Read more!

English | Telugu

సినిమా పేరు:బోణి
బ్యానర్:గ్రీన్ మ్యాంగోస్ సినిమా
Rating:2.25
విడుదలయిన తేది:Jun 12, 2009
ఇద్దరు అనాథలు డిడి (సుమంత్ž),చిన్నా (త్రినేత్రుడు)చిన్నప్పటి నుండి కలసి అనాథాశ్రమంలో పెరుగుతారు.వారికి అక్కడ వంటామె(సుధ)వీళ్ళని ప్రేమగా చూసుకుంటుంది.ఆమె చేసే పులిహోరంటే చాలా ఇష్టం.పెద్దయాక పులి హోర సెంటర్ž పెట్టాలనేది వారి కోరిక.వీళ్ళని ప్రేమగా చూసుకునే వంటామె చనిపోతుంది.దాంతో వీరు విధిన పడతారు.వారు వీధి గూండాల్లా పెరిగి పెద్దవుతారు.వాళ్ళు చిన్నప్పటి నుండీ దాచుకున్న డబ్బంతా పోతుంది.దాంతో డబ్బుని చాలా త్వరగా సంపాదించాలనే తపనతో మాఫియా లీడర్లయిన అయిన గిరి (తనికేళ్ళ భరణి),దాసు (జయప్రకాష్ రెడ్డి)ల దగ్గర పనిలో చేరతారు.అక్కడ చేరగానే వీరికి ఒక మంత్రి కూతుర్ని కిడ్నాప్ చేయమని పురమాయిస్తారు వీళ్ళ బాస్žలు.ఆ మంత్రి కుతురు ప్రగతి (కృతి కర్బందా)ని కిడ్నాప్ž చేస్తారు.ఎక్కడయినా కిడ్నాప్ž అయితే అది ఒక ఆడపిల్ల కిడ్నాప్ž చేయబడితే 'రాముడో దేవుడో'అంటూ మొత్తుకుంటుంది.కానీ ఈ ప్రగతి చాలా ఆనందంగా ఉంటుంది.ఇది డి.డి.కీ,చిన్నాకీ అర్థం కాదు.దానికి ఆమెకుండే కారణాలు ఆమెకుంటాయి.ఆ కారణాలేంటి...? చివరికి ఏమయింది అనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఇలాంటి కథను డీల్ చేసేటప్పుడు వళ్ళుదగ్గర పెట్టుకుని డీల్ చేయాలి.లేకపోతే వళ్ళు పెట్లిపోతుంది.ఈ చిత్రానికి అదే జరిగిందని నా అనుమానం.ఈ చిత్రానికి స్క్రీన్žప్లే ఎంతో పకడ్బందిగా వ్రాసుకోవాలి.కానీ ఈ చిత్ర దర్శకుడు ఆపనేం చేసినట్లు లేడు.దాని ఫలితమే ఈ చిత్రం ఆసక్తికరంగా లేకపోవటం.ఇకపోతే పక్కా మాస్ž క్యారెక్టర్žలో సుమంత్ž ఇమడలేకపోయాడని చెప్పాలి.అతనికి సాఫ్ట్ క్యారెక్టర్లే బాగుంటాయని,అతను కూడా బాగా చేయగలడని మరోసారి నిరూపించబడింది.ఇక హీరోయిన్ కృతి కర్బందా కొత్తమ్మాయి అయినా ఎక్కడా ఆ కొత్తదనం కనబడకుండా అనుభవమున్న నటిలా నటించింది.ఈ అమ్మాయి ఒక్కోసారి జయప్రదలా కనిపించటం విశేషం.సి.ఐ.గా హర్షవర్థన్ž నవ్వించే ప్రయత్నం బాగుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సంగీతం - రమణ గోగుల సంగీతం గొప్పగా ఏం లేదు.సగటు స్థాయిలోనే ఉంది.కాకపోతే ఓ రెండు పాటలు వినటానికి బాగున్నాయి.రీ-రికార్డింగ్ ఫరవాలేదు.సినిమాటోగ్రఫీ - ఈ సినిమాకి హైలైట్ కేమేరా పనితనం.ఆండ్రూకి బహుశా తెలుగులో ఇదే మొదటి చిత్రం కావచ్చు.కానీ అతని ఫొటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్సయ్యింది.లైటింగ్ స్కీమ్ కూడా బాగుంది.ఎడిటింగ్ - నీట్žగా ఉండి బాగుంది.షార్ప్ గా కట్ž చేశారు.ఈ సినిమాలో టెక్నికల్ž డిపార్ట్ మెంటులన్నీ బాగా పనిచేశాయి.ఒక్క డైరెక్షన్ డిపార్ట్ మెంట్ž తప్ప.ఈ సినిమా చూడాల్సినంత మంచి సినిమా కాదు.