Read more!

English | Telugu

సినిమా పేరు:బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం
బ్యానర్:లక్కీ మీడియా, యుటోపియా
Rating:2.25
విడుదలయిన తేది:Jul 29, 2010
బ్రహ్మలోకంలో బ్రహ్మ(రాజేంద్రప్రసాద్)గారు తన భార్య సరస్వతి(కళ్యాణి)తో తగువాడి,ఆమె మీద కోపంతో ఒకరికి పొరపాటు రాత రాస్తాడు.అదేంటంతే ఒకమ్మాయికి పెళ్ళవగానే చావాలని నుదిటి రాత రాస్తాడు.వయసు పై బడుతున్నాపెళ్ళి కాని శీను(శివాజీ)కి కనీసం డిగ్రీ అయినా పుర్తిచేస్తే ఎవరైనా పిల్లనిస్తారని అతన్ని మళ్ళీ కాలేజ్ కి పంపిస్తుంది.కాలేజీలో చేరిన తొలి రోజే అక్కడ కనిపించిన శ్వేత (సోనియా)అనే అమ్మాయిని చూసి ఫిదా అవుతాడు శీను.దాని ఫలితంగా ఆమె బావ జాక్సన్ (రఘుబాబు)చేతిలో చావుదెబ్బలు తింటాడు శీను.ఇదిలా ఉంచితే పరమ బద్ధకస్తుడైన శీను స్నేహితుడు శోభన్ బాబు(వేణుమాధవ్)అదవుల్లో మునీశ్వరుల సలహా మేరకు బ్రహ్మకోసం తపస్సు చేస్తాడు.ఆయన కూడా ఆహా నన్ను కొలిచే ఈ భక్తుణ్ణి పెద్దగా ఇబ్బంది పెట్టకూడదనుకుని వెంటనే ప్రత్యక్షమౌతాడు.అయితే అతనికి ఒక విచిత్రమైన వరం ఇస్తాడు.ఒక కలశం ఇచ్చి అందులోని పాలు తాగితే భవిష్యత్తు తెలుస్తుందని చెపుతాడు.జాక్సన్ చేతిలో చావుదెబ్బలు తిన్న శీను ఆ కలశం ఉన్న చోటే పడి అనుకోకుండా ఆ కలశంలోని పాలు తాగుతాడు.దాంతో ఆ వరం శీనుకి లభిస్తుంది.వాళ్ళిద్దరూ స్నేహితులే కాబట్టి భవిష్యత్తు చెపుతూ లక్షలు గడిస్తారు.బ్రహ్మ పొరపాటు రాత రాసింది శీను ప్రేమించినశ్వేతకే.శీను ఒకసారి స్కూలు పిల్ల బస్సు ప్రమాదానికి గురౌతుందన్న భవిష్యత్తుని తెలుసుకుని ఆ ప్రమాదాన్నుంచి ఆ పిల్లలను కాపాడతాడు.యమలోకానికి రావాల్సిన ఆ స్కూలు పిల్లలు ఎందుకు రాలేదు అన్న కారణం తెలుసుకోటానికి యముడు (జయప్రకాష్ రెడ్డి)బ్రహ్మలోకం వెళ్ళి ఆయన్ని ఈ విషయం గురించి అడుగుతాడు.తానిచ్చిన వర ప్రభావం వల్లే ఇదంతా జరిగిందని తెలుసుకుని తన వరాన్ని తిరిగి తీసుకోటానికీ,తాను తప్పును దిద్దుకోటానికీ యమ,చిత్రగుప్తుల(ఎవియస్)తో పాటు భూలోకం బయలుదేరతాడు బ్రహ్మ.ఆదిపరాశక్తి(లయ)వీళ్ళ తప్పును దిద్దుకోటానికి వీరికి ఒక మాసం మాత్రం గడువిస్తుంది.ఆ తర్వాత వారు భూలోకంలో ఏమేం చేశారు...?ఆ తదనంతర పరిణామాలేంటి అన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
మామూలు మనుషుల్లాగా అరిషడ్వర్గాలకు అతీతులైన బ్రహ్మదేవుడు సగటు మనిషిలా ప్రవర్తించటం అనే పాయింట్ తో కథ మొదలుపెట్టారు.దర్శకుడు కొంచెం అనుభవం సంపాదించి ఉంటే చక్కని టెంపోని మెయిన్ టెయిన్ చేస్తూ,సాంకేతికంగా ఈ సినిమాని మరింత ఉన్నతంగా చూపించేందుకు మరింత అవకాశం ఉండేది.గ్రాఫిక్స్ విషయానికొస్తే "అంజి" "అమ్మోరు","మగధీర", "యమదొంగ" చిత్రాల్లో అత్యున్నత స్థాయి గ్రాఫిక్స్ ని మనం చూశాం.కానీ ఇది చిన్న సినిమా కాబట్టి ఉన్న బడ్జెట్ లోనే బాగా చేయటానికి ప్రయత్నించారు. నటన - ఈ చిత్రంలో నటించిన అందరికీ నటనాపరంగా మంచి అనుభవముంది.బ్రహ్మగా నటకిరిటి మూడు ముఖాలతో నటించటం ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తుంది.ఇక శివాజీకి అతని పాత్ర నల్లేరు మీద నడక వంటిది.యముడిగా జయప్రకాష్ రెడ్డి నటనకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పాటలో అతని స్టెప్పులను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారని చెప్పాలి.రంభగా ఆర్తి అగర్వాల్ ని చూస్తే జాలేసింది.ఆమె షుగర్ వచ్చిన రంభలా ఉందే కానీ ఎక్కడా అసలైన రమభలా కనిపించలేదు.ఇక సరస్వతిగా కళ్యాణి చక్కగా కన్నులకింపుగా కనపడుతుంది.ఆదిపరాశక్తిగా లయ బాగుంది.చిత్రగుప్తుడిగా ఎవియస్ నటన ఆకట్టుకుంటుంది.ఇక మిగిలిన వారంతా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం - ఇలాంటి చిన్న చిత్రాలకు సంగీతాన్నందించటంలో శ్రీలేఖ బాగా అనుభవజ్ఞురాలు.పాటలన్నీ బాగానే ఉన్నాయి.రీ-రికార్డింగ్ కూడా బాగుంది. కెమెరా - ఉన్నంతలో బాగుంది.ఇలాంటి చిన్న సినిమాల్లో ఇంతకంటే ఎక్కువ ఆశించటం కూడా పొరపాటే. పాటలు -ఈ చిత్రంలోని పాటలన్నీ భాస్కరభట్ల రవికుమార్‍ వ్రాశారు.సాహిత్యపరంగా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ - ఫరవాలేదు. ఆర్ట్ - ఆర్ట్ పనితనం బాగుంది. కొరియోగ్రఫీ - సింపుల్ గా ఉండి బాగుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ సినిమా సరదాగా కాసేపు టైమ్ పాస్ చేయటానికి చూస్తే చూడండి