English | Telugu

తండేల్ ఓటిటి రిలీజ్ డేట్ ఇదే..ఐదు భాషల్లో రాజులమ్మ జాతరే 

తండేల్ ఓటిటి రిలీజ్ డేట్ ఇదే..ఐదు భాషల్లో రాజులమ్మ జాతరే 

యువసామ్రాట్ నాగ చైతన్య(Naga chaitanya)సాయిపల్లవి(Sai Pallavi)కాంబోలో ఫిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్(Thandel)మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ ని తీసుకొచ్చింది.నాగచైతన్య కెరీరి లోనే ఫస్ట్ టైం 100 కోట్లకి పైగా సాధించిన మూవీగా నిలిచి సరికొత్త రికార్డులని నెలకొల్పింది.నాగార్జున సైతం  తండేల్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతు,చాలా రోజుల తర్వాత విజయోత్సవ సభకి  వచ్చానని చెప్పడం జరిగింది.ఆయన మాటల్ని బట్టి 'తండేల్' ఎంత స్పెషల్ మూవీనో అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఈ మూవీ ప్రేక్షకులకి మరింత చేరువయ్యేలా 'ఓటిటి' వేదికగా మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.'తండేల్' ఓటిటి హక్కులని దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్(Netflicx)అధికారకంగా ఈ విషయాన్నీ వెల్లడి చెయ్యడంతో పాటుగా,చిత్ర బృందం కూడా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ వెల్లడి చేసింది.శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల కుటుంబానికి చెందిన రాజు, అదే వర్గానికి చెందిన సత్య ప్రేమించుకుంటారు. జీవనోపాధి కోసం చేపల వేటకి సముద్రంలోకి వెళ్లిన రాజు తిరిగి రాగానే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ రాజుని పాకిస్థాన్ కి చెందిన నేవి అధికారులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతారు.రాజు అక్కడ్నుంచి ఎలా బయటకి వచ్చాడు?రాజు కోసం సత్య ఏం చేసింది? సత్య, రాజు చివరికి కలిసారా లేదా? అనేదే ఈ చిత్ర కథ 

రాజు,సత్య క్యారక్టర్ లలో నాగ చైతన్య, సాయి పల్లవి అత్యద్భుతంగా నటించారు. తమ కోసమే ఆ క్యారెక్టర్స్ పుట్టాయా అనేంతలా జీవించారని కూడా చెప్పుకోవచ్చు.గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్(Allu Aravind)బన్నీ వాసు నిర్మించగా, ప్రేమమ్, కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి(Chandu Mondeti)దర్శకత్వాన్ని అందించాడు.దేవిశ్రీప్రసాద్(Devisriprasad)అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా తండేల్ కి సరికొత్త రూపాన్ని తీసుకొచ్చాయి.సాంగ్స్ అయితే ఇప్పటికి మారుమోగిపోతున్నాయి.మరి ఈ నెల 7 న తండేల్ చూసి ఎంజాయ్ చెయ్యండి.తెలుగుతో పాటు తమిళ,మలయాళ,కన్నడ,హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

 

 

తండేల్ ఓటిటి రిలీజ్ డేట్ ఇదే..ఐదు భాషల్లో రాజులమ్మ జాతరే