Read more!

English | Telugu

సినిమా పేరు:ఆకాశమంత
బ్యానర్:శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Mar 27, 2009
చాలా సింపుల్‍ కథ. ఒక ఆడపిల్లను కని, పెంచిన తండ్రి, ఆ ఆడపిల్లపై విపరీతంగా పెంచుకునే ప్రేమ, ఆ పిల్ల వేరే ఎవరినో ప్రేమిస్తుందని తెలిసి, అతను తన కూతురికి సరైన వాడేనా, అన్న అనుమానం ఆ తండ్రిని కుదురుగా ఉండనీయదు. అలాంటి పరిస్థితుల్లో ఆ తండ్రి ఎలా ప్రవర్తిస్తాడు...ఎలా ఆలోచిస్తాడనేదే ఈ చిత్ర కథ. రఘురామ్ (ప్రకాష్ రాజ్‍) మార్నింగ్ వాక్‌కి వెళ్ళినప్పుడు, సుధాకర్ (జగపతిబాబు) అనే ఒక తండ్రి తన కూతుర్ని పార్కులో ఆడిస్తూంటే, రఘురామ్‌కి తన కూతురితో ఉన్న అనుబంధం గుర్తుకు వచ్చి, సుధాకర్‌కి తన గురించీ, తన కూతురు అభి (త్రిష) గురించీ చెప్పటంతో సినిమా మొదలవుతుంది. తన కూతురు పసి బిడ్డగా ఉన్నప్పటి నుంచీ, ఆమె పెళ్ళి అయ్యేవరకూ జరిగిన సంఘటలనూ, ఒక తండ్రిగా తన అనుభవాలనూ సుధాకర్‌తో సవివరంగా చెపుతాడు. తన కూతురిని తొలిసారి స్కూల్లో చేర్పించేటప్పుడు తానెంతగా ఏడ్చాడో, అలాగే తన కూతురు సైకిల్‍ మీద స్కూల్‍కెళతానన్నప్పుడు తానెంతగా భయపడ్డాడో, అలాగే తన కూతురికి ఢిల్లీలో యమ్‌‍.బి.ఎ.లో సీటు వచ్చినప్పుడు ఇంకెంత కంగారు పడ్డాడో, ఆ తర్వాతతన కూతురు ఒక సర్దార్జీని ప్రేమించానని చేప్పినప్పుడు తానెంత కంగారు పడ్డాడో, తన కూతురి పెళ్ళి బ్రహ్మాండంగా చేద్దామనుకుంటే, రిజిస్ట్రార్‍ ఆఫీసులో కూతురు పెళ్ళి చేసుకుంటానన్నప్పుడు ఎలా ఫీలయ్యాడో, తర్వాత తానెలా సర్దుకున్నాడో అన్నీ సుధాకర్‌కి వివరంగా చెపుతాడు రఘురామ్‌‍. ఈ చిత్రం కథగా ఇంతే.
ఎనాలసిస్ :
ఇదొక ఫీల్‍ గుడ్ మూవీ. ఏ అసభ్యతా, అశ్లీలతా, హింస లేకుండా చక్కగా కుటుంబం మొత్తం కూర్చుని హ్యాపీగా చూసేలా ఈ సినిమాని దర్శకుడు రాధామోహన్ మలచారు. సినిమా అక్కడక్కడ కొంచెం సాగతీసినట్లనిపించినా, సగటు ప్రేక్షకుడికి అది పెద్దగా ఇబ్బంది పేట్టదు. ఈ సినిమా గురించి చేప్పాలంటే ఒక జీవితంలో తండ్రి యొక్క ప్రయాణం అని చెప్పాలి. తండ్రి తన కూతురి కోసం అనుక్షణం పడే తపన, తన కూతురు సుఖంకోసం పడే తాపత్రయం చక్కగా చూపించాడు దర్శకుడు. ఒక్కోసారి కొంచెం ఎక్కువేమో అనిపించినా ప్రేక్షకులకు ఏ మాత్రం ఇబ్బంది కలుగని రీతిలోనే ఈ చిత్రాన్ని రూపొందించారు. స్క్రీన్‌ప్లే బాగుంది. ఇక నటుడిగా ప్రకాష్ రాజ్‍ గురించి మళ్ళీ కొత్తగా చెప్పటం అనవసరం. ఐశ్వర్య కూడా బాగా నటించింది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
కెమెరా:- చూడచక్కని ఒక అందమైన దృశ్యకావ్యంలా, ఈ చిత్రాన్ని మన కనులకు బహుచక్కని విందులా మనకందించారు సినిమాటోగ్రాఫర్ ప్రీత. ప్రతి ఫ్రేం ఎంతో సుందరంగా ఉంది. ఎక్సలెంట్‍ కెమెరా వర్క్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సంగీతం:- బాగుంది. పాటలు బాగానే ఉన్నాయి. కానీ పాటల కన్నా రీ-రికార్డింగ్ మాత్రం చాలా బాగుంది. ఎడిటింగ్:- బాగుంది. ఆర్ట్:- బాగుంది. మాటలు:- సందర్భోచితంగా ఉండి చక్కని పంచ్ డైలాగులతో ప్రేక్షకులను అలరిస్తాయి. పాటలు:- చక్కని సాహిత్య విలువలతో బాగున్నాయి. ఏ ఇబ్బంది లేకుండా సకుటుంబంగా సంతోషంగా ఓ రెండుగంటలు గడపాలనుకుంటే ఈ చిత్రం చూడండి.