Read more!

English | Telugu

సినిమా పేరు:ఆదికేశవ
బ్యానర్:సితార ఎంటర్ టైన్మెంట్స్
Rating:2.00
విడుదలయిన తేది:Nov 24, 2023

సినిమా పేరు: ఆదికేశవ 
తారాగణం: వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, అపర్ణా దాస్,సుమన్  రాధికా, సదా,సుధా ,తనికెళ్ళ భరణి తదితరులు 
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్. రెడ్డి
బ్యానర్: సితార ఎంటర్ టైన్మెంట్స్ 
నిర్మాతలు:నాగవంశీ, సాయి సౌజన్య
సినిమాటోగ్రఫీ:  డడ్లీ
విడుదల తేదీ:నవంబర్ 24 

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన గత రెండు చిత్రాలు పరాజయం పాలవ్వడంతో ఈ ఆదికేశవ పైన మెగా అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. పైగా వైష్ణవ్ కి ఇదే మొదటి మాస్ మూవీ కావడంతో అటు ప్రేక్షకుల్లో కూడా  వైష్ణవ్  ఆ క్యారెక్టర్ కి  సూట్ అవుతాడా లేదా  అలాగే మెగా మేనల్లుడుకి హిట్ వస్తుందా అని అందరు భావించారు. మరి వాళ్ళ ఆశలు నెరవేరాయా లేదో చూద్దాం.

కథ:

రాయలసీమలోని ఒక ప్రాంతంలో చెంగారెడ్డి అనే ఒక ఫ్యాక్షనిస్టు కట్నంకింద  మామగారు ఇచ్చిన గనుల్లో  అక్రమ మైనింగ్ కి పాల్పడుతుంటాడు.చిన్నపిల్లల చేత వాటికి సంబంధించిన పనుల్ని చేయిస్తుంటాడు .చెంగారెడ్డి ని ఎవరు ఏమి చెయ్యలేరు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని అత్యంత క్రూరంగా చంపుతాడు.ఇంకో పక్క హైదరాబాద్ లో బాలు ( వైష్ణవ్ తేజ్)ఎలాంటి ఉద్యోగం చెయ్యకుండా సరదాగా ఫ్రెండ్స్ తో  తిరుగుతుంటాడు. కానీ తన కళ్ళ ముందు చిన్నపిల్లలని ఎవరైనా అంటే మాత్రం వాళ్ళని చంపడానికి వెనుకాడడు. ఈ క్రమంలో తన తల్లి కోరిక ప్రకారం బాలు ఉద్యోగం లో జాయిన్ అవుతాడు. ఆ కంపెనీ సిఈఓ చిత్రావతి (శ్రీలీల) బాలు ఒకరి భావాలు ఒకరికి నచ్చడంతో ప్రేమించుకుంటారు. ఇంకో పక్క చెంగారెడ్డి ఆగడాలు ఎక్కువయిపోతాయి. చెంగారెడ్డి ఆగడాలని ఎప్పడికప్పుడు ఎదిరించే అతని చిన్న మామ ఎంఎల్ఏ అయిన మహాకాళేశ్వరరెడ్డి చనిపోవడంతో బాలు రాయలసీమకి వెళ్లి చెంగారెడ్డి ని ఎదిరించాలసి వస్తుంది. ఇదే ఈ సినిమా కథ..అసలు బాలు అక్కడకి ఎందుకు వెళ్ళాలసివచ్చింది?రాయలసీమకి బాలుకి సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.


ఎనాలసిస్ :

ఈ కథ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న కథ. సినిమా చూస్తున్నంత సేపు చాలా సీన్స్ మనం ఇంతకు ముందు చాలా సినిమాల్లో చూసామే  అనే ఫిలింగ్  కలుగుతుంది. ఈ సినిమాకి ఉన్న ప్లస్ పాయింట్ ఏమిటి అంటే ఫొటోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా ఉండి సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేసింది

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఇక నటి నటుల విషయానికి వస్తే ..ఈ సినిమా పాత కథ అయినా కూడా ఆ విషయం ప్రేక్షకులకి తెలుస్తున్నా కూడా సినిమాని బోర్ కొట్టకుండా నిలబెట్టింది ఈసినిమాలో నటించిన ఆర్టిస్టులే..వైష్ణవ్ తేజ్ తాను చేసిన పాత్ర పరిధి మేరకు చాలా చక్కగా నటించాడు. మాస్ పాత్రలో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. శ్రీలీల తన నటనలో ఉన్న ఇంకో కొత్త కోణాన్ని ప్రేక్షకులకి తెలియచేసింది. అలాగే  సీనియర్ నటి  రాధికా వైష్ణవ్ తల్లి క్యారక్టర్ లో చాలా చక్కగా చేసింది. ఈ సినిమా తర్వాత ఆవిడ  తెలుగు సినిమాల్లో బిజీగా  కూడా మారవచ్చు. సుమన్ ,తణికెళ్లభరణి,మాజీ హీరోయిన్ సదా లు కూడా చాలా సెటిల్ల్డ్ పెర్ఫార్మన్స్ తో సినిమాకి హెల్ప్ అయ్యారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సాంగ్స్ కూడా పర్లేదు


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఈ ఆదికేశవ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇలాంటి  కథలు ఇప్పుడు అంతగా వర్క్ అవుట్ అవ్వవు. కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో ఇప్పటి మనుషుల మైండ్ అంతకంటే ఎక్కువుగా పరుగెడుతోంది. మనిషి ప్రస్తుతం నడుస్తున్న కంప్యూటర్ యుగంలో తన ఆలోచన స్థాయిని పెంచుకున్నాడు. ఇలాంటి టైం లో ఎప్పుడో 10  సంవత్సరాల క్రితం రావలసిన సినిమా ఇప్పుడొచ్చిందేమో అని అనిపిస్తుంది. సినిమా చివరలో ఇచ్చిన  ఒక ట్విస్ట్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది . ఆ ట్విస్ట్ ఈ సినిమాని  కొన్ని రోజులు కాపాడవచ్చు.

 

- అరుణా చలం