English | Telugu

సినిమా పేరు:ఆర్య - 2
బ్యానర్:ఆదిత్య ఆర్ట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Nov 27, 2009
ఆర్య (అల్లు అర్జున్‌), అజయ్‌ (నవదీప్‌)లు ఓ అనాధాశ్రమంలో పెరిగిన చిన్ననాటి స్నేహితులైనప్పటికీ ఆర్య అంటే అజయ్‌కి పడదు. అనాధ అయిన అజయ్‌ని ఓ ధనవంతుల కుటుంబం దత్తత తీసుకుంటుంది. దాంతో కోటీశ్వరుడిగా పెరిగిన అజయ్‌తో పాటే ఉంటానని అంటాడు ఆర్య. దాంతో తన సాప్ట్‌వేర్‌ కంపెనీలో అయిష్టంగానే ఉద్యోగం ఇస్తాడు అజయ్‌. అదే కంపెనీలో పనిచేస్తున్న గీత (కాజల్‌)ని అజయ్‌ ఆర్య ఇద్దరూ ప్రేమిస్తారు. అయితే అజయ్‌ కోసం తన ప్రేమని త్యాగం చేస్తాడు ఆర్య.అజయ్‌, గీతలు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న సమయంలోనే కర్నూలులో ఉన్న గీత తండ్రి రాజిరెడ్డి (ముఖేష్‌ ఋషి) గీతకి తన ప్రత్యర్థి అయిన కేశిరెడ్డి (శాయాజీ షిండే) కొడుకు (అజయ్‌)తో పెళ్లి కుదుర్చుతాడు. రాత్రికి రాత్రే గీతని హైదరాబాదునుండి కర్నూలుకి తీసుకువస్తాడు రాజిరెడ్డి. దాంతో గీతని తీసుకువచ్చి అజయ్‌తో పెళ్ళి జరిపిస్తానని చెప్పి కర్నూలు బయలుదేరిన ఆర్య... కొన్ని కారణాల వల్ల తానే గీతని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో గీతని పెళ్ళి చేసుకుంటాడు. తాను పెళ్లి చేసుకున్నా అజయ్‌తో గీతని అమెరికాకి పంపించడానికి ఆర్య ప్రయత్నిస్తాడు.. చివరికి ఆర్య ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయన్నది మిగతా కథ.
ఎనాలసిస్ :
గతంలో వచ్చిన ఆర్య చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ స్థాయిలో ఈ చిత్రాన్ని ఊహించుకుని వెళితే నిరుత్సాహ పడక తప్పదు. అయితే ఈ చిత్రంలోని ఆర్య (అల్లు అర్జున్‌) కూడా చాలా చలాకీగా అందరినీ ఆహ్లాదపరిచేవిధంగానే కనిపిస్తాడు. దర్శకుడు సుకుమార్‌ చిత్రాన్ని రిచ్‌గా తెరకెక్కించారు. అయితే కథలో మరింత పట్టు ఉండిఉంటే బావుండేది. సాప్ట్‌వేర్‌ కంపెనీలో హెచ్‌.ఆర్‌. దశావతారంగా బ్రహ్మానందం పాత్ర నవ్విస్తుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: ఆర్యగా అల్లు అర్జున్‌ నటన ఆకట్టుకుంటుంది. ఆయన నటనలో మంచి ఈజ్‌ కనిపించింది. మునుపటి చిత్రాలకన్నా ఎనర్జిటిక్‌గా చేసాడు. ముఖ్యంగా డాన్స్‌లలో మరోమారు తన సత్తా చాటాడు. ఇక గీత పాత్రలో కాజల్‌ ఫర్వాలేదు. ఆర్య ఫ్రెండ్‌గా నటించిన నవదీప్‌ కూడా బాగానే చేసాడు. మిగతా పాత్రలలో బ్రహ్మానందం, అజయ్‌ల పాత్రలు నవ్విస్తాయి. ముఖ్యంగా విలన్‌గా కనిపించే అజయ్‌ ఈ చిత్రంలో కామెడీ విలన్‌గా బాగా చేసాడు. సంగీతం-: దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీలేదు. పాటలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ-: చాలా బావుంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ బావుంది. ఎడిటింగ్‌-: బావుంది. ఫైట్స్‌-: రామ్‌ లక్షణ్‌ కంపోజ్‌ చేసిన ఫైట్స్‌ వెరైటీగా ఉన్నాయి. రౌడీలని చితకబాదేటప్పుడు ఆర్య తన వెంట ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ తీసుకువెళ్లడం, మరో సారి అంబులెన్సులని తీసుకెళ్లడం తాను చితకబాదినవారందరినీ అక్కడికక్కడే ట్రీట్‌మెంటు ఇవ్వడం లాంటి వెరైటీలు బావున్నాయి. దర్శకత్వం-: సుకుమార్‌ దర్శకత్వం ఓకే.

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 3.00

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25