Read more!

English | Telugu

సినిమా పేరు:బెట్టింగ్ బంగార్రాజు
బ్యానర్:ఉషా కిరణ్ మూవీస్
Rating:3.00
విడుదలయిన తేది:Apr 9, 2010
బంగార్రాజు(అల్లరి నరేష్) బెట్టింగులు కాస్తూ జులాయిగా తిరిగే వ్యక్తి. అతడు ఉండే ఊళ్ళో బంగార్రాజు పేరు చెబితేనే తెలుసుకుంటారు. అలాంటి బంగార్రాజుకి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనే కోరిక పుడుతుంది. దాంతో హైదరాబాద్ ప్రయాణమవుతాడు. అక్కడ దివ్య(నిధి)ని చూసి ప్రేమిస్తాడు. ఆమె ప్రేమను పొందడానికి మాయదాసు(కృష్ణ భగవన్) సహకారం తీసుకుంటాడు. చివరికి ఎలాగొలా దివ్యకి తన ప్రేమ విషయం చెబుతాడు. అయితే, బంగార్రాజులాగే దివ్యకి మరో ముగ్గురు కూడా తాము ప్రేమిస్తున్నామని చెబుతారు. తనని ప్రేమిస్తున్నానని చెప్పిన ఆ నలుగురిని ఒక చోటుకి రప్పించి, ఆ నలుగురిలో ఎవరినైతే తమ కుటుంబసభ్యులు పెళ్ళి చేసుకోమని చెబుతారో వారినే తాను పెళ్ళిచేసుకుంటానని చెబుతుంది దివ్య. ఆ తరువాత ఏం జరిగిందన్నది మిగతా కథ.
ఎనాలసిస్ :
దర్శకుడు ఇ.సత్తిబాబు ఈ చిత్రాన్ని ఎంతో హాస్యప్రదాయంగా తెరకెక్కించారు. ప్రతి ఫ్రేమ్ ని చాలా చక్కగా చిత్రీకరించారు. ముఖ్యంగా అల్లరి నరేష్ క్యారెక్టర్ హీరోయిన్ దివ్య క్యారెక్టర్, కృష్ణభగవాన్ క్యారెక్టర్ ఆత్రం పాత్రలలో రఘుబాబు క్యారెక్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కృష్ణభగవాన్, సెకండ్ హాఫ్ లో రఘుబాబు ల కామెడి చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. ఓవరాల్ గా హాస్యచిత్రాన్ని ప్రేక్షకులకి అందించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన :- అల్లరి నరేష్ :- అల్లరి నరేష్ కి ఇలాంటి పాత్రలు కొట్టినపిండి. తన పాత్రని ఎంతో ఈజ్ గా చేశారు. సినిమా మొత్తం తన భుజాలపైనే వేసుకుని నడిపించడంలో అల్లరి నరేష్ సక్సెస్ అయ్యారు. ఈ చిత్రం ద్వారా అల్లరి నరేష్ కి మరో హిట్ సినిమా లభించింది. నిధి :- దివ్య పాత్రలో హీరోయిన్ నిధి చక్కగా నటించింది. హావభావాలలో మరికొంత పరిణితి సంపాదిస్తే బాగుండేది. కృష్ణభగవాన్ :- మాయదాసు పాత్రలో కృష్ణభగవాన్ నటన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. రఘుబాబు :- సెకండాఫ్ లో రఘుబాబు చేసిన ఆత్రం క్యారెక్టర్ హైలెట్ గా నిలుస్తుంది. తన నటనతో రఘుబాబు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్ర మేరకు చక్కగా నటించారు. మాటలు :- నాగరాజు గంధం అందించిన మాటలు చక్కగా పండాయి. సంగీతం :- శేఖర్ చంద్ర అందించిన సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి దర్శకత్వం :- ఇ.సత్తిబాబు కామెడీనే ప్రధానంగా ఏర్పరుచుకుని రూపొందించిన ఈ చిత్రాన్ని చాలా చక్కగా రూపొందించడంలో సక్సెస్ సాధించారు. పూర్తి వినోదభరితమైన మరియు హాస్య చిత్రాలను చూడాలనుకునేవారు కుటుంబసమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు.