Read more!

English | Telugu

సినిమా పేరు:అడవి
బ్యానర్:విశాఖాటాకీస్
Rating:2.25
విడుదలయిన తేది:Aug 7, 2009
సినిమా షూటింగ్ నిమిత్తం ఏ వసతులూ లేని అడవి ప్రదేశానికి వెళ్తుంది ఒక చిత్రం యూనిట్‍.ఆ చిత్రం యూనిట్ లో హీరో శర్మాన్, హీరోయిన్ ఆశా, నిర్మాత మూర్తి, దర్శకుడు జె.జె., అతని అసిస్టెంట్ కాళీప్రసాద్, కెమెరామేన్ లక్ష్మణ్, అసిస్టెంట్‍ డైరెక్టర్స్ సుజన‍, సమీర ఉంటారు. వీళ్ళకి ఆ అడవిలో ఉండే సేతు ఒక గైడ్ లా ఉంటాడు.అక్కడికి వెళ్ళిన తర్వాత కెమెరా పాడవటం వల్ల, మరో కెమెరా అక్కడికి తెప్పించటానికి రెండు రోజుల సమయం పడుతుంది గనుక, సేతు అనే లోకల్‍ వ్యక్తితో కలసి ఈ యునిట్ ఆ అడవిని చూడటానికి వెళ్తారు. ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారి లేవగానే, వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళిన ఆ ఊరివాడు సేతు భయంకరంగా చంపబడి ఉంటాడు. ఇక్కడ వీళ్ళ దురదృష్టం ఏమిటంటే ఆ అడవిలో నుండి బయటకు రావటం అనేది తెలిసిన వ్యక్తి ఆ సేతు ఒక్కడే వాడే చంపబడటంతో, తిరిగి వస్తూ దారి తప్పిపోయి ఆ అడవిలో అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. తర్వాత ఆ చిత్ర నిర్మాత మూర్తి (ఇస్రత్ ఆలీ)కూడా అదే విధంగా చంపబడతాడు. తర్వాత ఆ చిత్ర దర్శకుడు జె.జె.కూడా అదే విధంగా చంపబడి ఒక చెట్టు మీద కనపడతాడు. ఎవరు చంపుతున్నారో తెలియదు. అది జంతువు పనా..? మనిషి పనా..? లేక ఏదైనా దుష్టశక్తా.? అన్న విషయం వీళ్ళకి అర్థం కాదు. ఆ దుష్టశక్తి బారి నుంచి పారిపోతూండగా ఆ చిత్రం కెమెరామేన్ లక్ష్మణ్ తీవ్రంగా గాయపడతాడు. అతను కదలలేని స్థితిలో ఉంటాడు. అతన్ని వదిలేసి పోదామంటాడు ఫైట్‍మాస్టర్ రక్కా. అతన్ని తీసుకెళ్ళాల్సిందేనని అంటాడు అసిస్టెంట్‍ డైరెక్టర్ సుజన్ (నితిన్). ఈ విషయంపై ఆ చిత్రం హీరోశర్మాన్ (గౌతమ్ రోడి)కీ ఫైట్‍మాస్టర్ రక్కా (రవికాలే)కి గొడవవుతుంది. వీళ్ళు తన్ను కోవటం చూసిన కెమెరామేన్ లక్ష్మణ్ కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. జరిగిందేదో జరిగింది మనం అందరం కలసి ఉంటే తప్ప ఈ అడవిలో నుండి బయట పడలేమని సుజన్ కొట్టుకుంటున్న వాళ్ళకి చెపుతాడు. ఆ గొడవ ఆపారనుకుంటున్నంతలో రక్కా పెద్దరాయి తీసుకుని వెనుక నుంచి హీరో తలమీద బలంగా కొడతాడు. దాంతో అతను చనిపోతాడు.అదే సమయానికి ఒక భయంకర శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చినప్పుడల్లా ఒకరు చంపబడుతుండటంతో వీళ్ళు భయంతో పారిపోతూంటారు. రక్కా మాత్రం ఆ శబ్దం వచ్చిన వేపు ఛాలెంజ్ విసురుతాడు. ఆ వెంటనే అతను కూడా దారుణంగా చంపబడతాడు. మిగిలిన నలుగురిలో హీరో అసిస్టెంట్ మిగిలిన వారి నుండి విడిపోయి తను నమ్మిన కాళీమాతను స్మరించుకుంటూ వెళుతూంటాడు. సుజన్ తో పాటు అసిస్టెంట్‍ డైరెక్టర్‌గా ఉన్న సమీర అనే అమ్మాయి వీళ్ళతో ప్రయాణం చేయలేక కొండమీద నుండి దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. హీరోయిన్ ఆశ, సుజన్ కలసి ఆ అడవి నుండి ఎలా బయటపడాలా అని ప్రయాణం చేస్తూండగా హీరో అసిస్టెంట్ కూడా మరణించటం వీళ్ళిద్దరికీ కనిపిస్తుంది. అంతమందిని చంపిన ఆ శక్తి నుండి ఎలా తప్పించుకున్నారనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
