Read more!

English | Telugu

సినిమా పేరు:బిందాస్
బ్యానర్:ఎ.కె.ఎంటర్ ప్రైజెస్
Rating:3.00
విడుదలయిన తేది:Feb 5, 2010
మహేంద్ర నాయుడు (ఆహుతి ప్రసాద్ ), శేషాద్రి నాయుడు (జయప్రకాష్ రెడ్డి ) వీరిద్దరి మధ్య పగలు, ప్రతీకారాలు ఉంటాయి. శేషాద్రి నాయుడు వల్ల తమ కుటుంబ సభ్యుల ప్రాణాలకి ముప్పు పొంచి ఉండడంతో అందరినీ తమ ఉరికి రప్పించుకుంటాడు మహేంద్ర యుడు. అలా వచ్చిన వారిలో అజయ్ (మనోజ్ కుమార్) ఒకడు. అజయ్ అంటే ఆ ఫ్యామిలీలో ఎవరికీ పడదు. కాని అజయ్ మాత్రం అవేవి పట్టించుకోకుండా బిందాస్ గా ఉంటాడు. అత్త కూతురయిన గిరిజ(శీన శాహబాది) ని ప్రేమిస్తుంటాడు. అయితే శేషాద్రి నాయుడు వల్ల తమ ఫ్యామిలీకి అపాయం చాలా ఉందని తెలుసుకున్న అజయ్ శేషాద్రినాయుడు ఇంట్లోకే మకాం మారుస్తాడు. అలా ఆ ఇంట్లో ప్రవేశించిన అజయ్ ఏం చేశాడు అన్నదే మిగతా కథ.
ఎనాలసిస్ :
విజయవంతమైన సినిమా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మంచు మనొజ్ కుమార్ కి ఈ చిత్రం కాస్త ఉరటనిస్తుంది. సినిమా మొత్తం తానే అయి ఈ చిత్రం విజయం కావడంలో ముఖ్య పాత్ర పోషించాడు మనోజ్ కుమర్. కాన్సెప్ట్ పాతదే అయినా కామెడీ మిక్స్ చేసి జనరంజకంగా ఈ చిత్రాన్ని మలచడంలో దర్శకుడు విజయం సాధించాడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: మంచు మనోజ్ కుమార్ : మనోజ్ నటన ఈ చిత్రానికే హైలెట్. హావ భావాల్లోనూ, యాక్షన్ ఎపిసోడ్స్ లోనూ, కామెడీ సీన్స్ లోనూ బిందాస్ గా నటించాడు. ముఖ్యంగా మోహన్ బాబు మాడ్యులేషన్ లో డైలాగ్ లు చెప్పడం బావుంది. అంతేకాదు అందులో చాలా వరకు సక్సెస్ కూడా సాధించాడు. ఈ చిత్రానికి ఎనర్జీ తీసుకు వచ్చిన వాడు మనోజ్ కుమర్.శీనా-: హీరోయిన్ శీనా క్యూట్ గా ఉంది. చక్కని ఎక్స్ ప్రెషన్స్ తో బాగా నటించింది. సాంగ్స్ లలో చూడడానికి అందంగా కనిపించింది. కానీ మరీ చిన్నపిల్లలా కనిపించడం మైనస్ పాయింట్. జయప్రకాష్ రెడ్డి-: జయప్రకాష్ రెడ్డి ఇలాంటివే ఎన్నో క్యారెక్టర్లు చేసాడు కాబట్టి ఆయన నటన రొటీన్ గానే అనిపించినా తన పాత్ర పరిధి మేరకు బాగా చేసాడు.రఘుబాబు-: కామెడీని పండి౦చడంలో రఘుబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. కామెడీ సీన్స్ లలో చాలా చక్కగా నటించాడు. ముఖ్యంగా మనోజ్, రఘుబాబు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ థియేటర్ లో నవ్వులు పూయిస్తాయి.సునీల్-: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ క్యారెక్టర్ లో చాలా సాఫ్ట్ గా చక్కగా నటించాడు సునీల్. అయితే మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో సునీల్ చాలా సన్నగా కనిపించాడు.