Read more!

English | Telugu

సినిమా పేరు:బ్రాహ్మి గాడి కథ
బ్యానర్:మల్టీ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్
Rating:2.75
విడుదలయిన తేది:Jul 1, 2011

నిర్మాత - రజత పార్థసారథి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం - వి.ఈశ్వర్ రెడ్డి
కథ, మాటలు - పద్మశ్రీ
సంగీతం - కోటి
సినిమాటోగ్రఫీ - జవహర్ రెడ్డి
పాటలు - రామ జోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ,భువన చంద్ర, బండారు దానయ్య, వెనిగళ్ళ రాంబాబు
ఎడిటింగ్ - శంకర్
ఆర్ట్ - యమ్.యస్.పార్థసారథి
కొరియోగ్రఫీ - రఘు, అజయ్
యాక్షన్ - విజయ్
తారాగణం - వరుణ్ సందేశ్, అస్మిత సూద్ ( తొలి పరిచయం), పూనం కౌర్, బ్రహ్మానందం, కృష్ణుడు, జయప్రకాష్ రెడ్డి, ఆలీ, నాగినీడు, మరియా జకారియా తదితరులు...

కథ -  విజయవాడ నుండి హైదరాబాద్ కి వస్తున్న శివ (వరుణ్ సందేశ్), అనుకోకుండా మాయ ( అస్మిత సూద్) అనే అమ్మాయిని కొందరు దుండగుల బారి నుంచి కాపాడతాడు. శివ మేనమామ (జయప్రకాష్ రెడ్డి)కి సినిమాలంటే పిచ్చి. అతనికి ఒక (పూనమ్ కౌర్) కూతురుంటుంది. ఆమెను తన మేనల్లుడికిచ్చి పెళ్ళి చేయాలని అతని ఉద్దేశం. శివ మేనమామకి ఒక మంచి సినిమా తీయాలని స్టార్ డైరెక్టర్ బ్రహ్మిని పిలిపిస్తాడు. బ్రహ్మి సినిమా కథ చెపుతూంటాడు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే బ్రహ్మి చేప్పే కథ సీన్ బై సీన్ శివ, మాయల విషయంలో జరుగుతుంటుంది. అది చూసి శివ మేనమామ టెన్షన్ పడుతూంటే అతనికి కథ బాగా నచ్చి కథలోని పాత్రలో ఇన్ వాల్వ్ అయ్యాడనుకుంటాడు బ్రహ్మి. మాయను దుండగులు ఎందుకు వెంటాడుతున్నారు...? శివ తన మేనమామ కూతురుని పెళ్ళి చేసుకుంటాడా...? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాలి.


ఎనాలసిస్ :

గతంలో "మీ శ్రేయోభిలాషి"వంటి సామాజిక స్పృహ కలిగిన చక్కని చిత్రానికి దర్శకత్వం వహించిన ఈశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. దర్శకత్వపు విలువలు బాగున్నాయి. సినిమా ఆద్యంతం చక్కని సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తూ ఆసక్తికరంగా మలచటంలో ఈశ్వర రెడ్డి ప్రతిభ బాగుంది. ఈ సినిమా చక్కని స్క్రీన్ ప్లే తో సాగుతుంది.
నటన - వరుణ్ సందేశ్ నటన ఫరవాలేదు కానీ, అతని ఇంగ్లిష్ యాశతో కూడిన తెలుగు భరించటం చాలాఇబ్బందిగా ఉంటుంది. అతను తెలుగు సినిమాల్లో హీరోగా నటించటం మొదలు పెట్టి ఇప్పటికి నాలుగేళ్ళవుతున్నా తెలుగు స్పష్టంగా పలకలేకపోవటం శోచనీయం.  20011 ఫెమీనా మిస్ ఇండియా విన్నర్ అస్మిత సూద్ ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కి చెల్లెలు. ఆమెకిది తొలి చిత్రమైనా చక్కని నటన ప్రదర్శించింది. కాకపోతే క్లోజప్ షాట్స్ లో ఆమెను చూడటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

 

జయప్రకాష్ రెడ్డి రాయలసీమ యాశతో చెప్పే డైలాగులు, అతని నటన మనకు ఫన్నీగా ఉంటాయి. ఇక టైటిల్ రోల్ పోషించిన బ్రహ్మానందం ఎంట్రీ బాగుంది.ఒక్కోసారి అతని నటన మనల్ని పగలబడి నవ్వేలా చేస్తుంది. హీరో స్నేహితుడిగా నటించిన కృష్ణుడు చేజింగ్ సీన్లలో నటించటం బాగుంది. అతని టిపికల్ డైలాగ్ మాడ్యులేషన్ ఆకట్టుకుంటుంది. మిగిలిన వారంతా తమతమ పాత్రలకు న్యాయం చేశారు.
సంగీతం - కోటి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటల్లో కనీసం ఒక్కటి కూడా బాగుందనిపించదు. రీ-రికార్డింగ్ మనల్ని డైలాగులు విననివ్వదు.
పాటలు - చెప్పుకో తగ్గంత గొప్పగా ఏం లేవు.
మాటలు - ఈ చిత్రంలోని మాటలు బాగున్నాయి. విట్టిగా ఉండి చక్కని హాస్యాన్ని పండించాయి. ఒక్కోసారి మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి ఈ చిత్రంలోని మాటలు.
ఎడిటింగ్ - బాగుంది.
ఆర్ట్ - ఒ.కె.
కొరియోగ్రఫీ - ఫరవాలేదు.
యాక్షన్ - ఒ.కె.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలను పెట్టి తీసిన అర్థం పర్థం లేని సినిమాలకన్నా ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుంది. ఈ సినిమాని ఒకసారి చూడవచ్చు. మీరేం డిజప్పాయింట్ కారు. ఫరవాలేదు.