Read more!

English | Telugu

సినిమా పేరు:100 % లవ్
బ్యానర్:గీత ఆర్ట్స్
Rating:3.00
విడుదలయిన తేది:May 6, 2011

పవిత్ర ప్రేమను ప్రపంచంలో ఏ శక్తీ విడదీయలేదని చాటిచెప్పే కథతో ఈ సినిమా తీశారు. అందుకు అందమైన బావమరదళ్ళను ఎంచుకున్నాడు సుకుమార్. బావమరదళ్ళ మధ్య సాగే ఇగోలతో కూడిన ప్రేమ కథ. బాలు (నాగచైతన్య)కు తానే నంబర్ వన్ గా ఉండాలనే మనస్తత్వం. అంతే కాక కాస్త బలుపు కూడా ఎక్కువే అతనికి.


ఎనాలసిస్ :

పవిత్ర ప్రేమను ప్రపంచంలో ఏ శక్తీ విడదీయలేదని చాటిచెప్పే కథతో ఈ సినిమా తీశారు. అందుకు అందమైన  బావమరదళ్ళను ఎంచుకున్నాడు సుకుమార్. బావమరదళ్ళ మధ్య సాగే ఇగోలతో కూడిన ప్రేమ కథ. బాలు (నాగచైతన్య)కు తానే నంబర్ వన్ గా ఉండాలనే మనస్తత్వం. అమతే కాక కాస్త బలుపు కూడా ఎక్కువే అతనికి. బాలు తండ్రి రమేష్ తన మేనకోడలు మహలక్ష్మిని పల్లెటూరి నుంచి తన ఇంటికి తీసుకు వచ్చి బాలు చదివే కాలేజీలోనే చేరుస్తాడు. బాలు, మహలక్ష్మి ఇద్దరూ చదువులో పోటీపడుతూంటారు. 

అదే కాలేజీలో చదివే అజిత్ ను మించటానికి బాలు, మహలక్ష్మి ఏకమవుతారు. బాలు నంబర్ వన్ కావటానికీ, అజిత్ ను దెబ్బతీయటానికీ మహలక్ష్మి అజిత్ కి ఐ లవ్ యూ అని చెపుతుంది. కానీ తనను కాకుండా అజిత్ గ్రేట్ అని ఆమె చెప్పటం నచ్చని బాలు ఆమెను పార్టీలో అందరి ముందు అవమానించి ఇంట్లోంచి వెళ్ళిపొమ్మంటాడు.

 

వీళ్ళిద్దరికీ పెళ్ళిచేయాలనుకునే వీళ్ళ బామ్మకి అనారోగ్యం రావటంతో పరామర్శించటానికి మళ్ళీ మహలక్ష్మి వస్తుంది. బాలు తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందని అబద్ధం చెప్పటంతో, అహం దెబ్బతిన్న మహాలక్ష్మి, అజిత్ ను పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత తాతయ్య, బామ్మలతో వీళ్ళు చెప్పే అబద్ధాలూ, బాలు ఒక డీల్ విషయంలో రిస్క్ చేసి నష్టపోయే పరిస్థితిలో మహాలక్ష్మి అతన్ని ఆదుకోవటం. ఇలా సాగే సినిమా చివరికి ఏ మలుపు తిరుగుతుందనేది మిగిలిన కథ.

విశ్లేషణ -  దర్శకుడిగా సుకుమార్ మరోసారి విజృంభించాడని చెప్పాలి. "ఆర్య" తర్వాత ఈ లెక్కల పంతులు లెక్క ఈ సినిమాలో సరిపోయిందని చెప్పాలి. స్క్రీన్ ప్లే చాలా నీట్ గా ఉంది. బావమరదళ్ళ మధ్య ఉండే ఇగోలూ,  ఇగోలు ఉన్నా కూడా వాళ్ళ మధ్య అంతర్లీనంగా ఉండే ప్రేమాభిమానాలు అనే చిన్న పాయింట్ తీసుకుని దాన్ని చాలా బాగా కన్విన్సింగ్ గా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు సుకుమార్. అనుమానం అక్కర్లేదు ఇది హిట్టే. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
నటన - నాగచైతన్య ఈ సినిమాలో కొత్తగా కనిపించటమే కాక నటనలో కూడా పరిణితి కనబరచాడు. కాకపోతే ఎమోషనల్ డైలాగ్ చెప్పే సమయంలో మాడ్యులేషన్ ఇంకాస్త బాగుంటే బాగుండేది. భాష స్పష్టంగా పలకటంలో కూడా నాగచైతన్య ఇంకా కాస్త జాగ్రత్త పడాలి. ఇక తమన్నా భాటియా భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అవుతుందనటంలో సందేహం లేదు. విజయకుమార్, కె.ఆర్.విజయ సీనియర్ నటీనటులనిపించారు. ఈ సినిమాలో సెంటిమెంటుని వాళ్ళ భుజాల మీద మోశారు.  

 సంగీతం - పాటలన్నీ బాగున్నా "దుడ్డు కావాలన్నాడూ-దుబాయ్ నన్ను పంపాడూ" అనే మాస్ పాట, "ఎ స్క్వేర్ బి స్క్వేర్" అనే పాట జనానికి బాగా నచ్చుతాయి. రీ-రికార్డింగ్ కూడా బాగుంది.
సినిమాటోగ్రఫీ - చాలా బాగుంది. ముఖ్యంగా పాటల్లో ఇంకా బాగుంది.
పాటలు - నేటి యువతరానికి నచ్చే విధంగానే ఈ చిత్రంలోని పాటల్లోని సాహిత్యం ఉంది. "దుబాయ్ నన్ను పంపాడూ" పాటల్లో డబుల్ మీనింగులున్నా జనం బాగా ఎంజాయ్ చేయటం విశేషం.
మాటలు - ఫరవాలేదు. అక్కడక్కడ మంచి పంచ్ లున్నాయి.
ఎడిటింగ్ - బాగుంది.
ఆర్ట్ - బాగుంది. ఇంటీరియర్ డెకరేషన్ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉండేలా కెమెరాతో ఆర్ట్ పోటీపడింది. సినిమాని కన్నుల పండుగ్గా చూపించింది.
కొరియోగ్రఫీ - బాగుంది.
యాక్షన్ - ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక యాక్షన్ సీన్ సింపుల్ గా ఉండి బాగుంది.
 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

చక్కని స్క్రీన్ ప్లే తో ఆద్యంతం బోర్ కొట్టకుండా ఉండటమ వల్ల, యువతకు కావలసిన ప్రేమ, ఆకర్షణలను బాగా చూపించటం వలన ఈ సినిమా యూత్ కి బాగా నచ్చుతుంది. అలాగే యువతరానికే కాకుండా కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. అసభ్యత, అశ్లీలత లేని ఈ సినిమాని సకుటుంబంగా చూసి ఆనందించవచ్చు.