Read more!

English | Telugu

సినిమా పేరు:కరెంట్
బ్యానర్:శ్రీ నాగ్ కార్పొరేషన్
Rating:2.00
విడుదలయిన తేది:Jun 19, 2009
ఒకమ్మాయి స్నేహ (స్నేహ ఉల్లాల్‍)ని చూసిన ఒకబ్బాయి సుశాంత్ (సుశాంత్) వెంటనే ప్రేమలో పడటం, అలాగే ఆ అమ్మాయిచేత ప్రేమింపబడటం, ఆ తర్వాత ఆ అమ్మాయి తండ్రి (చరణ్‍ రాజ్‍)తో విభేదించి ఆమెకు దూరమవటం, ఆ అమ్మాయి కోరిక మేరకు ఆమె మనసులో నుంచి తన మీద ఉన్న ప్రేమను తొలగించటం, ఆ అమ్మాయి వేరే సంబంధం చేసుకోటానికి సిద్ధపడటం, అయినా చివరికి వీరిద్దరూ కలవటం క్లుప్తంగా ఈ చిత్ర కథ. సర్వే డిపార్ట్మెంటులో పనిచేసే తనికెళ్ళభరణి కొడుకు సుశాంత్. అతని భార్య సుధ. ఇతనికి తరచూ ట్రాన్స్ ఫర్ అవుతూంటుంది.అలా ఒక ఊరినుంచి మరో ఊరికి మారూతూండగా రైల్వే స్టేషన్‌లో ఈ సినిమా మొదలవుతుంది. సుశాంత్ చేద్దాంలే.. చూద్దాంలే అనే టైపు మనిషి. పొద్దున్నే తొమ్మిదిన్నరకు అతని పేరెంట్స్ బలవంతంగా లేపితే కానీ కాలేజీకి కూడా పోని వ్యక్తి సుశాంత్. ఇంకా చెప్పాలంటే "నిన్నటి గురించి వర్రీ లేదు...రేపటి గురించి హర్రీ లేద"నే నేటితరం యువతకు ప్రతీక.అతను ఆ ఊరికి రాగానే ఒకమ్మాయిని పార్కులో చూస్తాడు. ఆమె ఆ ఊరిలో జడ్జిగారమ్మాయి స్నేహ. ఆమెను సుశాంత్ ప్రేమించినా ఆమె ఇతన్ని ప్రేమించదు. లక్కీగా సుశాంత్ చదివే కాలేజీలోనే ఆమె కూడా చదువుతూంటుంది. ఆ కాలేజీలో చేరిన దగ్గర నుంచీ ఆమెకు సైటుకొడుతుంటాడు సుశాంత్. స్నేహకు కలలు బాగా వస్తూంటాయి. దాన్ని అలుసుగా తీసుకుని ప్రతిరోజూ ఆమె ఇంటికి రాత్రిపూట వెళ్ళి అది కలో నిజమో ఆమెకు తెలియకుండా అయోమయంలో పడేస్తాడు సుశాంత్. పైకి ఆమెను పట్టించుకోకుండా ఉన్నట్టు నటిస్తూ, రాత్రి పూట ఆమెకు కల్లోకి వచ్చినట్టుగా కనిపిస్తూ ఆమెను ప్రేమిస్తూంటాడు. చివరికి ఈ విషయం తెలుసుకున్న స్నేహ చివరికి అతనితో ప్రేమలో పడుతుంది.ఈ విషయం తన తండ్రికి చెపితే, అతను సుశాంత్‌ని రేపు తొమ్మిదింటికి ఇంటికి తీసుకురమ్మని స్నేహతో చెపుతాడు. కానీ పదయినా సుశాంత్ స్నేహ ఇంటికి రాడు. తీరా సుశాంత్ పొడిచేస్తున్న రాచకార్యం ఏమిటయ్యా అంటే కాలేజీ గ్రౌండ్‌లో క్రికెట్‍ ఆడటం.అక్కడికే వచ్చి స్నేహ అతన్ని తన ఇంటికి తీసుకెళ్ళి తన తండ్రికి ఇతన్ని పరిచయం చేస్తుంది. అక్కడ సుశాంత్‌తో మాట్లాడిన స్నేహ తండ్రికి సుశాంత్ ఒక బాధ్యలేని వ్యక్తిగా, దేన్నీ సీరియస్‌గా తీసుకోని వ్యక్తిగా, జీవితంలో ఒక లక్ష్యం లేని వ్యక్తిగా కనిపిస్తాడు.అదే సుశాంత్‌తో అంటాడు. దాంతో కోపం వచ్చిన సుశాంత్ "నేనింతే నేనిలాగే ఉంటాను... ఎవరి కోసమూ మారను" అని స్నేహతో అంటాడు. కానీ అతనున్నంత మామూలుగా స్నేహ ఉండలేకపోతుంది.ఆమె సుశాంత్‌తో "నామనసులో ప్రేమను పుట్టించింది నువ్వే గనక, ఆ ప్రేమని నా మనసులోనుంచి తీసివేయ"మని అడుగుతుంది. దానికి సరేనంటాడు సుశాంత్‌‌. ఒకరి మనసులో కలిగిన ప్రేమను తీసివేయటం సాధ్యమా...? అసలు ప్రేమ అనేది నమ్మకమా...? బాధ్యతా...? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి.
