Read more!

English | Telugu

సినిమా పేరు:1940 లో ఒక గ్రామం
బ్యానర్:లక్ష్మీ నరసింహా సినిమా
Rating:3.00
విడుదలయిన తేది:Apr 16, 2010
సరిగ్గా కంటిచూపు కూడా లేని ధనికుడైన ముసలి బ్రాహ్మణుడు దీక్షుతులు (ముక్కురాజు ) తో చాలా చిన్న వయస్కురాలైన సుశీల (శ్రీ రమ్య) వివాహం జరుగుతుంది. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన సుశీల కి ఆ ముసలి భర్త తో నిరాశే మిగులుతుంది. ఒక రోజు పూజ చేయడానికి గోదావరి దగ్గరికి వెళ్ళిన సుశీల కి తన ఈడు వాడైన అట్టడుగు కులానికి చెందిన సూరి (బాలాదిత్య) తో పరిచేయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్తా సహజీవనానికి దారితీస్తుంది. సుశీల ఒక బిడ్డ కు తల్లయిన సంగతి తెలుసుకున్న అగ్రహారం వారు ఆమెను చీకటి గదిలో బంధించి సూరిని ఊరు నుంచి బహిష్కరిస్తారు. ఆ తరువాత సూరి, సుశీల ఒక్కటి ఎలా అయ్యారు, సూరి బ్రాహ్మణుడిగా ఎలా మారాడు, అన్నది మిగతా కధ.
ఎనాలసిస్ :
దర్శకుడు ఈ చిత్రం తెరకెక్కిచడంలో చాలా జాగ్రతలు తీసుకున్నాడు. ప్రతి చిన్న సన్నివేశాన్ని నేచురల్ గా చిత్రీకరించారు. సెంకడ్ ఆఫ్ లో ప్రతి కులం వారికీ మరొక కులం వారితో అవసరం తప్పని సరిగా వుంటుంది అనే సందేశాన్ని ఇవ్వడం బాగుంది. సుశీల బాలాదిత్య తో "నిన్ను విడవవలసి వస్తే నా ఆత్మని నీకిచ్చి వెళ్తా...." అనే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది. "పూలతో స్నేహం ఎందుకురా.. ఒక్కొక్కసారి విచ్చుకుంటాయి... ఒక్కోసారి ముడుచుకుంటాయి, అదే ముళ్ళతో స్నేహం చేస్తే ఒక్కసారి గుచ్చుకున్నా... మరోసారి ఆ బాధ వుండదు" అని బాలాదిత్య స్నేహితులతో చెప్పే సన్నివేశం బాగుంది. సెంకడ్ ఆఫ్ ని దర్శకుడు కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది. 1940 నాటి పల్లెటూరి వాతావరణాన్ని, గోదావరి అందాలని, అగ్ర కులాల, అట్టడుగు కులాల వారి మాటల్లో యాస ని చక్కగా తెరకెక్కించారు. ఇంటర్వెల్ తర్వాత సినిమా స్లో కాకుండా జాగ్రత్త పడి వుంటే బాగుండేది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
నటన:బాలాదిత్య: ఇంతవరకు పోషించిన పాత్రలకు భిన్నంగా బాలాదిత్య ఈ చిత్రంలోని అట్టుడుగు కులానికి చెందిన వాడిలా పాత్రోచితంగా నటించాడు. కొన్ని సన్నివేశాలలో అతని సంభాషలు అందరిని ఆకట్టుకుంటాయి. శ్రీ రమ్య : సుశీల గా శ్రీ రమ్య నటన చుస్తే కొత్త అమ్మాయి ఇంత బాగా నటించిందా అనే సందేహం కలుగుతుంది. అంత చక్కగా హావ భావాలను పలికించింది. ముక్కురాజు : ముక్కురాజు నటన ఈ చిత్రానికి హైలెట్, తన పాత్రలో జీవించారు అని చెప్పవచ్చు. రాళ్ళపల్లి : హీరో తండ్రిగా, అట్టడుగు కులానికి చెందిన వాడిగా ఈ చిత్రం లో రాళ్ళపల్లి నటన చాలా బాగుంది.సాకేత్ సాయిరాం : చిత్రానికి తగ్గట్టుగా చక్కని సంగీతం దించారు.మోహనరెడ్డి: కెమెరా మాన్ పని తీరు ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ కూడా వారి పరిమితి మేరకు తగ్గట్టుగా చేసారు. చూడతగ్గ చిత్రం, అవార్డు సినిమాలు చూసేవారికి చాలా బాగా నచ్చుతుంది.