Read more!

English | Telugu

సినిమా పేరు:ఆంజనేయులు
బ్యానర్:పరమేశ్వర ఆర్ట్స్
Rating:2.50
విడుదలయిన తేది:Aug 12, 2009
ఆంజనేయులు (రవితేజ) బాగా డాషింగ్ నేచరున్న యువకుడు. అతనొక ప్రైవేట్ ఛానల్లో పనిచేస్తుంటాడు.అతనికి తల్లీ, తండ్రి(నాజర్) ఉంటారు. తండ్రి స్కూల్‍ హెడ్ మాస్టర్. ఆంజనేయులు అంటే అతని తల్లిదండ్రులకీ, వారంటే అతనికీ విపరీతమైన ప్రేమ, అభిమానం. సిటీలో బడా(సోనూ సూద్) కి, మరో గూండా (కోట శ్రీనివాసరావు) కి మధ్య గొడవలను రాజీ చేయటానికి ఒక యమ్.యల్.ఎ.(జయప్రకాష్ రెడ్డి) రాజీ చేస్తాడు. హోమ్ మినిస్టర్ తాలూకు అన్యాయాలూ, అక్రమాలూ ఒక ఫైల్లో ఉంచి సి.యమ్.కి అందజేయాలని ఒక విలేఖరి ప్రయత్నిస్తుంటాడు. హోమ్ మినిస్టర్ ఆ విలేఖరిని చంపమని యమ్.యల్.ఎ.కి చెపుతాడు. అతను బడా(సోనూసూద్‌)కి ఈ పని అప్పచెపుతాడు. ఇదిలా ఉంటే ఒక టెలిఫోన్ కంపెనీలో పనిచేసే అమ్మాయిని కొందరు గూండాలు వెంటపడటంతో, ఆమెను వారి నుంచి కాపాడతాడు ఆంజనేయులు. అలా కాపాడిన ఆంజనేయులు ఆమెతో ప్రేమలో పడతాడు.ఆంజనేయులుని చూడటానికి సిటీకి వచ్చిన అతని తల్లిదండ్రులు తిరిగి వెళ్తూ బస్సు ప్రమాదానికి గురై, చనిపోతారు. కానీ అది బస్సు ప్రమాదం కాదనీ, ఒక విలేఖరిని చంపటానికి ఏర్పాటుచేసిన విద్రోహుల చర్య అనీ అతనికి తెలుస్తుంది. దాంతో ఆ ప్రమాదాన్ని కలిగించిన వారి గురించి కూపీలాగుతాడు ఆంజనేయులు. వారందరు చేసిన దుర్మార్గాలను సాక్ష్యాధారాలతో సహా సంపాదించి, తన తల్లిదండ్రులను చంపిన వారి మీద ఎలా పగతీర్చుకున్నాడన్నది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
దర్శకుడు పరశురామ్, హీరో రవితేజ ఇద్దరూ ఈ సినిమాని తమ శక్తి వంచన లేకుండా కష్టపడి చక్కని ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టారు. స్ర్కీన్ ప్లే బాగుంది. కథ, స్ర్కీన్‌ ప్లే, మాటలు, దర్శకత్వం నిర్వహించిన పరశురామ్ తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించాడు. రవితేజతో ట్రాజడీ చేయించటం, అది కూడా మనసులకు హత్తుకునేలా చక్కగా నటింపజేయటం అతని స్పేషాలిటీ. హాస్పిటల్‍ సీన్లో రవితేజ కూడా చాలా బాగా నటించాడు. ఎంతసేపూ వెటకారం ఎక్కువగా కనిపించే రవితేజలో పేథటిక్ సీన్ కూడా బాగా చేయగల నటుడున్నాడని చూపాడు పరశురాం. ఇక ఈ సినిమాలో నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన -: రవితేజలో వయసు పెరుగుతున్న కొద్దీ ఎనర్జీ పెరుగుతున్నట్టుంది. ఏ యువ హీరోకీ తీసిపోని విధంగా డ్యాన్సుల్లో కానీ, ఫైట్స్ లో కానీ అతని స్పీడ్ ఉంది.ఎప్పటిలాగే అతని నటనలో యాక్టీవ్ నెస్ ఉంది. అలాగే తాను ట్రాజెడీ సీన్లో కూడా బాగా నటించగలనని రవితేజ ఈ చిత్రంలో నిరూపించాడు. నయనతార గ్లామర్ కొద్దిగా తగ్గినట్టుంది. ఆమె పాత్రకు ఆమె న్యాయం చేసింది. క్రియేటీవ్ జీనియస్ ప్రభాకర్ గా బ్రహ్మానందం నటన ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత కోట ఈ చిత్రంలో తెలంగాణా శ్లాంగ్ వాడారు. సోనూసూద్, జయప్రకాష్ రెడ్డి వారి పాత్రలకు న్యాయం చేశారు. టార్జాన్ ని ఇంతవరకూ ఒక గూండాగానే మనం చూశాం. కానీ ఈ చిత్రంలో అతనితో కూడా కామెడీ చేయించాడు దర్శకుడు పరశురామ్. రవితేజ తండ్రిగా నాజర్ బాగానే నటించాడు. సంగీతం -: థామస్‌ సంగీతం వినటానికి కొత్తగా ఉంది. పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా టైటిల్‍ సాంగ్ బాగుంది. ఒక పాటలో మాత్రం కొంచెం "నాకు ముక్క" అనే తమిళ పాట పోలికలు కనిపిస్తాయి. రీ-రికార్డింగ్ కూడా బాగుంది. కెమెరా -: నీట్‍గా ఉంది. ముఖ్యంగా పాటల్లో, ఫైట్స్ లో కెమెరా పనితనం బాగుంది. అలాగే లైటింగ్ స్కీమ్ కూడా బాగుంది. మాటలు -: ఈ సినిమాకి మాటలే హైలైట్‍. మాటలు రవితేజకి ఎలా రాయాలో అలా వ్రాశాడు పరశురామ్. ఎడిటింగ్ -: బాగుంది. యాక్షన్ -: రామ్ - లక్ష్మణ్‍ ల యాక్షన్ సీన్ల కంపోజింగ్ చాలా బాగుంది. సినిమాలోని అన్ని ఫైట్లు బాగున్నాయి. ఓ రెండుగంటల పాటు కొంచెం సెంటిమెంట్ బోల్డంత కామెడీని సర్దాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా చూడండి.