Read more!

English | Telugu

సినిమా పేరు:16 డేస్
బ్యానర్:కాస్మోస్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై. లి.
Rating:---
విడుదలయిన తేది:Feb 20, 2009
పావలా యాదగిరి (కోట శ్రీనివాసరావు), రామిరెడ్డిలు ఇద్దరూ బద్ధ శత్రువులు, ఇళ్ళల్లో నుండి బయటికి రాకుండా ఎదురెదురు ఇళ్లల్లోనే ఉంటూంటారు. యాదగిరిని చంపాలని రామిరెడ్డి, రామిరెడ్డిని చంపాలని యాదగిరి స్కెచ్‌ వేస్తూంటారు. ఈ క్రమంలో యాదగిరి కొడుకుని రామిరెడ్డి మనుషులు హత్య చేస్తారు. ఇది భరించలేకపోతారు యాదగిరి. 16 రోజులో తన కొడుకు పెదకర్మ జరిపే లోపు రామిరెడ్డి కొడుకుని చంపించాలని ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ని రంగంలోకి దించుతాడు. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్న రామిరెడ్డి యాదగిరి నియమించిన ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ని చంపేసి ఆ ఫోటోలి యాదగిరికి పంపుతుంటాడు. ఇలా ఉండగా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ పెద్ద బిజినెస్‌ మ్యాన్‌ కావాలనే ఆశతో వచ్చిన గుత్తి గురుమూర్తి (అరవింద్‌) యాదగిరి దృష్టిలో పడతాడు. అతనిలో ఉన్న టాలెంట్‌ని గుర్తించి రామిరెడ్డి కొడుకుని 16 రోజుల్లోగా చంపాలని యాదగిరి గురుమూర్తికి హుకుం జారీ చేస్తాడు. లేదంటే 17వ రోజు గురుమూర్తి ప్రాణాలతో ఉండడని హెచ్చరిస్తాడు. ఈ క్రమంలో తాళం వేసి ఉన్న ఇంట్లో జొరబడి పబ్బం గడుపుకునే ఇంజు (ఛార్మీ) అతనికి తారసపడుతుంది. గురుమూర్తి పరిస్థితిని తెలుసుకుంటుంది ఇంజు. ఇంజు ప్రొద్భలంతో చివరికి గురుమూర్తి యాదగిరి, రామిరెడ్డిల భారి నుంచి ఎలా తప్పించుకున్నాడన్నదే మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రభు సాల్మన్ ఓ ప్రయోగం చేశాడనే చెప్పాలి. భాస్కరభట్ల సాహిత్యం, ధరన్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. బాల కేమేలా పనితనం కూడా బావుంది. గురుమూర్తి అరవింద్ నటన బావుంది. కొత్తవాడైనా ఎంతో అనుహవం ఉన్నవాడిలా చాలా బాగా నటించాడు. ఇక ఇంజు ఉరఫ్ ఏంజిల్ గా కనిపించిన ఛార్మీ నటన ఆకట్టుకుంటుంది. అయితే ఆమె చేసిన క్యారెక్టర్ చాలా కృత్రిమంగా కనిపిస్తుంది. అయితే జూనియర్ యన్టీఆర్, పవన్ కళ్యాణ్ లని ఇమిటేట్ చేస్తూ ఛార్మీ చేసినయాక్టింగ్ ఆకట్టుకుంటుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఓ డిఫరెంట్ సినిమా చూడాలనుకునే వారు ఈ చిత్రాన్ని చూడొచ్చు.