బ్రహ్మానందం-: పరబ్రహ్మం పాత్రలో బ్రహ్మానంద౦ నవ్వులు పంచారు. ఆయన క్యారెక్టర్ ఎంటర్ కావడమే ఆలస్యం థియేటర్ లోని ప్రేక్షకులు నవ్వాపుకోలేక పోయారంటే నమ్మండి.ఎమ్మెస్ నారాయణ-: మస్తాన్ బాబా గా కనిపించిన ఎమ్మెస్ నారాయణ బాగానే నవ్వించారు.ఇక మిగతా వారు కూడా తమ తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు.సంగీతం-: బోబో శశి అందించిన సంగీతం ఫర్వాలేదు. మొదటి రెండు పాటల్లో సంగీతం ఆకట్టుకుంటుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది.ఫైట్స్-: ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ ఎపిసోడ్ బావుంది. ఇలాంటి ఫైట్స్ గతంలో ఎన్నో చిత్రాల్లో చూసినప్పటికీ ఈ చిత్రంలో కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. ఓవరాల్ గా యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఓ చేజ్ ఎపిసోడ్స్ లో "బిగ్గెస్ట్ రోప్ లెస్ సింగిల్ జంప్ షాట్" హైలెట్ గా నిలుస్తుంది. ఈ రిస్కీ షాట్ లో మనోజ్ కుమార్ ప్రత్యర్థులు చేతికి చిక్కకుండా ఒక్కో ఇంటి మీద నుండి మరో ఇంటిమీడకి జంప్ చేస్తూ ఆలా ఇంటి పై కప్పుల నుండి పరుగెత్తడం అంతా ఒకే టేక్ లో ఓకే చేయడం రియల్లీ గ్రెట్. మనోజ్ కుమార్ ఎక్కడా తడబండకుండా చాలా కాక్కగా చేసాడు.పాటలు-: రామజోగయ్య శాస్త్రి , భువనచంద్ర కలం నుండి జాలువారిన పాటలు ఆకట్టుకుంటాయి. పాటలకి తగ్గ సంగీతం కూడా తోడవడంతో సాంగ్స్ ని ఆడియన్స్ ఎంజాయి చేస్తారు.కెమేరా-: కెమేర పనితనం బావుంది. సాంగ్స్ చిత్రీకరణలో "ఏంటమ్మా... ఏంటమ్మా' అనే సాంగ్ లో ప్రకృతి అందాలని అద్భుతంగా తెరకెక్కించారు.డైలాగ్స్-: ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ డైలాగ్స్. మంచి పంచతో కూడిన డైలాగ్స్ చాలా వున్నాయి. ఓ స౦దర్భంలో మనోజ్ చెప్పిన డైలాగ్ .... "నాకు రెండు విషయాలంటే చాలా ఇష్టం అందులో ఒకటి నువ్వు, మరొకటి సెన్సార్ కత్తిరించని సీన్లున్న ఇంగ్లీషు సినిమా' థియేటర్ లో నవ్వులు పూయించింది... అలాగే మరో సందర్భంలో బ్రహ్మానందం మనోజ్ ని గురించి చెబుతూ "వీడు ఎడారిలో కూడా ఇసుక అమ్ముతాడు' లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.దర్శకత్వం-: దర్శకుడు వీరుపోట్ల ఈ చిత్రం సక్సెస్ చేయడం కోసం చాలానే కష్టపడ్డాడు. ముఖ్యమైన నాలుగు విభాగాలు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం తానే నిర్వహించి అన్నింట్లోనూ మంచి మార్కులు కొట్టేసారు. కథ పాత మూస ధోరణిలోనే ఉన్నప్పటికీ తన స్టైల్లో కథనాన్ని ప్రజెంట్ చేసి చిత్రాన్ని సక్సెస్ చేసాడు వీరుపోట్ల.మొత్తానికి ఈ చిత్రం హాయిగా నవ్వుకోవడానికి, మనోజ్ కుమార్ నటన కోసం బిందాస్ గా చూడొచ్చు.