English | Telugu

పవన్ కళ్యాణ్ ఇద్దరు కొడుకులు ఒకే చోట.. పిక్స్ వైరల్ 

పవన్ కళ్యాణ్ ఇద్దరు కొడుకులు ఒకే చోట.. పిక్స్ వైరల్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఈ నెల 24 న చారిత్రాత్మక మూవీ 'హరిహరవీరమల్లు'(Hari Hara veeramallu)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఐదు సంవత్సరాల నుంచి వీరమల్లు షూటింగ్ ని జరుపుకోవడంతో పాటు, రిలీజ్ ఎన్నోసార్లు వాయిదా పడింది. దీంతో వీరమల్లుపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో పెద్దగా హైప్ లేకుండా పోయింది. కానీ ట్రైలర్ రిలీజ్ తో ఒక్కసారిగా వీరమల్లు పై అంచనాలు పెరిగాయి. ఫ్యాన్స్ అయితే పక్కా హిట్ అని అంటున్నారు. ట్రైలర్ కూడా  యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకెళ్తుంది. 

 ఈ రోజు ఉదయం పవన్  తన ఇద్దరు కుమారులు అకిరా నందన్(Akira Nandan)మార్క్ శంకర్(Mark Shankar)తో కలిసి మంగళగిరి(Mangalagiri)లో తన ఇంటికి వెళ్తున్నాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు అయితే  తండ్రి తనయులు అనే క్యాప్షన్ తో ఈ పిక్స్ ని షేర్ చేస్తున్నారు. మార్క్ శంకర్ కొన్ని నెలల క్రితం సింగపూర్ లోని ఒక స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి కోలుకున్న విషయం తెలిసిన విషయమే.