Read more!

English | Telugu

సినిమా పేరు:బురిడి
బ్యానర్:బిగ్ బి ప్రొక్షన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Apr 30, 2010
ఎమ్మెస్ నారాయణ తెలుగులాడెన్ పేరు పెట్టుకుని గూ౦డాయిజం చేస్తుంటాడు. అతని అసిస్టెంటు రఘుబాబు. వారిద్దరికీ మాస్కు వేసుకున్న ఓ అపరిచిత వ్యక్తి ఓ అమ్మాయిని చంపాలని, ఆ అమ్మాయి బ్యాంకాక్ లో హానీమూన్ హోటల్ లో ఉందని ఎమ్మెస్ కి చెబుతాడు. దాంతో ఎమ్మెస్, రఘుబాబు బ్యాంకాక్ బయలుదేరుతారు. అయితే ఆ అమ్మాయి ఏ రూంలో ఉందో తెలుసుకోవడానికి 901 నుండి 909 నంబర్ గల రూంలలో చెక్ చేస్తూంటారు. అయితే వారు చెక్ చేసిన ఆ ఎనిమిది గదులలో ఎనిమిది జంటలు ఉంటాయి. ఆ ఎనిమిది జంటలకు ఎనిమిది ప్లాష్ బ్యాకులు ఉంటాయి. ఆ ఎనిమిది జంటలలో తాము ఎవరిని హత్య చేయాలో తెలుసుకోవడానికి ఎమ్మెస్ ప్రయత్నిస్తుంటాడు. మధ్య మధ్యలో ఆ హోటల్ మేనేజర్ ఏవియస్ కొడుకు ఆర్యన్ రాజేష్ ని సినిమా హీరో చేయాలని ఎమ్మెస్ వెనకాల పడుతూ౦టాడు. చివరికి ఎమ్మెస్ ఆ అమ్మాయిని చంపాడా.... ఆ అమ్మయిని చంపాలని చెప్పిన వ్యక్తి ఎవరు...అన్నది మిగతా కథ....
ఎనాలసిస్ :
గతంలో వచ్చిన "ఎవడి గోల వాడిదే" చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం ఉ౦దని చెప్పొచ్చు. అయితే ఆ చిత్రంతో పోలిస్తే ఈ చిత్రంలో కామెడీ తక్కువనే చెప్పాలి. ఇవివి మార్కు డైలాగులు, ఫన్నీ సీన్ లతో ప్రేక్షకులని నవ్వించడానికి చాలా ప్రయత్నమే చేసారు. తెలంగాణ శకుంతల, జయప్రకాష్ రెడ్డి ల ఎపిసోడ్ బావుంది. తండ్రీ కొడుకులుగా, తల్లీ బిడ్డలుగా వారు చేసిన డబుల్ రోల్ వెరైటీగా ఉంది. కానీ కొన్ని సీన్ లు ఓవర్ గా అనిపిస్తాయి. లాజిక్ లు వెతక్కుండా సరదాగా నవ్వుకోవడానికి ఈ చిత్రాన్ని చూడొచ్చు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన:-ఆర్యన రాజేష్ తన పాత్రమేరకు బాగానే చేశాడు. కొత్తమ్మాయి ఐశ్వర్య ఫర్వాలేదు. మిగతా నటీనటులు సీనియర్ హాస్యనటులు కాబట్టి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమిలేదు. ప్రేక్షకులని నవ్వించడానికి వారి పరిధుల మేరకు ప్రయత్నించారు. సంగీతం:- కోటి అందించిన సంగీతం మామూలుగా ఉంది. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కెమెరా:- కెమెరా పనితనం బావుంది. సాంగ్స్ చిత్రీకరణ సముద్రపు అందాలను చాలా బాగా చిత్రీకరించారు. దర్శకత్వ౦:- ఇవివి అంటేనే కామెడీకి పెట్టింది పేరు. ఈ చిత్రాన్ని ఆయన చాలా ఫన్నీగా తెరకెక్కించారు. కాలక్షేపం కోసం,సరదాగా నవ్వుకోవడానికి ఈ చిత్రాన్ని చూడొచ్చు.