Read more!

English | Telugu

సినిమా పేరు:ఆకాశ రామన్న
బ్యానర్:మన్యం ఎంటర్ టైన్ మెంట్‍
Rating:2.25
విడుదలయిన తేది:Mar 12, 2010
ఈ కథ కేవలం ఓ నలభై నిమిషాలలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొ౦దించబడిన స్క్రీన్ ప్లే ప్రధానమైన కథ. రాణా( అల్లరి నరేష్) కి తన గర్ల్ ఫ్రెండ్ ఇషా (గౌరీ పండిట్) కి ఇవ్వడం కోసం అత్యవసరంగా 5 లక్షల రూపాయల అవసరం ఏర్పడుతుంది. అతని ఫ్రెండ్, ఓ సూపర్ మార్కెట్ ఓనర్ అయిన జై (శివాజీ) కి ఫోన్ చేసి అతనిని డబ్బులడుగుతాడు. కానీ జై కి కూడా 5 లక్షల రూపాయల అవసరం ఏర్పడుతుంది. ఇదిలా ఉండగా తేజ (రాజీవ్ కనకాల) ఫుల్లుగా మందుకొట్టి కారులో వెళుతుండగా దారిలో ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేస్తాడు. అతన్ని పోలీసు ఇన్ స్పెక్టర్ (రావు రమేష్) అదుపులోకి తీసుకుంటాడు. ఆ తర్వాతేం ఏం జరిగి౦దన్నదే మిగతా కథ.
ఎనాలసిస్ :
ఖచ్చితంగా ఇది స్క్రీన్ ప్లే ప్రధానమయిన చిత్రం. పగడ్భందీ స్క్రీన్ ప్లే తో దర్శకుడు ఈ చిత్రాన్ని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు. ఫస్టాఫ్ అంతా గజిబిజిగా సాగిపోయినా ప్రేక్షకులకు సినిమాలో లీనమయిపోయే విధంగా స్క్రీన్ ప్లే సాగిపోతుంది. అదే సెకండ్ ఆఫ్ దగ్గరికి వచ్చే సరికి క్రమంగా కథలో పట్టు కోల్పోవడం మొదలవడంతో ప్రేక్షకులు అసహనానికి గురయ్యే విధంగా సాగిపోతు౦ది. సెకండాఫ్ కథపై మరింత శ్రద్ధ కనబరిస్తే బావుండేదనిపిస్తుంది. ఇక వేణు మాధవ్ ఎపిసోడ్ లో వచ్చే సీన్స్ కామెడీ కోసం పెట్టినా, చూసేవారికి మాత్ర౦ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఈ కథకి వేణుమాధవ్ క్యారెక్టర్ లేకపోయినా నష్టం లేదనిపిస్తుంది. మొత్తానికి దర్శకుడు అశోక్ చేసిన ఈ ప్రయత్నం అభినదించదగ్గదే అయినప్పటికీ కథపై మరింత శ్రద్ధ కనబరిస్తే బావుండేదనిపిస్తుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన :- అల్లరి నరేష్ ఎనర్జిటిక్ గా నటించాడు. అతనికి ఇలాంటి క్యారెక్టర్స్ కొట్టినపిండిలాంటివే శివాజీ:- శివాజీ నటన కూడా కూడా ఫర్వాలేదు. తన క్యారెక్టర్ కి తగ్గట్టుగా చేసాడు.రాజీవ్ కనకాల:- రాజీవ్ కనకాల నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా కారు యాక్సిడెంట్ గురయినప్పుడు ఆయన పలికించిన హావభావాలు బావున్నాయి.మీరాజాస్మిన్:- మీరాజాస్మిన్ నటన కాస్త ఓవర్ గా అనిపింస్తుంది.గౌరీ పండిట్:- ప్రేమికులని మోసం చేసే క్యారెక్టర్ లో గౌరీ పండిట్ బాగానే చేసింది.నాగబాబు:- నాగబాబు నటన బాగుంది. ఎడిటింగ్:- పూడి ప్రవీణ్ కుమార్ చక్కగా ఎడిటింగ్ చేసాడు. తనకిది మొదటి చిత్రమే అయినా ఆ ఛాయలు కనిపించకుండా చాలా నేర్పు కనబరిచాడు.సంగీతం:- చక్రి సమకూర్చిన సంగీతం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్. ముఖ్యంగా రీ-రికార్డింగ్ చాలా బావుంది.స్క్రీన్ ప్లే బేస్ డ్ సినిమాలకి రీ-రికార్డింగ్ ప్రధానం కాబట్టి దానికి తగట్టుగా రీ-రికార్డింగ్ అందించాడు చక్రి.మాటలు:- శేఖర్ అందించిన మాటలు బావున్నాయి. సన్నివేశాలకి తగ్గట్టుగా మాటలని అందించాడు.దర్శకత్వం:- అశోక్ ఈ చిత్రాన్ని ఓ హాలీవుడ్ సినిమాలా తీర్చిదిద్దడానికి ఎంతో శ్రమించాడని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. ముఖ్యంగా ఎంతో పగడ్బందీగా స్క్రీన్ ప్లేని తయారు చేసుకోవడంలో ఆయన సక్సెస్ సాధించారు. అయితే సెకండాఫ్ కథలో కొన్ని లోపాలు మినహా అశోక్ దర్శకత్వం చాలా చక్కగా ఉందిసస్పెన్స్ చిత్రాలని చూసే వారు ఈ చిత్రాన్ని చూడొచ్చు.