేస్తుంటాడు. అతనికి సి.ఐ. బాబ్జి (సత్యప్రకాష్) సహకరిస్తుంటాడు. బోస్ కానిస్టేబుల్ గా జాయిన్ అయినప్పటినుండి దుర్గ ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది. ఎలాగైనా బోస్ ని అంతమొందించాలన్న లక్ష్యంతో దుర్గ ఉంటాడు. చివరికి ఏం జరిగిందన్నది మిగతా కథ.
ఎనాలసిస్ :
ఒక సామాన్య వ్యక్తి ఓ బలమైన గుండాని ఎదుర్కోవడం అన్న కాన్సెప్ట్ తో ఎన్నో చిత్రాలు వచ్చాయి. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోయినా కథని డీల్ చేసే విధానంలో దర్శకుడు కొంతమేరకు సక్సెస్ సాధించాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన :- రిషి చాలా ఎనర్జిటిక్ గా నటించాడు. కానిస్టేబుల్ పాత్రలో చక్కగా సరిపోయాడు. బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ, ఎక్స్ ప్రెషన్ లోనూ చక్కని పర్ ఫెక్షన్ కనబరిచాడు.సౌమ్య :- హీరోయిన్ సౌమ్య నటన యావరేజ్ గా ఉంది. ఎక్స్ ప్రెషన్ విషయంలో ఆమె ఇంకా జాగ్రత్త పడాల్సి ఉంది.రాహుల్ దేవ్ : రాహుల్ దేవ్ కి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాకపోయినప్పటికీ తన పాత్రకి తగ్గట్టుగా చక్కగా చేసాడు.నాజర్ :- ఎస్.పి. అరుణ్ కుమార్ గా నాజర్ నటన బావుంది.వేణుమాధవ్ :- బాబి పాత్రలో వేణుమాధవ్ కనిపించినంత సేపు నవ్వులు కురిపించాడు. మిగతా నటీనటులు తమ పాత్రలకి తగ్గట్టుగా చేశారు :-సంగీతం :- వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతం యావరేజ్ గా ఉంది.మాటలు :- ఓ సంధర్భంలో హెడ్ కానిస్టేబుల్ రాళ్ళపల్లి హీరో రిషిని బ్రతకడానికి నీకు కానిస్టేబుల్ ఉద్యోగమే దొరికిందా...? అనడిగితే 'ఇది మనిషి బ్రతకడానికి కాదు సార్, మంచి బ్రతకడానికి' లాంటి కొన్ని డైలాగ్ లు ఆకట్టుకుంటాయి.దర్శకత్వం :- బి.వి.వి. చౌదరి దర్శకత్వం ఫర్వాలేదు.