ఎనాలసిస్ :
ఇది పూర్తిగా యువతకు సంబంధించిన ప్రేమ కథ. ఈ చిత్రాన్ని చక్కని స్క్రీన్‌ప్లేతో నడిపించాడు దర్శకుడు సూర్యప్రతాప్.కథ గొప్పది కాకపోయినా, కథనం కొత్తగా ఉండి యువతనాకర్షించే విధంగా ఉంది. దర్శకుడు కొత్తవాడైనా సినిమాలో కొత్తదనం ఉందే కానీ తీయటంలో ఆ కొత్తదనం తాలూకు తడబాటు మనకు ఎక్కడా కనిపించదు. నేటి యువతకు ఏం కావాలో అది ఈ సినిమాలో పుష్కలంగా నింపారు.ఇక నిర్మాణపు విలువలు గొప్పగా ఉన్నాయి. ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా తీశారు అనటానికి ఈ సినిమాలో పాటలు చూస్తే చాలు... ఆ విషయం మనకర్థమవుతుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన -: సుశాంత్‌కు ఇది రెండవ చిత్రమే అయినా అతని నటనలో కానీ, డ్యాన్సుల్లో కానీ చాలా మార్పు వచ్చింది. అతని డ్యాన్సులో స్పీడ్ పెరిగింది. అతని శరీరం ఎలా కావాలంటే అలా వంపులు తిరిగేలా అతని ఫిజికల్‍ ఫిట్‍నెస్ ఉంది. అతనీ చిత్రంలో చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపించటమే కాకుండా నటనలో ఇంకా ఈజ్‍ పెంచుకున్నాడు. డైలాగ్ మాడ్యులేషన్ కూడా ఈ సినిమాలో బాగా మెరుగుపడింది. ఇక హీరోయిన్ స్నేహ ఉల్లాల్‍ జూనియర్ ఐశ్వర్యారాయ్‌లా కనిపించిందీ చిత్రంలో.ఆమె కూడా ఈ సినిమాలో తన పాత్రను సమర్థవంతంగానే పోషించింది. బ్రహ్మానందం కామెడీ బాగానే పండింది. బోసు పాత్రలో వెన్నెల కిశోర్ బాగానే నవ్వించాడు. ఇక "జాంపళ్ళోయ్" అంటూ రఘుబాబు, షషీ ల కామేడీ కూడా బస్టాండ్ లో, పోలీస్ స్టేషన్‌లో బాగా పండింది. మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు కానీ ఒక్క షషీ మాత్రమే అనవసరంగా అరిచినట్లుగా డైలాగ్ చెప్పినట్లుంది. సంగీతం -: ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగా ప్లస్సయింది. ఈ చిత్రం ఆడియో ముందే సూపర్ హిట్టయ్యింది. ఈ చిత్రంలోని పాటలన్నీ బాగున్నాయి... ముఖ్యంగా టైటిల్‍ సాంగ్ యువతను బాగా ఆకట్టుకుంటుంది. రీ-రికార్డింగ్ చాలా బాగుండి, సీన్ మూడ్‌ని ఎలివేట్‍ చేసే విధంగా ఉంది. కెమెరా -: గోదావరి, హ్యాపీడేస్ వంటి శేఖర్ కమ్ముల చిత్రాలకు సినిమాటోగ్రఫీ నిర్వహించిన విజయ్.సి.కుమార్ ఈ చిత్రానికి కూడా పనిచేయటం వల్ల ఈ సినిమా విజువల్‍గా చక్కగా ఉంది. ఫొటోగ్రఫీ పాటల్లో ఇంకా బాగుంది. ఎడిటింగ్ -: మార్తాండ్‌‍.కె.వెంకటేష్ ఎడిటింగ్ వల్ల ఈ చిత్రంలో ఒక్క వేస్ట్ ఫ్రేం కూడా లేకుండా నీట్‍గా ఉంది. కొరియోగ్రఫీ -: ఈ సినిమాలో కొరియోగ్రఫీ అన్ని పాటల్లో బాగున్నా టైటిల్‍ సాంగ్‌లో మరింత బాగుంది. యాక్షన్ -: యాక్షన్ అనగానే ఢిష్యూం ఢిష్యూం ఫైట్లే కాదనీ, బుర్రుంటే యాక్షన్ సీక్వెన్స్ లో కూడా కామెడీ పండించ వచ్చని కణల్‍ కణ్ణన్ ఈ చిత్రంలో నిరూపించారు.అలాగని ఈ సినిమాలో ఫైటింగ్ లన్నీ కామేడీ అనుకుంటే పోరపాటే. ఇది యుత్‌ఫుల్‍ లవ్ స్టోరీ. అలాగని ఇది ఒక్క కుర్రాళ్ళే చూడాల్సిన చిత్రమనీ, పెద్దలు చూడకూడదని కాదు. అన్నివర్గాల ప్రేక్షకులకూ నచ్చే చిత్రం చూడాలంటే ఈ చిత్రం చూడండి.