కథ గొప్పది కాదు కానీ కథనం చాలా గొప్పగా ఉంది. కనపడని శక్తేదో వీళ్ళందర్నీ చంపుతుందని దర్శకుడు చూపించిన విధానం బాగుంది. చివరి వరకూ వీళ్ళందర్నీ ఎవరు చంపుతున్నారో తెలియక ఈ సినిమా చూసే ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించటంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడు. ఈ సినిమాలో హీరో అహంకారంతో తన అసిస్టెంట్‍ మీద జులుం ప్రదర్శించటం, ఒక సందర్భంలో అసిస్టెంట్ హీరో మీద తిరగబడటం, ఫైట్‍మాస్టర్ రక్కాకి హీరో మీద షూటింగ్ సమయంలో కసి పెరగటం, దాంతో హీరో మీద అతను ప్రతీకారం తీర్చుకున్న విధానం, వీళ్ళందరి కోసం కెమెరామేన్ లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకోవటం, హీరో అసిస్టెంట్‍ తను నమ్మిన కాళీ మాతను స్మరించుకుంటూ వెళ్ళి బలవ్వటం, ఇలా ఒక్కొక్కరి మనోభావాలను సగటు మనిషి ఎలా భావిస్తాడో అలా చూపించటం దర్శకుడు మానవీయ భావాలను బాగా స్టడీ చేశాడని అర్థం అవుతుంది. వీటన్నిటికీ మించి చావు కళ్ళ ముందు కనపడితే ఎవరికైనా సరే భయం కలగటం కామన్ అనే విషయాన్నిచాలా బాగా చూపించాడు దర్శకుడు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన-: హీరో నితిన్ ఇంత బ్యాలెన్స్డ్ డ్ గా మరే చిత్రంలోను నటించలేదేమో. అతని నటనలో చక్కని పరిణితి కనిపించింది. ఏ సీన్ కి ఎంత వరకూ రియాక్ట్ అవ్వాలో అతను అంతవరకే రియాక్టవ్వటం బాగుంది. హీరోయిన్ ప్రియాంక నటనలో కొంత అసహజత్వం అక్కడక్కడా కనిపిస్తుంది. హీరో పాత్రధారి కూడా బాగానే నటించాడు. నిర్మాత మూర్తి పాత్రధారి "అయ్యోడ"మేనరిజం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం-: ఒక పాటకు మాత్రం కాపీ ట్యూన్ చేశారు. మిగిలిన పాటలన్నీ నేటి కాలానికి తగ్గట్టు బాగున్నాయి. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవలసిన అంశాల్లో ఒకటి రీ-రికార్డింగ్. ఇది ఈ చిత్రానికి ప్రాణం పోసింది. ఈ చిత్రంలో ఎఫెక్టులు కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ-: చాలా బాగుంది. ముఖ్యంగా స్టడీ కామ్ కెమెరా, జిమ్మీ జిప్ కెమెరాల పనితనం అద్భుతంగా ఉంది. ఇండియన్ సినిమా హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోదని ఇప్పటికే చాలా సినిమాలు రుజువు చేస్తూనే ఉన్నాయి. ఈ చిత్రం కూడా కెమెరా విషయంలో ఆ స్థాయిలోనే ఉంది. ఎడిటింగ్-: నీట్‍గా ఉంది. యాక్షన్-: యాక్షన్ అంటే ఫైట్లతో ఏదో గందరగోళం చేయటం కాకుండా, ఈ సినిమాలో సీన్ డిమాండ్‌ని బట్టి యాక్షన్ ఉంది. ఇది కొత్తగా బాగుంది. ఇది ముఖ్యంగా సస్పెన్స్ మరియూ హారర్ సినిమాలు ఇష్టపడే వారి కోసం తీసిన చిత్రం.సాంకేతిక పరంగా ఉన్నతమైన విలువలతో కూడిన ఈ చిత్రం బాగుం